బెంగళూరు భామ నభా నటేష్ సినిమాలు చేసుకుంటూ ముందుకుపోతుంది కానీ, స్టార్ డమ్ రావడం లేదు. అందుకే తమిళంలో కూడా సినిమాలు చేస్తోంది. అయితే అక్కడ నటించినప్పటికీ పెద్దగా గుర్తింపు రావడం లేదు. నిజానికి తెలుగులో ఈ యంగ్ బ్యూటీ మెయిన్ లీడ్ గా చేసిన ‘ఇస్మార్ట్ శంకర్’ సూపర్ హిట్ కావడంతో ఒక్కసారిగా నభా రేంజ్ మారిపోతుందని అనుకున్నారు.
కానీ ఆ సినిమా తరువాత నభాకు ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదు. సూపర్ పాపులారిటీ వచ్చినా.. అలాగే కొన్ని మంచి ఆఫర్లు వచ్చినా.. వాటి వల్ల నభాకి ఎలాంటి ఉపయోగం లేకుండా పోయింది. ఒకటి రెండు సినిమాలతోనే కోట్ల రూపాయల రెమ్యునరేషన్ ను తీసుకుంటున్నారు కృతి శెట్టి, కేతిక శర్మ లాంటి యంగ్ బ్యూటీలు. వారి కంటే నటనలోనూ అలాగే అందంలోనూ తానూ ఏ మాత్రం తీసిపోదు.
అయినా ఎందుకో మేకర్స్ తనకు సరైన పాత్రలను ఇవ్వడం లేదని నభా ఫీల్ అవుతుంది. అందుకే కొన్నాళ్ళు పాటు సినిమాలకు గ్యాప్ తీసుకుని, పెయింటింగ్స్ వేస్తూ తన ఏకాంతాన్ని పూర్తిగా ఆస్వాదించాలని, ఎలాగూ కరోనా సెకెండ్ వేవ్ కాబట్టి.. ఈ ఖాళీ సమయాన్ని తనలోని ఆర్ట్ కు కేటాయించాలని ఈ బ్యూటీ నిర్ణయించుకుందట. మొత్తానికి నభా పెయింట్ బ్రష్ లు.. పెయింట్లు అంటూ అలాగే వైట్ కాన్వాసులతో టైం పాస్ చేస్తోంది.
ఎప్పుడూ పొట్టిగా ఉండే నిక్కర్, టీ షర్టు ధరించే నభాకి మోడ్రన్ పెయింటింగ్స్ అంటే బాగా ఇష్టం అట. ఒక మంచి పెయింటింగ్ చూసిన వెంటనే ఆమె కళ్ళు మూసుకుని ఏదో తన్మయత్వం చెందుతుందట. మొత్తానికి నభాలో చాల కోణాలు ఉన్నాయి.