Samantha Naga Chaitanya: ఇండియాలోనే మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్ గా పేరు తెచ్చుకున్న జంటలలో ఒకటి నాగ చైతన్య , సమంత జంట. వీళ్లిద్దరి పెళ్లి ఒక సెన్సేషన్, అలాగే వీళ్లిద్దరు విడిపోవడం కూడా ఒక సెన్సేషన్. ఒకరి కోసం ఒకరు పుట్టినట్టుగా అనిపించే వీళ్లిద్దరు, ఏ కారణం చేత విడిపోయారో అర్థం కాక అభిమానులు ఇప్పటికీ జుట్టు పీక్కుంటున్నారు. గాసిప్ రాయుళ్లు విడిపోవడానికి వాళ్లకు తోచిన విధంగా ఎన్నో కథలను అల్లుతూ సోషల్ మీడియాలో ఆర్టికల్స్ ప్రచురితం చేసారు కానీ, అసలు నిజం ఏమిటి అనేది తెలియలేదు. అయితే నాగ చైతన్య రీసెంట్ గానే ప్రముఖ యంగ్ హీరోయిన్ శోభిత దూళిపాళ్ల తో నిశ్చితార్థం చేసుకోవడం తో విడాకులకు అసలు కారణం ఏమిటో జనాలకు ఒక క్లారిటీ వచ్చింది. సమంత తో విడాకులు జరిగిన రెండు నెలలకే నాగ చైతన్య శోభిత దూళిపాళ్లతో డేటింగ్ చేస్తున్నట్టు వార్తలు వచ్చాయి.
వీళ్లిద్దరు కలిసి టూర్స్ కి వెళ్ళినప్పుడు తీసుకున్న కొన్ని ఫోటోలు కూడా సోషల్ మీడియా లో వైరల్ అయ్యాయి. అది నిజం అని నమ్మిన వారు కొందరు, రూమర్ అనుకున్నవారు మరికొందరు, అయితే ఎట్టకేలకు నిజమే అని నిశ్చితార్థం ద్వారా అందరికీ అర్థం అయిపోయింది. అంటే శోభిత తో రిలేషన్ పెట్టుకోవడం వల్లనే వీళ్లిద్దరి మధ్య గొడవలు ఏర్పడి విడిపోయారా అనే సందేహం అభిమానుల్లో ఏర్పడింది. నేడు తెలంగాణ పర్యావరణం, అటవీ శాఖలకు మంత్రిగా వ్యవహరిస్తున్న కొండా సురేఖ మాట్లాడిన మాటలు విన్న తర్వాత అభిమానుల్లో ఉన్న సందేహమే నిజమైంది అనేది తెలుస్తుంది. ఆమె మాట్లాడుతూ ‘నాగ చైతన్య – సమంత విడిపోవడానికి కారణం కేటీఆర్. ఫోన్లు ట్యాప్ చేయడం వల్లే వాళ్ళిద్దరి మధ్య విబేధాలు ఏర్పడ్డాయి. ఇండస్ట్రీ లో అనేక మంది హీరోయిన్ల ఫోన్లను కేటీఆర్ ట్యాప్ చేయించాడు. అంతే కాదు హీరోయిన్స్ కి మత్తు పదార్థాలు అలవాటు చేసింది అతనే, కొంతమంది హీరోయిన్లు తొందరగా పెళ్లి చేసుకొని ఇండస్ట్రీ కి దూరం అవ్వడానికి కారణం కూడా అతనే’ అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతోంది.
అయితే కేటీఆర్ ట్యాప్ చేయించింది ఎవరు ఫోన్ ని?, సమంత దా?, లేకపోతే నాగ చైతన్య దా? అనేది తెలియాల్సి ఉంది. హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేస్తాడు అని మంత్రి గారు అన్నారు కాబట్టి, సమంత ఫోన్ ట్యాప్ చేశాడా?, ఆమె తప్పు చేయడం వల్లనే విడిపోవాల్సి వచ్చిందా, లేదా నాగ చైతన్య వైపు తప్పు ఉందా? అనేది కూడా ఇప్పుడు పెద్ద ప్రశ్న. వీళ్ళు విడిపోవడానికి ఎన్నో క్లూలు బయటకి వచ్చినా ఇంకా ఎదో ఒక విషయం లో క్లారిటీ మిస్ అవుతుంది. ఎందుకు విడిపోయారు అనేది వాళ్ళిద్దరితో ఎవరో ఒకరు చెప్తేనే తెలుస్తుంది, వాళ్లకు చెప్పాల్సిన అవసరం లేదు, ఎవరి కెరీర్స్ లో వాళ్ళు బిజీ గా ఉన్నారు. కాబట్టి ఈ విషయం ఎప్పటికీ మిస్టరీ గానే మిగిలిపోతుంది అనొచ్చు.
నాగచైతన్య, సమంత విడిపోవడానికి కారణం కేటీఆర్ : మంత్రి కొండా సురేఖ pic.twitter.com/JvSagxYW5U
— BIG TV Breaking News (@bigtvtelugu) October 2, 2024