Surya Kanguva Movie : ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 13 గెటప్స్..సూర్య ‘కంగువ’ లో ఉండే ట్విస్టులు చూస్తే మతిపోతుంది!

తమిళంలో అజిత్ తో అనేక సూపర్ హిట్ సినిమాలను తెరకెక్కించిన శివ ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. అలాగే దిషా పటాని హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో బాబయ్ డియోల్ (ఎనిమల్ ఫేమ్) విలన్ గా నటించాడు. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదలైన థియేట్రికల్ ట్రైలర్ కి అభిమానుల నుండి, ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది.

Written By: Vicky, Updated On : October 24, 2024 9:57 pm

Surya Kanguva Movie

Follow us on

Surya Kanguva Movie : సూర్య అభిమానులు చాలా కాలం నుండి ఆయన నుండి ఒక భారీ హిట్ కోసం ఎదురు చూస్తున్నారు. గడిచిన కొన్నేళ్ల నుండి సూర్య నటించిన ప్రతీ సినిమా అభిమానులను నిరాశ పరుస్తూ వచ్చింది. ముఖ్యంగా సూర్య కి తమిళ మార్కెట్ తో పాటు, తెలుగు మార్కెట్ కూడా అత్యంత కీలకం. వరుస ఫ్లాప్స్ కారణంగా తెలుగు లో కూడా ఆయన మార్కెట్ బాగా డౌన్ అయ్యింది. ‘సెవెంత్ సెన్స్’, ’24’ వంటి చిత్రాలు తమిళం ఫ్లాప్ అయ్యాయి, కానీ తెలుగులో మాత్రం సూపర్ హిట్స్ గా నిలిచాయి. అలాంటి మార్కెట్ ఒకప్పుడు సూర్య కి ఉండేది. ఇప్పుడు ఆ రేంజ్ లేదు, బాగా తగ్గిపోయింది. అందుకే ఈసారి కొడితే మామూలుగా ఉండకూడదు, ఏకంగా కుంభస్థలాన్ని బద్దలు కొట్టాలి అనే కసితో ‘కంగువ’ అనే చిత్రం చేసాడు.

తమిళంలో అజిత్ తో అనేక సూపర్ హిట్ సినిమాలను తెరకెక్కించిన శివ ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. అలాగే దిషా పటాని హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో బాబయ్ డియోల్ (ఎనిమల్ ఫేమ్) విలన్ గా నటించాడు. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదలైన థియేట్రికల్ ట్రైలర్ కి అభిమానుల నుండి, ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. చూస్తుంటే సూర్య కం బ్యాక్ భారీ రేంజ్ లో ఉంటుందని అందరికి అనిపించింది. ఇది ఇలా ఉండగా ఈ సినిమా స్టోరీ లైన్ ఇప్పుడు సోషల్ మీడియా లో లీకై తెగ వైరల్ గా మారింది. సినిమాపై మరింత అంచనాలు పెంచేలా చేసింది. టైం ట్రావెల్ నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కింది. ఇందులో సూర్య ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 13 డిఫరెంట్ గెటప్స్ తో కనిపించబోతున్నాడట.

ఇదివరకు ఈ స్థాయి గెటప్స్ కమల్ హాసన్ మాత్రమే ‘దశావతారం’ చిత్రం లో వేసాడు. ఇన్ని రోజులు పదిలంగా ఉన్నటువంటి ఈ రికార్డుని సూర్య బద్దలు కొట్టేసాడు. ప్రస్తుత కాలం లో ఉన్నటువంటి గూఢచారి ని, టైం మెషిన్ ద్వారా వందల ఏళ్ళ కాలం నాటి ‘కంగువ’ అనే అడవి రాజు కలుస్తాడు. ఈ నేపథ్యం మొత్తం చాలా ఆసక్తికరంగా, ఎన్నో ట్విస్టుల నడుమ స్క్రీన్ ప్లే కొనసాగుతుందట. అవి చూసే ఆడియన్స్ కి థియేటర్స్ లో అద్భుతమైన అనుభూతి కలిగిస్తుందని అంటున్నారు. ముఖ్యంగా ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ని చేస్తున్న టీం పదే పదే చూసిన సన్నివేశాలని రిపీట్ లో చూస్తూనే ఉండిపోయారట. ఆ రేంజ్ లో ఔట్పుట్ వచ్చిందని అంటున్నారు. మన టాలీవుడ్ కి బాహుబలి, #RRR ఎలాగో, కోలీవుడ్ లో ‘కంగువ’ అలా చరిత్రలో నిలిచిపోతుందని అంటున్నారు. నవంబర్ 14 న తెలుగు, హిందీ, తమిళం,కన్నడం మరియు మలయాళం భాషల్లో విడుదల అవ్వబోతున్న ఈ సినిమా అంచనాలను అందుకుంటుందా లేదా అనేది చూడాలి.