Naga Chaitanya: విజయ్ దేవరకొండను రీప్లేస్ చేసిన నాగ చైతన్య …

Naga Chaitanya: సమంత నాగచైతన్య విడాకులు అనంతరం ఎవరి బిజీ షెడ్యూల్లో వాళ్ళు ఉంటున్నారు. కొత్త ప్రాజెక్ట్ కి కూడా వీరిద్దరు ఓకే చెప్తూ ప్రొఫెషనల్ లైఫ్ లో ముందుకు సాగుతున్నారు. లవ్ స్టోరీ ఘన విజయం అనంతరం చైతూ కొన్ని కథలకు  కూడా ఓకే చెప్తున్నాడు. కాగా సమంత బాలీవుడ్ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. శేఖర్ కమల నాగచైతన్య కాంబినేషన్లో  ‘లవ్ స్టోరీ’ సినిమా ప్రేక్షకుల ముందుకు […]

Written By: Raghava Rao Gara, Updated On : October 21, 2021 7:43 pm
Follow us on

Naga Chaitanya: సమంత నాగచైతన్య విడాకులు అనంతరం ఎవరి బిజీ షెడ్యూల్లో వాళ్ళు ఉంటున్నారు. కొత్త ప్రాజెక్ట్ కి కూడా వీరిద్దరు ఓకే చెప్తూ ప్రొఫెషనల్ లైఫ్ లో ముందుకు సాగుతున్నారు. లవ్ స్టోరీ ఘన విజయం అనంతరం చైతూ కొన్ని కథలకు  కూడా ఓకే చెప్తున్నాడు. కాగా సమంత బాలీవుడ్ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

శేఖర్ కమల నాగచైతన్య కాంబినేషన్లో  ‘లవ్ స్టోరీ’ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ సక్సెస్  అందుకున్న చైతు… ప్రస్తుతం  విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో ‘థాంక్యూ’ అనే సినిమాలో నటిస్తున్నాడు. అలానే విక్రమ్ రూపొందించనున్న హారర్ వెబ్ సిరీస్ లో కూడా నటించనున్నాడు. అయితే తాజాగా నందిని రెడ్డి చెప్పిన కథకు చైతు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారంట.

నందిని రెడ్డి డైరెక్టర్ గా అక్కినేని నాగ చైతన్య హీరో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ సంస్థ నిర్మించనుంది. చైతన్య థాంక్యూ’ సినిమా షూటింగ్ కూడా దాదాపుగా పూర్తయినట్లు తెలుస్తుండగా… ‘బంగార్రాజు’ సినిమా కోసం చైతు 25 రోజుల షూటింగ్ షెడ్యూల్ లో పాల్గొంటే సరిపోతుంది అని సమాచారం. తరువాత నందిని రెడ్డి సినిమాలో చేయనున్నారట చైతు. అయితే నందిని రెడ్డి విజయ్ దేవరకొండతో ఈ సినిమా చేయాలనుకున్నారట. అప్పట్లో విజయ్ కూడా ఆసక్తి చూపించాడు కానీ కొన్ని కారణాలు వలన ప్రాజెక్ట్ వర్కవుట్ అవ్వలేదని సినీ వర్గాల్లో చర్చించుకుంటున్నారు. ఇప్పుడు ఆ కథనే చైతుతో తీయబోతున్నారని సోషల్ మీడియాలో నెటిజన్లు పోస్ట్ లు చేస్తున్నారు.  కాగా మరోవైపు నందిని రెడ్డి , సామ్ బెస్ట్ ఫ్రెండ్స్ కావడంతో … ఆమె తో సినిమా తీయొద్దంటూ చైతూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.