Naga Chaitanya: సమంత ఫ్రెండ్ తో నాగ చైతన్య నెక్స్ట్ సినిమా…

Naga Chaitanya: నాగ చైతన్య – సమంత విడాకులు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే.  కానీ వాళ్లు మాత్రం ఎవరు సినిమాలో వాళ్లు బిజీగా ఉన్నారు. సమంత గుణశేఖర్ దర్శకత్వంలో నటించిన శాకుంతలం ఇటీవల కంప్లీట్ అయ్యింది. అలానే చైతన్య ” లవ్ స్టోరీ ” విజయ బాటలో దూసుకెళ్తూ … కలెక్షన్ల పరంగా మంచి వసూళ్లు సాధిస్తుంది.  ప్రస్తుతం ‘థాంక్యూ’ సినిమా షూటింగ్ లో చైతు బిజీగా ఉన్నారు. అయితే […]

Written By: Raghava Rao Gara, Updated On : October 20, 2021 8:36 pm
Follow us on

Naga Chaitanya: నాగ చైతన్య – సమంత విడాకులు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే.  కానీ వాళ్లు మాత్రం ఎవరు సినిమాలో వాళ్లు బిజీగా ఉన్నారు. సమంత గుణశేఖర్ దర్శకత్వంలో నటించిన శాకుంతలం ఇటీవల కంప్లీట్ అయ్యింది. అలానే చైతన్య ” లవ్ స్టోరీ ” విజయ బాటలో దూసుకెళ్తూ … కలెక్షన్ల పరంగా మంచి వసూళ్లు సాధిస్తుంది.  ప్రస్తుతం ‘థాంక్యూ’ సినిమా షూటింగ్ లో చైతు బిజీగా ఉన్నారు. అయితే ఇప్పుడు చైతూ త్యార్వత చేయబోయే సినిమా గురించి ఒక ఆసక్తికర విషయం సినీ వర్గాల్లో చర్చించుకుంటున్నారు.

లేడీ డైరెక్టర్ గా పేరుపొందిన నందిని రెడ్డి సినిమాలో చైతు నటిస్తున్నారని ఇటీవల కాలంలో వార్తలు వస్తున్నాయి. నాగ చైతన్య డైరెక్టర్ నందిని రెడ్డి కాంబినేషన్ లో ఎస్ ‌.ఆర్ .టి. ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో ఒక సినిమా రాబోతుంది. సమంత నందిని రెడ్డి కాంబినేషన్ లో రెండు సినిమాలు చేసింది. అదే విధంగా నందిని రెడ్డి డైరక్షన్ లో  ఆహా లో ప్రసారమైన “సామ్ జామ్ ” షో ప్రేక్షకులలో ఆదరణ పొందింది. వ్యక్తిగతంగా కూడా వీళ్ళిద్దరూ  మంచి స్నేహితులు.

ప్రస్తుతం ఇదే పెద్ద సమస్య అయింది చైతూకి. నాగ చైతన్య అభిమానులు సమంత ఫ్రెండ్ నందిని రెడ్డితో సినిమా చేయొద్దని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. నందిని రెడ్డితో  సినిమా ఎందుకు ఓకే చేశారంటూ కామెంట్స్ పెడుతున్నారు‌. సినిమా పరిశ్రమ వాళ్ళకి వ్యక్తిగత జీవితం వేరు, సిని జీవితం వేరని పలువురు వారికి సర్ది చెప్పేందుకు యత్నిస్తున్నారు. భవిష్యత్తులో నాగచైతన్య,  సమంత జంటగా నటిస్తే తమ అభిమానులు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.