సినిమా హిట్ ప్లాప్ అని డిసైడ్ చేసే మెయిన్ పాయింట్ బోరింగ్ అనే పదమే. ఆ బోరింగ్ కి కేరాఫ్ అడ్రస్ అనవసరమైన లెంగ్త్ సీన్లే. అందుకే సినిమా నిడివి ఎంత అని అడుగుతుంటారు సినిమా ఇండస్ట్రీలో. సినిమాలో సోది ఎక్కువైతేనే లెంగ్త్ ఎక్కువ వస్తోంది. అప్పుడు సినిమాని రాజమౌళి లాంటి డైరెక్టర్ కూడా కాపాడలేడు. సో.. లెంగ్త్ కి అంత ప్రాధాన్యత ఉంది. ఆయితే అఖిల్ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్‘ మరీ లెంగ్త్ ఎక్కువ వచ్చిందట. ఈ సినిమా గాని ప్లాప్ అయితే ఇక అఖిల్ కి ఇప్పుడు ఉన్న మార్కెట్ కూడా ఉండదు. ఏమైనా హీరో కాకముందే సూపర్ స్టార్ రేంజ్ కి వెళ్లిపోతాడని విపరీతమైన హైప్ ను సంపాధించిన ఈ అక్కినేని కుర్రాడు.. హీరో అయ్యాక మాత్రం ఒక్క సాలిడ్ హిట్ కూడా కొట్టలేక నానా ఇబ్బందులు పడుతున్నాడు.
Also Read: చిరుతో చరణ్ ఫైటింగ్…
బొమ్మరిల్లు భాస్కర్ చేస్తోన్న ఈ సినిమా ఎలా వచ్చిందో అని ‘బ్యాచ్‌లర్’ ఔట్ పుట్ తెప్పించుకుని, రఫ్ ఎడిటింగ్ అయిన సినిమా మొత్తాన్ని నాగార్జున ఇప్పటికే ఆల్ రెడీ చూశాడు. సెకెండ్ హాఫ్ లో వచ్చే ప్రీ క్లైమాక్స్ విషయంలో కొన్ని మార్పులు చేయమని కూడా నాగ్ చెప్పాడు. ఆ మార్పులు ప్రధాన అంశం లెంగ్త్ తగ్గించమనే. అయినా భాస్కర్ మాత్రం ఆ సీన్స్ ను అలాగే ఉంచాడట. సినిమాలో అవి బాగా పేలతాయని భాస్కర్ అభిప్రాయం. అవి అసలు బాగాలేదని నాగ్ నిర్ణయం. ఈ అభిప్రాయం నిర్ణయం మధ్యన ఆ సీన్స్ ఉంచాలో తీయలో నిర్మాతకు అర్ధం కాని పరిస్థితి. కారణం దర్శకుడు నిర్మాతను కన్వీన్స్ చేశాడట.
Also Read: నిర్మాతగా టాలెంటెడ్ బ్యూటీ.. గెస్ట్ రోల్ లో కూడా !
మరి ఇప్పుడు నాగ్ కి ఏమి చెప్పాలి అనేది నిర్మాతకు ఒక పెద్ద సమస్య అయిపోయింది. తాజాగా నాగ్ చెప్పిన మార్పులకు సంబంధించిన సీన్స్ వర్క్ ను నాగ్ అడిగాడట. తాను చేంజ్ చేయమన్నా లేటెస్ట్ వెర్షన్ చూడాలని నాగ్ అడుగుతున్నాడు. దాంతో తప్పని పరిస్థితుల్లో నాగ్ చెప్పిన వెర్షన్ కి తగ్గట్టు ఎడిటింగ్ చేస్తున్నారు. ఎడిటింగ్ అయిపోయాక రెండు వెర్షన్ లను నాగార్జునకు చూపించి ఆయనను మొదటి వెర్షన్ కే ఒప్పించాలనేది భాస్కర్ ప్లాన్. కానీ నాగ్ చూస్తోంది అవుట్ ఫుట్ కాదు, సినిమా లెంగ్త్ అనే విషయం భాస్కర్ కి అర్ధమయ్యేలా చెప్పలేక నిర్మాత మౌనంగా ఉండిపోయాడట పాపం. ఒక్కటి మాత్రం ఫిక్స్.. ఈ సినిమా ఫలితం తేడా కొడితే.. బొమ్మరిల్లు భాస్కర్ కెరీర్ ఇక కష్టమే.