సౌత్ ఫిలిం ఇండస్ట్రీలోనే మెస్ట్ లవ్లీ కపుల్ లిస్ట్ లో ‘నాగచైతన్య, సమంత’ జంట ముందు వరుసలో ఉంటుంది. ‘ఏం మాయ చేశావే’ సినిమాతో మొత్తానికి తెలుగు ప్రేక్షకులతో పాటు చైతును కూడా మాయ చేసింది సమంత. అయితే, చాల కాలం పాటు తమ ప్రేమ వ్యవహారాన్ని దాచుకుంటూ వచ్చిన ఈ జంట ఫైనల్ గా పెళ్లితో ఒక్కటైంది. ఇక సమంత పెళ్లి తరువాత కూడా యమా యాక్టివ్ గా సినిమాలు చేసుకుంటూ పోతుంది.
పనిలో పనిగా సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. ముఖ్యంగా చైతుతో ఏ హీరోయిన్ అయినా కాస్త క్లోజ్ గా మూవ్ అవుతూ చిన్న ఫోటో దిగినా సరే.. వెంటనే ఆ ఫోటో పై కౌంటర్ వేయడం సమంతకి అలవాటు. అందుకే నెటిజన్లు కూడా చైతుతో ఏ హీరోయిన్ అయినా క్లోజ్ గా దిగిన ఫోటో కనిపిస్తే చాలు.. వెంటనే ఆ ఫోటోను సమంతకు ట్యాగ్ చేస్తూ ఆమె రియాక్షన్ కోసం ఎదురుచూస్తూ ఉంటారు.
అయితే, తాజాగా బబ్లీ బ్యూటీ రాశీ ఖన్నా, చైతుతో కలిసి క్లోజ్ గా ఒక ఫోటో దిగింది. చైతు లాప్ టాప్ లో ఏదో పని చేసుకుంటూ ఉండగా.. వెనక నుంచి రాశీ చైతుని గట్టిగా కౌగిలించుకుంటూ కనిపిచింది. ఆ సమయంలో చైతు కూడా కాస్త సిగ్గు పడుతూ ఆమె వైపు ప్రేమగా చిన్న లుక్ ఇచ్చాడు. మొత్తానికి ఈ పిక్ ఇప్పుడు తెగ వైరల్ అవుతుంది. నెటిజన్లు తెగ షేర్ చేస్తూ లైక్ చేస్తున్నారు.
మరి ఈ ఫోటోని సమంత చూసి ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. ఇక నాగచైతన్య, రాశీ ఖన్నాలు కలిసి ‘థాంక్యూ’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి ‘విక్రమ్ కె కుమార్’ దర్శకత్వం వహిస్తున్నాడు. ఓ డిఫెరెంట్ సబ్జెట్ తో రాబోతున్న ఈ సినిమా పై మంచి అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతానికి కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఈ సినిమా షూటింగ్ పోస్ట్ ఫోన్ అయింది.