Ram Gopal Varma: వివాదాల రామ్ గోపాల్ వర్మ అంటేనే.. వివాదానికి కేంద్ర బిందువు. తన గురించి ఎవరు ఏమనుకుంటారో ? తన చేష్టల పై ఈ ప్రపంచం ఎలా ఫీల్ అవుతుందో ? లాంటి వాటి గురించి వర్మ అస్సలు ఆలోచించడు. వర్మ అంటేనే డిఫరెంట్, వర్మ అంటేనే ప్రత్యేకం. అయితే, ఈ మధ్య వర్మలో పైత్యం మరీ ఎక్కువైంది. కాదు, ముదిరిపోయింది. వయసు పెరిగిన ప్రభావమో లేక, వర్మలో విపరీత చేష్టల ప్రభావమో గాని.. వర్మలో క్లారిటీ మిస్ అవుతుంది.
రోజుకొక రకంగా కామెంట్ చేస్తూ బలవంతంగా తన కాలాన్ని నెట్టుకొస్తున్నాడు. నిజానికి వర్మ చాలా ప్రాక్టికల్ గా ఉంటాడు, కానీ ప్రస్తుతం ఆ ప్రాక్టికల్ నెస్ లాస్ అవుతూ ఉంది. మైక్ ముందు ఒకలా నాలుగు గోడల మధ్య మరోలా ఉండే వర్మ.. ఈ మధ్య అన్ని చోట్లా ఒకేలా ఉంటున్నాడట. అయితే, వర్మ సోదరి విజయలక్ష్మి.. గతంలో వర్మ ఎలా ఉండేవాడో తాజాగా అనేక విషయాలు చెప్పుకొచ్చింది,
Also Read: ఓటింగ్ శాతం ఆమెకే ఎక్కువ.. ఆ ఇద్దరిలో ఒకరు ఎలిమినేట్ కాక తప్పదా..!
విజయలక్ష్మికి చిన్నతనంలో రేడియో అంటే చాలా ఇష్టం అట. ఆ ఇష్టం తెలుసుకుని, ఓసారి ఆమెకు వర్మ ఓ బుల్లి రేడియో కొనిపెట్టాడు. దాన్ని విజయలక్ష్మి కూడా చాలా ఇష్టంగా అపురూపంగా చూసుకునేవారు. అయితే, ఓ రోజు ఆ రేడియో కింద పడి పగిలిపోయింది. అది చూసి విజయలక్ష్మి ఏడుస్తూ ఉంటే.. వర్మ ఆమెను ఓదార్చుకుందా.. ‘రేడియో పగిలిపోతే రిపేరు చేయాలి. ఏడిస్తే అతుక్కోదు కదా’ అంటూ రేడియో తీసుకెళ్లి రిపేర్ చేసి తీసుకొచ్చాడట.
వర్మ అంత ప్రాక్టికల్ పర్సన్. అన్నట్టు వర్మలో మంచి కవి కూడా ఉన్నాడు. ఆ కవి గురించి ఎవరికీ తెలియదు అని విజయలక్ష్మి చెప్పింది. వర్మకి సంగీతం అంటే చాలా ఇష్టం. ఓ రోజు రేడియో లోంచి సుశీల పాట వస్తోంది. ఆ పాట విన్న వర్మ.. ‘ఏమిటి..? రేడియో లోంచి అమృతం కారుతోంది..’ అని అద్భుతమైన కాంప్లిమెంట్ ఇచ్చాడట. ఈ కామెంట్ నిజంగానే అద్భుతంగా ఉంది.
వర్మలో నిజంగా ఇంత అద్భుతమైన కవి ఉన్నాడా ? అనిపిస్తోంది. అన్నట్టు అస్సలు తనకు సెంటిమెంట్లు లేవు అని చెప్పే వర్మకు ఒక సెంటిమెంట్ ఉంది. తన అమ్మా – చెల్లెలు ఏడిస్తే వర్మకు అస్సలు నచ్చదట. వాళ్ళు ఏడుస్తూ కనిపిస్తే.. వర్మ కూడా ఏడుస్తాడట. అందుకే, తన తండ్రి పోయినప్పుడు కూడా.. వాళ్లు ఏడవకుండా ఉండటానికి వర్మ చాలా నాటకాలు ఆడాడు అట.
చివరి క్షణం వరకూ తన తండ్రి చనిపోయాడు అని కూడా వాళ్లకు చెప్పలేదు అట. అయితే, ”ఏడిస్తే బాధ పోదు. దానికి సొల్యూషన్ వెతకాలి అనేది.. వర్మ సిద్ధాంతం. ఇంత ప్రాక్టికల్ గా ఉండే వర్మ, ప్రస్తుతం చాలా సిల్లీగా ప్రవర్తిస్తున్నాడు. అనవసరమైన కామెంట్స్ చేస్తూ తన స్థాయిని తగ్గించుకుంటున్నాడు. ‘వర్మ మన ఖర్మ’ అనుకునే స్థితికి వర్మ దిగజారిపోవడం చాలా బాధాకరమైన విషయం.
Also Read: హౌస్‌లో హంగామా సృష్టిస్టున్న ముమైత్.. ఛాలెంజర్స్ టీమ్‌తో పెద్ద గొడవ