నేడు డాటర్స్ డే.. అంటే కూతుళ్ల దినోత్సవం. కూతుళ్ల పై ప్రేమానురాగాలను కురిపించడానికి ఇంగ్లీషోళ్ళు పెట్టుకున్న రోజు ఇది. అయితే కూతుళ్ల దినోత్సవాన్ని ప్రతి ఆడపిల్ల తండ్రి జరుపుకోవాలి. అసలు అమ్మాయి పుట్టిందంటే పెదవి విరుపులు విరిచే కాలం నుండి.. మా ఇంటి మహాలక్ష్మి అనే రోజుల్లోకి కూతుళ్ళు వచ్చేశారు. మారిన పరిస్థితులు నేపధ్యంలో.. ఇప్పుడు మాకు ఆడపిల్లనే కావాలి అని తల్లిదండ్రులు ఆశ పడేంతగా రోజులు మారిపోయాయి. అంతలా ఆడపిల్లల పై జనంలో చైతన్యం వచ్చింది. మరి ప్రస్తుతం కొడుకులే గుదిబండగా మారుతున్న తరుణంలో తల్లిదండ్రులు ఆడపిల్లల్ని ఇంటి దీపాలుగా భావించడంలో ఆశ్చర్యం ఏముంది. అందుకే ప్రతి తండ్రి తన కూతురు పై ఎంతో ప్రేమను కురిపిస్తూ ఉంటాడు.
Also Read: కేకలు పెట్టిన పాయల్ రాజ్‌పుత్..
కాగా ఈ డాటర్స్ డే సందర్భంగా నాగబాబు కూడా తన కూతురు నిహారిక గురించి, ఆమె మీద తన ప్రేమ గురించి తన శైలిలో చెప్పుకొచ్చాడు. ఈ మెగా బ్రదర్‌కి తన కూతురు నిహారిక అంటే పంచ ప్రాణాలు అట. నాగబాబు తన కూతురు మీదున్న ప్రేమ గురించి అలాగే కూతుళ్ళు గురించి చెబుతూ.. ‘మనం కలలు కనే చిట్టి దెయ్యాల రూపంలో కూతుళ్ళు ఈ భూమ్మీదకు వస్తారు. మనల్ని నవ్వించేందుకు, మనల్ని ఏడిపించేందుకు, మనల్ని ఆట పట్టించేందుకు, చివరకు మనకు చిరాకు పుట్టించేందుకు, అన్నిటికీ మించి మనల్ని ప్రేమలో పడేసేందుకు.. ఈ కూతుళ్ళు మన కోసం వస్తారు. వారి పిచ్చిని మనం ప్రతీ రోజూ సెలెబ్రేట్ చేసినా సరిపోదు. హ్యాపీ డాటర్స్ డే టు మై డ్రీమ్ డెవిల్ అని నిహారికకు విష్ చేసి… అలాగే ఈ భూమ్మీద ఉన్న ప్రతీ దెయ్యానికి కూడా డాటర్స్ డే శుభాకాంక్షలు అని మొత్తానికి నాగబాబు కూతుళ్ల దినోత్సవాన్ని తన శైలిలో సెలెబ్రేట్ చేశాడు.
Also Read: అంతులేని సంతోషం.. మెగాస్టార్ ఎమోషనల్ ట్వీట్ !
ఇక మెగా డాటర్ నిహారిక గుంటూరుకి చెందిన జొన్నలగడ్డ చైతన్యను వివాహం చేసుకోనున్న సంగతి తెలిసిందే. జొన్నలగడ్డ చైతన్య గుంటూరు ఐజీ ప్రభాకరరావు కుమారుడు. ఆ మధ్య తన వియ్యంకుడు ఐజీ రిటైర్మెంట్ సందర్భంగా అయన గురించి ఎంతో గొప్పగా మాట్లాడాడు నాగబాబు. ఇరు కుటుంబాల పెద్దలు ఈ పెళ్లిని నిశ్చయించారు. కొద్దిరోజులుగా నిహారిక తనకు కాబోయేవాడితో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంటూ సందడి చేస్తుంది. ఇక నిహారిక తనను వదిలి వెళ్లిపోనుందని నాగబాబు బాగానే ఫీలవుతున్నట్టు కనిపిస్తోంది.