Sandeep Reddy Vanga : రెబల్ స్టార్ ప్రభాస్(Rebel Star Prabhas) కెరీర్ లో ప్రస్తుతం తెరకెక్కుతున్న పాన్ ఇండియన్ సినిమాల్లో అభిమానులతో పాటు, ప్రేక్షకులు కూడా భారీ అంచనాలతో ఎదురు చూస్తున్న చిత్రం ‘స్పిరిట్'(Spirit Movie). ప్రభాస్ లాంటి కటౌట్ కి ఒక పవర్ ఫుల్ పోలీస్ స్టోరీ పడితే?, అది కూడా సందీప్ వంగ(Sandeep Reddy Vanga) లాంటోడు ఆ చిత్రానికి దర్శకత్వం వహిస్తే?, చూడకుండా ఉండే సినీ లవర్ ఎవ్వరైనా ఉంటారా?, అందుకే ఈ సినిమాపై అంచనాలు ఆ స్థాయిలో ఉన్నాయి. ఎప్పుడెప్పుడు ఈ సినిమా షూటింగ్ మొదలవుతుందా అని ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ సోషల్ మీడియా లో ప్రతీ రోజు ఎదో ఒకటి బయటకి వస్తూనే ఉంటుంది కానీ, అవేమి నిజాలు కాదు. కేవలం అనధికారిక అప్డేట్స్ మాత్రమే. సినిమా ఎప్పుడు మొదలు అవుతుంది, ఇందులో ఎవరెవరు నటిస్తున్నారు అనే అంశాలపై ఎలాంటి అధికారిక ప్రకటన ఇప్పటి వరకు రాలేదు.
Also Read : సల్మాన్ కెరీర్ లో వరస్ట్ ఓపెనింగ్స్..’సికిందర్’ పరిస్థితి ఇలా ఉందేంటి!
రీసెంట్ గానే అమెరికా లో జరిగిన ఒక ఈవెంట్ కి డైరెక్టర్ సందీప్ వంగ ముఖ్య అతిథిగా పాల్గొన్నాడు. ఈ ఈవెంట్ లో ఆయన స్పిరిట్ చిత్రం గురించి పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నాడు. ఆయన మాట్లాడుతూ ‘నా కెరీర్ లోనే ఎంతో ప్రతిష్టాత్మకమైన చిత్రం, త్వరలోనే ప్రభాస్ తో చేయబోతున్న స్పిరిట్. నా ఆలోచనలకూ తగ్గ లొకేషన్స్ కోసం చాలా రోజుల నుండి అన్వేషిస్తున్నాను. ఈమధ్యనే మెక్సికో లో కొన్ని అద్భుతమైన లొకేషన్స్ ని చూసాను. ఆ లొకేషన్స్ లోనే మా స్పిరిట్ చిత్రాన్ని ప్రారంభించబోతున్నాను’ అంటూ ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. అంటే స్పిరిట్ మూవీ షూటింగ్ అత్యధిక శాతం ఇండియా లో కాకుండా మెక్సికో ప్రాంతం లో జరగబోతుంది అన్నమాట. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని ఈ సినిమాకు సమందించి ఏదైనా అప్డేట్ వస్తుందేమో అని అభిమానులు ఆశించారు.
అలా ఆశించిన అభిమానులకు చుక్కెదురు అయ్యింది. అధికారిక అప్డేట్స్ కోసం ఇంకా కొన్ని రోజులు నిరీక్షించక తప్పేలా లేదు. సందీప్ వంగ ఒక సినిమాని ప్రారంభించే ముందు ఆయనకు ఒక అలవాటు. తన సినిమాకు మ్యూజిక్ ని ముందుగా తన అభిరుచికి తగ్గట్టుగా కంపోజ్ చేయించుకున్న తర్వాతనే సెట్స్ మీదకు ఒక సినిమాని తీసుకెళ్తాడు. అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ చిత్రాలకు అదే చేసాడు. ‘స్పిరిట్’ కి కూడా అదే ఫార్ములా ని అనుసరించాడు. స్క్రిప్ట్ వర్క్ మొత్తం లాక్ అయినా వెంటనే ఆయన మ్యూజిక్ సిట్టింగ్స్ లో కూర్చున్నాడు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో సహా, మ్యూజిక్ కి సంబంధించి అన్ని పూర్తి అయ్యాయని లేటెస్ట్ గా అందుతున్న సమాచారం. ఇక ప్రభాస్ డేట్స్ ఇస్తే షూటింగ్ ని మొదలు పెట్టడం ఒక్కటే మిగిలి ఉన్నది.
Also Read : విడుదలైన 2 రోజులకే ఓటీటీ లోకి ‘రాబిన్ హుడ్’, ‘మ్యాడ్ స్క్వేర్’!