Naga Chaitanya Samantha Divorce : అక్కినేని కుటుంబం.. టాలీవుడ్ కు మూలస్తంభాల్లో ఒకరైన అక్కినేని నాగేశ్వరరావు నట వారసత్వాన్ని కొనసాగిస్తున్నాడు నాగార్జున.. తండ్రికి తగ్గ తనయుడిగా.. టాలీవుడ్ లో ప్రస్తుతం నలుగురు మూలస్థంభాల్లో ఒక టాప్ హీరోగా నిలబడ్డాడు. తండ్రి ఏఎన్ఆర్ వారసత్వాన్ని కంటిన్యూ చేస్తున్నాడు. అయితే ఆయన కుమారుల పరిస్థితి మాత్రం ఇప్పటికీ అటు సినిమాల్లో ఇటు వ్యక్తిగత జీవితాల్లో అగమ్యగోచరంగా తయారైంది.

అయితే సినీ ఇండస్ట్రీలో అక్కినేని కుటుంబానికి పేరు, పరపతి, ప్రఖ్యాతలు అన్నీ ఉన్నాయి.. కానీ వారి వ్యక్తిగత జీవితాలను చూస్తే మాత్రం చిన్నాభిన్నంగానే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా భార్యలతో విడిపోయి విడాకులు తీసుకుంటున్న వైనం కనిపిస్తోంది.
హీరో నాగార్జున సైతం ఏఎన్ఆర్ కుమారుడిగా సినీ ఇండస్ట్రీకే చెందిన బడా నిర్మాత రామానాయుడు కూతురును మొదటి వివాహం చేసుకున్నాడు. స్టార్ హీరో వెంకటేశ్ చెల్లెలు సంబంధాన్ని పెద్దలు కుదర్చగా పెళ్లి చేసుకున్నాడు. వీరిద్దరికి ‘నాగచైతన్య’ సంతానంగా జన్మించాడు. అయితే విభేదాలతో నాగార్జున, నాగచైతన్య తల్లి విడిపోయారు. ఆ తర్వాత తనకు సినిమాల్లో పరిచయమైన ‘అమల’ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు నాగార్జున. పెళ్లి చేసుకున్నాక అమల పద్ధతిగా సినిమాలు వదిలేసి సంసార జీవితంలోకి రావడంతో వీరి మధ్య ఎలాంటి విభేదాలు రాకుండా కలిసి కాపురం చేస్తున్నారు. సంవత్సరాలుగా కలిసి ఉంటున్నారు. వీరికి అఖిల్ కూడా జన్మించాడు. ప్రస్తుతం హీరోగా కొనసాగుతున్నాడు.
ఇక నాగార్జున కుమారుల విషయానికి వస్తే.. పెద్ద కొడుకు నాగచైతన్య ప్రేమించి మరీ స్టార్ హీరోయిన్ సమంతను వివాహం చేసుకున్నాడు. తొలి సినిమాలోనే వీరిద్దరూ డెబ్యూలో ప్రేమలో పడి అనంతరం చాలా రోజులు ప్రేమించుకొని ఒక్కటయ్యారు. అయితే ఏమైందో ఏమో కానీ… ఇప్పుడు విడాకులు తీసుకున్నట్టు ప్రకటించారు. సమంత పెళ్లి అయ్యాక కూడా సినిమాలు తీయడం.. పలు హాట్ హాట్ చిత్రాల్లో నటించడం.. అక్కినేని కుటుంబానికి అవి పరువు తక్కువ కావడం.. వాళ్లు అభ్యంతరం తెలిపారన్న గుసగుసలు వినిపించాయి. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తి విడిపోయినట్టు ప్రచారం సాగింది.
ఇక చిన్న కొడుకు అఖిల్ ది కూడా పెళ్లి వరకూ వచ్చి విడిపోయిన చరిత్ర ఉంది. ఓ బడా పారిశ్రామిక వేత్త కుమార్తెను అఖిల్ ప్రేమించి చిన్న వయసులోనే నిశ్చితార్థం కూడా చేసుకున్నాడు. ఈ గ్రాండ్ సెర్మనీ తర్వాత ఏమైందో కానీ విభేదాలతో క్యాన్సిల్ చేసుకొని పెళ్లి కాకుండానే వీరిద్దరూ విడిపోయారు. అనంతరం చాలా రోజులు అఖిల్ బయట కనిపించకుండా డిప్రెషన్ లోకి వెళ్లాడన్న రూమర్ కూడా వినిపించింది.
ఇలా నాగార్జున , నాగచైతన్య జీవితాల్లో మొదటి పెళ్లి పెటాకులై విడాకులకు దారితీసింది. ఇక రెండో కొడుకు అఖిల్ జీవితంలోనూ పెళ్లి వరకూ వచ్చి రద్దు అయ్యింది. కొసమెరుపు ఏంటంటే నాగార్జున మేనల్లుడు సుమంత కూడా పెళ్లి చేసుకొని హీరోయిన్ కీర్తి సురేష్ తో విడాకులు తీసుకొని ఇప్పుడు ఒంటరిగా జీవిస్తున్నాడు. ఇలా వారి వ్యక్తిగత జీవితాల్లో మొదటి గండం గురించి ఇప్పుడు చర్చ సాగుతోంది.