Naga Chaitanya-JR NTR : వరుస ఫ్లాప్స్ ని ఎగురుకుంటూ కెరీర్ రిస్క్ లో ఉన్న సమయంలో అక్కినేని నాగ చైతన్య(Akkineni Naga Chaitanya) ‘తండేల్'(Thandel Movie) చిత్రంతో భారీ బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకొని మళ్ళీ ట్రాక్ లోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆయన ‘విరూపాక్ష’ డైరెక్టర్ తో హర్రర్ థ్రిల్లర్ చేస్తున్నాడు. బాహుబలి మేకర్స్ ఆర్కా మీడియా సంస్థ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తోంది. ఇదంతా పక్కన పెడితే నాగ చైతన్య కి కూడా తన తండ్రికి లాగానే వ్యాపార రంగంలో మంచి పట్టు ఉంది. సినిమా రంగాన్ని వదిలేసినా తర్వాత కూడా భారీ సంపాదన ఎలా సంపాదించొచ్చు, నాలుగు తరాలు తమ కుటుంబం లో కూర్చొని తిన్నా తరగని శాశ్వత సంపాదన ఎలా ఆర్జించాలి అనేది అక్కినేని నాగార్జున ని చూసి నేర్చుకోవచ్చు. కొడుకు నాగ చైతన్య కూడా ఆయన దారిలోనే వెళ్తున్నాడు.
Also Read : స్పిరిట్’ గురించి సందీప్ వంగ సెన్సేషనల్ అప్డేట్..ఫ్యాన్స్ కి పండగే!
కరోనా లాక్ డౌన్ సమయంలో నాగ చైతన్య హైదరాబాద్ లో తన స్నేహితులతో కలిసి ‘షోయు'(Show You) అనే రెస్టారంట్ పెట్టాడు. అన్ని దేశాలకు సంబంధించిన వంటకాలు ఈ రెస్టారంట్ లో ఉంటాయి. హైదరాబాద్ లో ఇటీవల కాలం లో గొప్ప పేరు తెచ్చుకున్న టాప్ 10 రెస్టారెంట్స్ లో ఇది కూడా ఒకటి. ఈ రెస్టారంట్ గురించి జూనియర్ ఎన్టీఆర్(Junior NTR) గొప్పగా ప్రమోట్ చేసాడు. గత ఏడాది ఆయన హీరోగా నటించిన ‘దేవర'(Devara Movie) చిత్రం కమర్షియల్ గా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిల్చిన సంగతి మన అందరికీ తెలిసిందే. ఈ చిత్రాన్ని మార్చి 28 న జపాన్ లో గ్రాండ్ గా విడుదల చేసారు మేకర్స్. ఈ సందర్భంగా ఎన్టీఆర్ తన సినిమాని ప్రమోట్ చేసుకోవడానికి జపాన్ మొత్తం తిరిగాడు. ప్రీమియర్ షోస్ లో పాల్గొని అక్కడి అభిమానులతో కలిసి డ్యాన్స్ వేసాడు. అనేక లోకల్ మీడియా చానెల్స్ కి ఇంటర్వ్యూస్ కూడా ఇచ్చాడు.
ఒక ఇంటర్వ్యూ లో రిపోర్టర్ ఎన్టీఆర్ ని ఒక ప్రశ్న అడుగుతూ ‘మీరు మంచి భోజన ప్రియులు అని విన్నాము. మా జపాన్ వంటకాలలో మీకు బాగా ఇష్టమైనది ఏమిటి?’ అని అడగగా, దానికి ఎన్టీఆర్ సమాధానం చెప్తూ ‘నాకు సూషీ వంటకం అంటే చాలా ఇష్టం. హైదరాబాద్ లో నా మిత్రుడు నాగ చైతన్య షోయు అనే రెస్టారంట్ ని స్థాపించాడు. అందులో ఈ వంటకం మీకు దొరుకుతుంది. నాలాగా ఈ వంటకాన్ని ఇష్టపడే వాళ్ళు ఎవరైనా ఉంటే, షోయు రెస్టారంట్ ని మీకు నేను రికమెండ్ చేస్తున్నాను. కేవలం సూషీ ఒక్కటే కాదు, అన్ని రకాల జపనీస్ వంటకాలు ఈ రెస్టారంట్ లో మీకు దొరుకుతాయి’ అంటూ చెప్పుకొచ్చాడు. ఆయన మాట్లాడిన ఈ మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. యూట్యూబ్ లో కూడా మీరు నాగచైతన్య రెస్టారంట్ విశేషాలకు సంబంధించిన వీడియోలను చూడొచ్చు.