Naga Chaitanya- Samantha: హాట్ సన్నివేశాల్లో నటించడం వల్లే నాగచైతన్య సమంతకి విడాకులు ఇచ్చాడా..? వైరల్ అవుతున్న లేటెస్ట్ కామెంట్స్

అందులో భాగంగా ఆయన ఇచ్చిన కొన్ని ఇంటర్వ్యూస్ లో మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారాయి. సమంత గురించి అడిగిన ప్రశ్నలకు కూడా నాగచైతన్య ఎలాంటి మాస్క్ వేసుకోకుండా సమాధానం చెప్పాడు. ఆమె చాలా మంచి అమ్మాయి అని, ఈ ప్రపంచం లో ఉండే సంతోషం మొత్తానికి ఆమె అర్హురాలు అంటూ పొగడ్తలతో ముంచెత్తాడు.

Written By: Vicky, Updated On : May 13, 2023 7:56 am

Naga Chaitanya- Samantha

Follow us on

Naga Chaitanya- Samantha: అక్కినేని నాగ చైతన్య మరియు సమంత విడిపోయిన తర్వాత వీళ్లిద్దరి గురించి సోషల్ మీడియా లో ఇప్పటి వరకు ఎన్ని వార్తలు వచ్చాయో లెక్కే లేదు. సమంత కొన్ని సార్లు స్పందించినప్పటికీ నాగ చైతన్య మాత్రం పెద్దగా రియాక్ట్ అయ్యేవాడు కాదు. ఇది ఇలా ఉండగా నిన్న నాగచైతన్య హీరో గా నటించిన ‘కస్టడీ’ అనే చిత్రం విడుదల అయ్యింది. ఈ సినిమా విడుదలకు ముందు నాగ చైతన్య ప్రొమోషన్స్ అడగరగొట్టేసాడు.

అందులో భాగంగా ఆయన ఇచ్చిన కొన్ని ఇంటర్వ్యూస్ లో మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారాయి. సమంత గురించి అడిగిన ప్రశ్నలకు కూడా నాగచైతన్య ఎలాంటి మాస్క్ వేసుకోకుండా సమాధానం చెప్పాడు. ఆమె చాలా మంచి అమ్మాయి అని, ఈ ప్రపంచం లో ఉండే సంతోషం మొత్తానికి ఆమె అర్హురాలు అంటూ పొగడ్తలతో ముంచెత్తాడు.

ఇది ఇలా ఉండగా సోషల్ మీడియా లో ఆయన సమంత తో విడాకులు తీసుకోవడానికి కారణం ఇదేనంటూ ఎవరికీ తోచినట్టు వాళ్ళు రాసుకుంటూ వెళ్లిన సంగతి తెలిసిందే. వీటి ప్రస్తావన నాగ చైతన్య ముందుకు తీసుకొచ్చిన ఒక యాంకర్ కి ఆయన సమాధానం ఇస్తూ ‘నేను కూడా ఎన్నో చూసాను, మేమిద్దరం కేవలం ఒక వెబ్ సిరీస్ కారణం గా విడిపోయామని కూడా చెప్పారు, అందులో సమంత రొమాంటిక్ సన్నివేశాల్లో నటించడం వల్లే అలా జరిగిందని కూడా రాసారు,అలాంటివి చూసి నాకు చాలా బాధేసింది.

సమంత సినిమాలు నేను ఏదీ కూడా మిస్ కాకుండా చూసాను. ఆమె నటించిన ‘యశోద’ మరియు ‘శాకుంతలం’ సినిమాలను కూడా చూసాను’ అంటూ చెప్పుకొచ్చాడు నాగ చైతన్య. ఇక ఆయన ‘కస్టడీ’ చిత్రానికి మొదటి ఆట నుండే డివైడ్ టాక్ వచ్చిన సంగతి తెలిసిందే. ఫలితంగా ఓపెనింగ్స్ కూడా బాగా దెబ్బపడ్డాయి, నాగ చైతన్య కెరీర్ లో మరో డిజాస్టర్ గా నిలవబోతుందని చెప్తున్నారు ట్రేడ్ పండితులు.