అక్కినేని ఫ్యామిలీకి తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా మంచి గుర్తింపు అయితే ఉంది. ఇక అక్కినేని నాగేశ్వరరావు దగ్గర నుంచి ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న నాగార్జున, నాగచైతన్య, అఖిల్ వరకు వాళ్ళ ఫ్యామిలీకి ఎనలేని గుర్తింపు ఉండడంతో పాటుగా ప్రేక్షకుల హృదయాలను దోచుకున్న ఫ్యామిలీ గా ప్రతి ఒక్కరు వాళ్లని ఎప్పటికీ గుర్తుంచుకుంటారు. ఇక ఇదిలా ఉంటే నాగచైతన్య దూళిపాళ్ల కి ఈరోజు పెళ్లి జరుగుతున్న విషయం మనకు తెలిసిందే. ఇక కొద్దిసేపటి క్రితమే వీళ్లకు పెళ్లి అయినట్టుగా నాగార్జున అధికారికంగా ఫోటోలను షేర్ చేస్తూ తనను ఆనందాన్ని అభిమానులతో పంచుకుంటున్నాడు. ఇక మొత్తానికైతే ఈ జంట చూడు ముచ్చటగా ఉంది అంటూ వీళ్ళ పెళ్లి ఫోటోలు చూసిన చాలామంది సినిమా ప్రేక్షకులు అలాగే అక్కినేని అభిమానులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.
ఇక నాగ చైతన్య కూడా గతం గురించి పట్టించుకోకుండా ఒక కొత్త లైఫ్ ను లీడ్ చేయాలనే ఉద్దేశ్యం తో చాలా జోష్ గా ఉన్నట్టుగా కనిపిస్తున్నాడు. ఇక నూతన వధూవరులను ఆశీర్వదించడానికి కొంతమంది సినీ సెలబ్రిటీలు సైతం ఈ పెళ్లికి హాజరవ్వడం విశేషం. ఇక ఏది ఏమైనా కూడా అక్కినేని నాగచైతన్య శోభిత ధూళిపాళ్ల జంట చూడముచ్చటగా ఉన్నారు.
ఇక అక్కినేని అభిమానులు సైతం కొద్దిరోజులు క్రితం నుంచి నిరాశ చెందుతున్నారు. ఇక వీళ్ళ పెళ్లి వార్త వచ్చినప్పుడు వాళ్లలో ఒక నూతన ఉత్సాహం అయితే వచ్చింది. ఇక ప్రస్తుతం పెళ్లి తర్వాత వీళ్లిద్దరూ ఒకటవ్వడంతో ఆ ఫోటోలను చూసిన అభిమానుల ఆనందానికి అవధులు లేవనే చెప్పాలి.
ఇక అక్కినేని అభిమానులు సోషల్ మీడియాలో వీళ్ళ పెళ్లి ఫోటోలు షేర్ చేస్తూ మా అన్న నాగ చైతన్య పెళ్లి చేసుకున్నాడు అంటూ వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ఇక ఏది ఏమైనా కూడా ఈ జంట ఎలాంటి మనస్పర్థలు లేకుండా కలకాలం కలిసి మెలిసి ఉండాలని కోరుకుందాం…
Watching Sobhita and Chay begin this beautiful chapter together has been a special and emotional moment for me. Congratulations to my beloved Chay, and welcome to the family dear Sobhita—you’ve already brought so much happiness into our lives.
This celebration holds… pic.twitter.com/oBy83Q9qNm
— Nagarjuna Akkineni (@iamnagarjuna) December 4, 2024