Naga Chaitanya and Samantha: నాగచైతన్య – సమంత విడిపోతున్నారు అనే వార్త గత కొన్ని రోజులుగా వైరల్ అవుతూనే ఉంది. తాజాగా ఆ వార్తకు క్లారిటీ ఇచ్చాడు చైతు. సమంత తాను విడిపోతున్నామని చెప్పి ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులకు కూడా షాక్ ఇచ్చాడు. చైతు తన ట్విటర్ లో పోస్ట్ చేస్తూ… సమంత, తాను నిజంగానే విడిపోతున్నామని, భార్య, భర్తలకు విడిపోయినా.. ఎప్పటికీ మంచి స్నేహితులుగానే ఉంటామని చైతు స్పష్టం చేసాడు.

చైతు – సామ్ మూడేళ్ళ పాటు ఘాడంగా ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. క్రేజీ కపుల్ గా టాలీవుడ్ లో గుర్తింపు కూడా దక్కింది. పైగా పెళ్లి తర్వాత ఇద్దరి కెరీర్లూ వరుస సక్సెస్ ట్రాక్ లో పడ్డాయి. అయినా ఈ జంట విడాకుల దిశగా వెళ్లడం ఆశ్చర్యకరమైన విషయమే. ఇన్నాళ్లు విడాకుల విషయం పై ఇద్దరు స్పందించడానికి కూడా ఇష్టపడకుండా..
ఇలా సడెన్ గా చైతు మేము విడిపోతున్నాం.. కారణం మా దారులు వేరు అంటూ సింపుల్ గా మెసేజ్ పెట్టడం షాకింగే. సమంత మాత్రం “నేను సమయం వచ్చినప్పుడు మాత్రమే ఇలాంటి వాటికి స్పందిస్తాను” అంటూ విడాకుల గురించి మాట్లాడలేదు. మరోపక్క విడాకుల నేపథ్యంలో సమంత, చైతు నుంచి ఎక్కువ భరణం తీసుకుంటుంది అంటూ మరో పుకారు ప్రస్తుతం బాగా వినిపిస్తోంది.
సమంత 200 కోట్లు భరణం అడిగిందని కూడా రూమర్స్ వస్తున్నాయి. అందుకే సమంత ఈ విషయం పై స్పందించడానికి ఆసక్తి చూపించడం లేదట. ఇక ఇండస్ట్రీ ఇన్ సైడ్ వర్గాల నుంచి వినిపిస్తోన్న టాక్ ప్రకారం అక్కినేని కుటుంబం కూర్చుని.. సమంతకి 50 కోట్ల నగదు ఇస్తున్నారని తెలుస్తోంది.
నిజానికి చైతు – సామ్ మధ్య గొడవలని పరిష్కరించడానికి నాగార్జున కూడా ప్రయత్నించారని.. అయినా ఇద్దరూ వెనక్కి తగ్గలేదని తెలుస్తోంది. ప్రస్తుతం సమంత అదే ఇంట్లోకి షిఫ్ట్ అయింది. సమంత ఇండిపెండింట్ వుమెన్. తన సొంత కాళ్ల పై స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.