Homeఎంటర్టైన్మెంట్Naga Chaitanya: NC 24 అప్డేట్: ఒక్క వీడియోతో మైండ్ బ్లాక్ చేశారు!

Naga Chaitanya: NC 24 అప్డేట్: ఒక్క వీడియోతో మైండ్ బ్లాక్ చేశారు!

Naga Chaitanya: మొన్నటి వరకు పరాజయాలతో ఇబ్బంది పడ్డాడు నాగ చైతన్య. ఆయన నటించిన థాంక్యూ, కస్టడీ నిరాశపరిచాయి. దాంతో నాగ చైతన్య రేసులో వెనుకబడ్డాడు. అయితే తండేల్ మూవీతో సక్సెస్ ట్రాక్ ఎక్కాడు. దర్శకుడు చందూ మొండేటి తెరకెక్కించిన తండేల్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. మూవీ రూ. 100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. నాగ చైతన్య కెరీర్లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా తండేల్ నిలిచింది. తండేల్ నాగ చైతన్యను పరాజయాల నుండి బయటపడేసింది. తండేల్ సక్సెస్ ఎంజాయ్ చేస్తున్న నాగ చైతన్య ఫ్యాన్స్ కి NC 24 అప్డేట్ మరింత కిక్ ఇచ్చేలా ఉంది.

Also Read: గ్రౌండ్ జీరో మూవీ టాక్, ఇమ్రాన్ హష్మీ వార్ డ్రామా ఎలా ఉందంటే?

విరూపాక్ష మూవీతో బ్లాక్ బస్టర్ కొట్టిన కార్తీక్ దండు తో నాగ చైతన్య తన 24వ చిత్రం చేస్తున్నాడు. విరూపాక్ష హారర్ థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కింది. సాయి ధరమ్ తేజ్ కి ఆ మూవీ గొప్ప కమ్ బ్యాక్ ఇచ్చింది. మొదటి చిత్రంతోనే భారీ హిట్ నమోదు చేసిన కార్తీక్ దండుకి నాగ చైతన్య ఆఫర్ ఇచ్చాడు. ఈసారి ఆయన భారీ బడ్జెట్ తో నాగ చైతన్య మూవీ రూపొందిస్తున్నారు. NC 24 మిథికల్ థ్రిల్లర్. ఈ ప్రాజెక్ట్ కోసం పెద్ద టీమ్ పని చేస్తుంది. ప్రీ ప్రొడక్షన్ కోసమే కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఆర్ట్ వర్క్, సెట్స్, అత్యాధునిక సాంకేతికత ఉపయోగిస్తున్నారు.

NC 24 కోసం టీమ్ ఏ స్థాయిలో కష్టపడుతున్నారో తెలియజేస్తూ వీడియో విడుదల చేశారు. ఈ వీడియో మూవీపై అంచనాలు పెంచేసింది. మూవీలో బలమైన కథతో పాటు, అబ్బుర పరిచే విజువల్స్ ఉంటాయని అర్థం అవుతుంది. బివిఎస్ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సుకుమార్ సైతం నిర్మాణ భాగస్వామిగా ఉన్నారు. మొత్తంగా NC 24 అప్డేట్ అదిరింది. కార్తీక్ దండు బాగా టాలెంట్ ఉన్న దర్శకుడు అని అర్థం అవుతుంది.

NC 24లో నటించే ఇతర నటులు, సాంకేతిక నిపుణుల వివరాలు తెలియాల్సి ఉంది. ఇక వివాహం అనంతరం నాగ చైతన్యకు గుడ్ టైం స్టార్ట్ అయ్యింది. గత ఏడాది డిసెంబర్ లో నాగ చైతన్య హీరోయిన్ శోభిత ధూళిపాళ్లను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోలో నిరాడంబరంగా వీరి వివాహం జరిగింది.

 

#NC24 - The Excavation Begins | Naga Chaitanya | Karthik Dandu | Sukumar | Ajaneesh

Exit mobile version