Kiccha Sudeep’s daughter : అయితే కిచ్చా సుదీప్ కూతురు శాన్వి సుదీప కూడా స్టార్ కిడ్గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది. ప్రస్తుతం శాన్వి సినిమాలలో తన అదృష్టం పరీక్షించుకునేందుకు సిద్ధంగా ఉంది. ప్రస్తుతం కిచ్చా సుదీప్ కూతురు శాన్వి సుదీప్ చదువుకుంటుంది. చదువుకుంటూనే శాన్వి ఎక్స్ట్రా కర్క్యులర్ యాక్టివిటీస్ లో కూడా బాగా చురుగ్గా ఉంటుంది. శాన్వి కి సింగింగ్ అంటే చాలా ఇష్టం. భవిష్యత్తులో ఈమె ఒక మంచి సింగర్ అవ్వాలని అనుకుంటుంది. ఇప్పటికే శాన్వి సుదీప్ పాప్ సాంగ్స్ తో కన్నడ నాట మంచి క్రేజ్ తెచ్చుకుంది. తాజాగా శాన్వి సుదీప్ ఒక తెలుగు సినిమాకు తన గొంతును అందిస్తుంది. టాలీవుడ్ హీరో నేచురల్ స్టార్ నాని సినిమాతో శాన్వి సుదీప్ టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తుంది.
Also Read : పోక్సో కేసు పెట్టాలి… కీరవాణి పై సీనియర్ డైరెక్టర్ సంచలన కామెంట్స్
నేచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ సినిమా హిట్ 3 సినిమాకు శాన్వి సుదీప్ వాయిస్ ఓవర్ ఇచ్చింది. ఈ విషయాన్ని ఒక ఇంటర్వ్యూలో హీరో నాని స్వయంగా తెలిపారు. దీంతో ఈ వార్తలను విన్న కిచ్చా సుదీప్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. శాన్వి సుదీప్ గొంతు బాగుంటుంది. శాన్వి పాప్ సాంగ్స్ చాలా అద్భుతంగా పాడుతుంది. జీ కన్నడలో ప్రసారమయ్యే సరిగమప వేదికపై అప్ప ఐ లవ్ యు పా పాటను శాన్వి సుదీప్ చాలా అద్భుతంగా ఆలపించి అందరి దృష్టిని తన వైపు తిప్పుకుంది. దాంతో శాన్వి సుదీప్ కు తెలుగు సినిమాకు అవకాశం వచ్చింది. లేటెస్ట్ గా రిలీజ్ అయిన హీరో నాని నటించిన హిట్ 3 సినిమా ట్రైలర్ లో కూడా శాన్వి సుదీప్ గొంతు వినిపిస్తుంది. కొన్ని రోజుల క్రితం రిలీజ్ అయిన ఈ ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి భారీ స్పందన వస్తుంది.
ముఖ్యంగా హిట్ 3 ట్రైలర్ లో వినిపించిన బిజీ ఎం మరియు వాయిస్ ఓవర్ స్పెషల్ అట్రాక్షన్ గా ఉన్నాయి. బాగా ఫేమస్ అయిన ఈ వాయిస్ ఓవర్ కిచ్చా సుదీప్ కూతురు శాన్వి సుదీప్ దే అంటూ హీరో నాని రివిల్ చేశాడు. ముఖ్యంగా హీరో నాని మరియు శాన్వి మధ్య పరిచయం ఏర్పడడానికి ఈగ సినిమా కారణం. రాజమౌళి దర్శకత్వం వహించిన ఈగ సినిమాలో నాని హీరోగా నటించిన సుదీప్ విలన్ పాత్రలో కనిపించిన సంగతి అందరికీ తెలిసిందే. ఈగ సినిమా షూటింగ్ సమయంలోనే హీరో నాని కి శాన్వికి పరిచయం అయింది. ఇప్పటికీ కూడా అనుబంధం కొనసాగుతుంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం శాన్వి హిట్ 3 లో అవకాశం అందుకుంది.