https://oktelugu.com/

Venu Swamy: నాగ చైతన్య ఎప్పటికీ తండ్రి కాలేడు, పెంపక లోపం కూడా కారణం… అభిమానుల గుండెల్లో గుబులు రేపుతున్న వేణు స్వామి కామెంట్స్

నాగ చైతన్య రెండో పెళ్ళికి సిద్ధమయ్యాడు. హీరోయిన్ శోభిత ధూళిపాళ్లతో ఆయనకు నిశ్చితార్థం జరిగింది. త్వరలో ఇద్దరు ఏడడుగులు వేయనున్నారు. ఈ క్రమంలో వేణు స్వామి నాగ చైతన్యను ఉద్దేశించి చేసిన కామెంట్స్ సంచలనం రేపుతున్నాయి. నాగ చైతన్యకు తండ్రి అయ్యే యోగం లేదని కుండబద్దలు కొట్టాడు.

Written By:
  • S Reddy
  • , Updated On : August 11, 2024 / 12:06 PM IST

    Venu Swamy

    Follow us on

    Venu Swamy: వేణు స్వామి తెలియని టాలీవుడ్ ఆడియన్స్ ఉండరు. ఆయన నటుడు కాకపోయినా పెద్ద సెలబ్రిటీ. వేణు స్వామికి చాలా కాలంగా చిత్ర పరిశ్రమతో అనుబంధం ఉంది. చిరంజీవి, బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోల చిత్రాలు ఆయన పూజా కార్యక్రమాలతో మొదలయ్యాయి. ఒకటి రెండు చిత్రాల్లో వేణు స్వామి జస్ట్ అలా కనిపించే పాత్రలు చేశాడు. వేణు స్వామి కాలక్రమేణా జ్యోతిష్యుడిగా ఎదిగాడు. ఆయన చెప్పినట్లు జరుగుతుందని భావించే సెలెబ్రిటీలు ఉన్నారు.

    మద్యం, మాంసం పెట్టి ఆయన ప్రత్యేక పూజలు చేస్తారు. దేశాన్ని ఊపేస్తున్న రష్మిక మందాన వేణు స్వామి శిష్యురాలు. తరచుగా ఆయనతో పూజలు చేయిస్తుంది. వేణు స్వామితో పూజలు నిర్వహించిన సెలెబ్రిటీల లిస్ట్ లో చాలా మంది ఉన్నారు. అదే సమయంలో వేణు స్వామి స్టార్ హీరోలు, రాజకీయ నాయకుల అనుమతి లేకుండా వారి జాతకాలు చెబుతాడు. వ్యక్తిగత విషయాలతో పాటు సినిమాలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేస్తాడు.

    పవన్ కళ్యాణ్, ప్రభాస్ లను ఉద్దేశించి వేణు స్వామి చేసిన కామెంట్స్ వివాదాస్పదం అయ్యాయి. ప్రభాస్ కి బాహుబలి 2 తర్వాత హిట్ పడదు. ఆయనకు కళ్యాణ యోగం లేదు. అనారోగ్య సమస్యలు ఉన్నాయంటూ అభిమానులు హర్ట్ అయ్యేలా వేణు స్వామి పలుమార్లు కామెంట్స్ చేశారు. దాంతో వేణు స్వామిని ప్రభాస్ ఫ్యాన్స్ ట్రోల్ చేస్తుంటారు.

    తాజాగా నాగ చైతన్య పై షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఆగస్టు 8న నాగ చైతన్యకు శోభిత ధూళిపాళ్లతో నిశ్చితార్థం జరిగింది. కొన్నాళ్లుగా రిలేషన్ లో ఉన్న ఈ జంట పెళ్లి బంధంలో అడుగుపెట్టేందుకు సిద్ధమయ్యారు. అత్యంత నిరాడంబరంగా నాగ చైతన్య నిశ్చితార్థం వేడుక నిర్వహించారు. నాగార్జున తన అధికారిక ఇంస్టాగ్రామ్ అకౌంట్ ద్వారా నాగ చైతన్య నిశ్చితార్థం పై ప్రకటన చేశారు. కొత్త కోడలు శోభిత ధూళిపాళ్లకు గ్రాండ్ వెల్కమ్ చెప్పాడు. కొత్త జంట కలకాలం సంతోషంగా కలిసి జీవించాలని కోరుకున్నాడు.

    అలా నాగ చైతన్యకు నిశ్చితార్థం జరిగిందో లేదో… వేణు స్వామి జాతకం పేరుతో దిగిపోయాడు. ఎప్పటిలాగే నాగ చైతన్య-శోభితల జాతకం ప్రకారం విడిపోతారని నెగిటివ్ కామెంట్స్ చేశారు. వాళ్ళు ఎప్పుడు విడిపోతారో టైం కూడా ఫిక్స్ చేసి చెప్పాడు. 2027 లోపే నాగ చైతన్య-శోభిత ఒకరికొకరు దూరం అవుతారు. ఓ మహిళ కారణంగా వారి మధ్య మనస్పర్థలు తలెత్తుతాయని వేణు స్వామి వెల్లడించాడు.

    ఇంతకు మించిన మరికొన్ని అనుచిత కామెంట్స్ చేశాడు వేణు స్వామి. నాగ చైతన్య జాతకరీత్యా తండ్రి అయ్యే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. అతడు సహజంగా తండ్రి కావడం కష్టం. అది తండ్రి స్థానం బలహీనంగా ఉండటం వలన కావచ్చు. పెంపకంలో లోటుపాట్లు ఉండొచ్చు, అన్నాడు. వేణు స్వామి కామెంట్స్ నేపథ్యంలో నాగ చైతన్య ఫ్యాన్స్ మండి పడుతున్నారు. ట్రోల్ చేస్తున్నారు.

    అయితే ఇటీవల వేణు స్వామి వేసిన కీలక అంచనాలు విఫలం చెందాయి. ఐపీఎల్ కప్ సన్ రైజర్స్ హైదరాబాద్ గెలుస్తుంది అన్నాడు. కానీ హైదరాబాద్ టీమ్ ఓడిపోయింది. తెలంగాణలో కేసీఆర్, ఏపీలో వైఎస్ జగన్ గెలుస్తారన్న ఆయన జ్యోతిష్యం తప్పయిన సంగతి తెలిసిందే.