
Samantha – Naga Chaitanya : అధికారికంగా నాగ చైతన్య-సమంత విడిపోయి 14 నెలలు అవుతుంది. 2021 అక్టోబర్ నెలలో విడాకుల ప్రకటన చేశారు. దానికి కొన్ని నెలల ముందు నుంచే విడివిడిగా ఉంటున్నారు. సమంత-నాగ చైతన్యలకు విబేధాలు ఎందుకు వచ్చాయంటే స్పష్టమైన సమాచారం లేదు. వ్యక్తిగత విషయాలు కావడంతో బయటకు రాలేదు. సమంత, నాగ చైతన్యలు ఎక్కడా ఓపెన్ కాలేదు. గొడవ మాత్రం పెద్దదే అన్నది విదితం. కొన్ని పుకార్లు మాత్రం తెరపైకి వచ్చాయి. ఎక్కువగా సమంతను బ్లేమ్ చేశారు. ఆమె మీద ఆరోపణలు గుప్పించారు.
ఇక సోషల్ మీడియా వేదికగా సమంత తన అసహనం బయటపెట్టింది. చైతూను పరోక్షంగా విమర్శిస్తూ పోస్ట్స్ పెడుతూ ఉండేవారు. బాలీవుడ్ టాక్ షో కాఫీ విత్ కరణ్ లో సమంత నేరుగానే కోపం ప్రదర్శించారు. ఆయన నా మాజీ భర్త మాత్రమే. మా ఇద్దరినీ ఒక గదిలో ఉంచాల్సి వస్తే కత్తులు కూడా ఉంచాలి… వంటి కామెంట్స్ చేసింది. సమంత కొన్నాళ్ళు డిప్రెషన్ అనుభవించారు. స్నేహితుల సహకారంతో, ఆధ్యాత్మిక మార్గంతో బయటపడ్డారు.

నాగ చైతన్య తన ఎమోషనల్ ఏ రూపంలో బయటపెట్టలేదు. ఆయన సోషల్ మీడియాను పెద్దగా వాడరు. చాలా అరుదుగా పోస్ట్స్ పెడుతూ ఉంటారు. సమంతతో విడాకులు అనంతరం ఆయన నటించిన రెండు సినిమాలు విడుదలయ్యాయి.ప్రమోషన్స్ కోసం మీడియా ముందుకు వచ్చారు. సమంతతో విడాకులు మేటర్ పై ఆయన స్పందించలేదు. అయితే సమంత అంటే ఆయనకు ఇంకా ఇష్టం అలానే ఉందన్న వాదన మొదలైంది. అందుకు ఆయన తాజా సోషల్ మీడియా పోస్ట్ కారణమైంది.

ఆయన రెండవ చిత్రం ఏమాయచేశావే విడుదలై 2023 ఫిబ్రవరి 26కి 13ఏళ్ళు. ఈ సందర్భంగా ఆయన ఏమాయచేశావే పోస్టర్ షేర్ చేశారు. సెలబ్రేటింగ్ 13 ఇయర్స్ అని కామెంట్ పెట్టారు. సమంతను కౌగిలించుకున్న పోస్టర్ ఆయన షేర్ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. తన మాజీ భార్యను నాగ చైతన్య ఇక్కడ తలచుకున్నట్లు అయ్యింది. ఈ క్రమంలో చైతన్యకు సమంత మీద ప్రేమ అలానే ఉందని కొందరు కామెంట్ చేస్తున్నారు. అదే సమయంలో సమంత ఏమాయచేశావే చిత్ర ప్రస్తావన తేకుండా… తన 13 ఏళ్ల సినీ జర్నీని ఉద్దేశిస్తూ పోస్ట్ పెట్టారు.