https://oktelugu.com/

Prajwal Revanna : ఏమిటీ పొటెన్సీ టెస్ట్?.. ప్రజ్వల్ రేవణ్ణ కు ఎందుకు చేస్తున్నారు?

ఏదైనా శరీర భాగానికి హాని కలిగిస్తే దానిని అత్యాచారం గానే పరిగణించాలని కోర్టు స్పష్టం చేసింది.. ప్రజ్వల్ కేసులో పొటెన్సి టెస్ట్ కు అనుమతి ఇచ్చిన నేపథ్యంలో.. తుది నివేదిక ఆధారంగా అతనిపై తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.

Written By:
  • NARESH
  • , Updated On : June 3, 2024 / 09:32 PM IST

    Prajwal Revanna

    Follow us on

    Prajwal Revanna : లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రజ్వల్ రేవణ్ణ శుక్రవారం జర్మనీ నుంచి తిరిగి వచ్చిన నేపథ్యంలో.. బెంగళూరులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.. ప్రస్తుతం అతడు ప్రత్యేక దర్యాప్తు బృందం అదుపులో ఉన్నాడు. కర్ణాటకలో సంచలనం సృష్టించిన మహిళల పై అత్యాచారం, వీడియో టేపుల కేసులో ప్రజ్వల్ రేవణ్ణ ప్రధాన అభియోగాలు ఎదుర్కొంటున్నాడు.. ఈ ఉదంతం ఎన్నికల ముందు దేశాన్ని, కర్ణాటక రాష్ట్రాన్ని ఒక కుదుపు కుదిపింది. ఈ కేసును విచారించేందుకు కర్ణాటక ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. ఆ కేసు వెలుగులోకి వచ్చే కంటే ముందే ప్రజ్వల్ రేవణ్ణ దేశం దాటి వెళ్లిపోయారు. ఈ క్రమంలో ఈ కేసును కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వంతోపాటు, కేంద్ర ప్రభుత్వం కూడా సీరియస్ గా తీసుకోవడంతో.. ఇన్ని రోజులపాటు జర్మనీలో ఉన్న ప్రజ్వల్ రేవణ్ణ.. ఆ దేశం నుంచి శుక్రవారం బెంగళూరుకు వచ్చాడు. లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో.. ప్రత్యేక దర్యాప్తు బృందం అతడికి పొటెన్సీ టెస్ట్ తో సహా ఇతర వైద్య పరీక్షలు నిర్వహించాలని భావిస్తోంది.

    పొటెన్సీ టెస్ట్ అంటే ఏంటి?

    ఒక స్త్రీతో లైంగిక కార్యకలాపంలో పాల్గొనే కంటే ముందు పురుషుడు తన అంగాన్ని ప్రేరేపిస్తాడు. అలాంటప్పుడే లైంగిక చర్య సజావుగా జరుగుతుంది. అయితే అత్యాచారం, ఇతర కేసుల్లో అభియోగాలు ఎదుర్కొంటున్న పురుషుల్లో లైంగిక సామర్థ్యాన్ని పరీక్షించేందుకు పొటెన్సీ టెస్ట్ నిర్వహిస్తుంటారు.. ఐపిసి సెక్షన్ 53 ప్రకారం లైంగిక నేరాల కేసుల్లో రక్తం, రక్తం మరకలు, వీర్యం, కఫం, చెమట, జుట్టు నమూనాలు, డీఎన్ఏ నిర్ధారణకు శాస్త్రీయ పద్ధతులను ఉపయోగిస్తారు. చేతి వేళ్ల గోర్ల క్లిప్పింగ్ లను కూడా పరీక్షిస్తారు..

    అప్పుడే సమర్థత తేలుతుంది

    లైంగిక వేధింపుల కేసుల్లో నిందితుడు సంభోగానికి సమర్ధుడు లేదా అసమర్థుడు వంటి వాటిని నిరూపించేందుకు పొటెన్సీ టెస్ట్ ను నిర్వహిస్తారు. పరీక్ష నిర్వహిస్తున్న సమయంలో మానసిక స్థితి సరిగా లేనప్పుడు ఒక్కోసారి పురుషుడి అంగం గట్టిపడదు. అలాంటప్పుడు అతడిని నిరపరాధిగా ప్రకటించేందుకు అవకాశం ఉండదు. ఎందుకంటే పొటెన్సీ టెస్ట్ లో అతడి లైంగిక స్థితి స్పష్టంగా నిర్ధారణ అవుతుంది. ప్రత్యేక వైద్యుల సమక్షంలో ఈ పరీక్ష నిర్వహిస్తారు కాబట్టి.. తుది ఫలితాన్ని కోర్టు ఎదుట ప్రవేశపెడతారు.. అభియోగాలు ఎదుర్కొంటున్న నిందితుడు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడా? లేదా? అనే విషయం పొటెన్సీ టెస్ట్ ద్వారా నిరూపణ అవుతుంది.

    ఆడవాళ్లకు రెండు వేళ్ళ పరీక్షలు

    ఇక ఒక స్త్రీ లైంగిక వేధింపులకు గురైతే.. దానిని నిర్ధారించేందుకు “రెండు వేళ్ళ” పరీక్షలు నిర్వహించేవారు.. దీనివల్ల బలవంతంగా లైంగిక దాడి జరిగిందా? లేక ఇష్టపూర్తిగా జరిగిందా? అనేది ఈ పరీక్ష ద్వారా తేలేది. అయితే దీనిపై అనేక రకాల ఆరోపణలు రావడంతో ప్రస్తుతం ఈ పరీక్షను నిలుపుదల చేశారు. వాస్తవానికి లైంగిక వేధింపుల కేసులో ప్రాణాలతో బయటపడిన వ్యక్తి వాంగ్మూలం మాత్రమే పూర్తి సాక్ష్యంగా కోర్టు పరిగణిస్తుంది. అరుదైన కేసుల్లో మాత్రమే పొటెన్సీ టెస్ట్ ఆదేశాలు జారీ చేస్తుంది. 2013 కు ముందు పొటెన్సీ పరీక్షలకు కోర్టు అంతగా అనుమతి ఇచ్చేది కాదు. అయితే చట్టంలో మార్పులు చేర్పులు చేసి 375 సెక్షన్ ను తెరపైకి తీసుకువచ్చింది. అత్యాచారం నిర్వచనాన్ని కూడా మార్చింది. అత్యాచారం అనేది కేవలం లైంగికానికే పరిమితం కాకుండా.. స్త్రీ కి సంబంధించిన ఏదైనా శరీర భాగానికి హాని కలిగిస్తే దానిని అత్యాచారం గానే పరిగణించాలని కోర్టు స్పష్టం చేసింది.. ప్రజ్వల్ కేసులో పొటెన్సి టెస్ట్ కు అనుమతి ఇచ్చిన నేపథ్యంలో.. తుది నివేదిక ఆధారంగా అతనిపై తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.