Nag Ashwin
Nag Ashwin : రెబల్ స్టార్ ప్రభాస్(Rebel Star Prabhas) నటించిన ‘కల్కి'(Kalki 2898 AD) చిత్రం గత ఏడాది ప్రపంచవ్యాప్తంగా భారీ లెవెల్ లో విడుదలై ఎంతటి సంచలన విజయం సాధించిందో మన అందరికీ తెలిసిందే. సైన్స్ ఫిక్షన్ కి మహాభారతం ని జోడించి నాగ అశ్విన్(Nag Ashwin) ఎంతో అద్భుతంగా తెరకెక్కించిన తీరుకి విమర్శకుల ప్రశంసలు కూడా అనుకుంది. బాక్స్ ఆఫీస్ వద్ద సుమారుగా వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రానికి ఓటీటీ లో కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇకపోతే ఈ సినిమా సూపర్ సక్సెస్ అయినప్పటికీ ప్రభాస్ అభిమానులు మాత్రం పూర్తి స్థాయి సంతృప్తి చెందలేదు. కారణం ఇందులో ప్రభాస్ క్యారక్టర్ నిడివి తక్కువ ఉండడం వల్లే. దానికి తోడు ఆయన పాత్ర కంటే అమితాబ్ బచ్చన్ పాత్ర పవర్ ఫుల్ గా ఉండడం. దీనిపై అనేక ట్రోల్స్ కూడా వచ్చాయి.
Also Read : కల్కి 2 పై క్రేజీ అప్డేట్ ఇచ్చిన అమితాబ్… ప్రభాస్ ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చే న్యూస్
అయితే ఈ చిత్ర దర్శకుడు నాగ అశ్విన్ పదేళ్ల క్రితం ఆయన దర్శకత్వం వహించిన ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ సినిమా ఈ నెల 21 న రీ రిలీజ్ అవ్వబోతున్న సందర్భంగా ఒక ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేశాడు. ఈ ప్రెస్ మీట్ లో ఆయన్ని విలేఖరులు ఒక ప్రశ్న అడుగుతూ ‘కల్కి చిత్రం లో ప్రభాస్ క్యారక్టర్ నిడివి చాలా తక్కువగా ఉందని అభిమానులు ఫీల్ అయ్యారు. ఈ విషయం మీ దృష్టికి వచ్చిందా?, పార్ట్ 2 లో ఆయన క్యారక్టర్ ఎలా ఉండబోతుంది?’ అని అడగగా, దానికి నాగ అశ్విన్ సమాధానం చెప్తూ ‘కల్కి చిత్రం క్యారెక్టర్స్ గురించి కాస్త డీటైలింగ్ ఇవ్వాల్సిన అవసరం రావడంతో ప్రభాస్ గారి క్యారక్టర్ తగ్గినట్టు అనిపించి ఉండొచ్చు. కానీ పార్ట్ 2 మొత్తం ఆయన మీదనే ఉంటుంది. ఈ ఏడాది లోనే షూటింగ్ ని తిరిగి ప్రారంభిస్తాము’ అంటూ చెప్పుకొచ్చాడు. ఆయన మాట్లాడిన ఈ మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి.
పార్ట్ 2 లో కమల్ హాసన్, ప్రభాస్ మధ్య పోరు నువ్వా నేనా అనే రేంజ్ లో ఉంటుంది. అమితాబ్ బచ్చన్ కూడా కమల్ హాసన్ తో పోరాటం చేసేందుకు ప్రభాస్ తో చేతులు కలుపుతాడు. కల్కి భగవానుడి ఆగమనాన్ని అడ్డు కోవడానికి కమల్ హాసన్ చేసే ప్రయత్నాన్ని భైరవ, అశ్వథామ అడ్డుకుంటారా లేదా అనేది ఈ సినిమాలో చూపించబోతున్నాడు డైరెక్టర్. ఇప్పటికే 60 శాతం కి పైగా షూటింగ్ ని పూర్తి చేసేసారట. కేవలం కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణ మాత్రమే బ్యాలన్స్ ఉందని ఆ చిత్ర నిర్మాత అశ్వినీ దత్ ఇటీవల జరిగిన ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు. చూడాలి మరి రాబోయే రోజుల్లో ఈ సినిమా రేంజ్ ఇంకా ఎంత ఉండబోతుంది అనేది.