https://oktelugu.com/

Bigg Boss Telugu 8: వచ్చిన నెగటివిటీ ని మొత్తం ఒక్క సంఘటనతో పోగొట్టుకున్న నభీల్..గ్రాఫ్ అమాంతం పెరిగిపోయిందిగా!

హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరిలో 5 వారాల ఆటలను బట్టీ ఎవరు బెస్ట్ కంటెస్టెంట్ అనేది చెప్పమని నాగార్జున అడుగుతాడు. గౌతమ్, హరితేజ విష్ణు ప్రియ పేరు చెప్పగాకే అవినాష్ నిఖిల్ పేరు చెప్తాడు. మిగిలిన కంటెస్టెంట్స్ అందరూ నభీల్ పేరు చెప్తారు.. అందరికంటే నభీల్ కి ఎక్కువ ఓట్లు రావడంతో నాగార్జున నభీల్ ని ఇన్ఫినిటీ రూమ్ కి రమ్మని చెప్తాడు

Written By:
  • Vicky
  • , Updated On : October 14, 2024 / 08:14 AM IST

    Bigg Boss Telugu 8

    Follow us on

    Bigg Boss Telugu 8 : గత వారం నభీల్ కి ఆడియన్స్ లో బాగా నెగటివిటీ పెరిగిపోయిన సంగతి అందరికీ తెలిసిందే. సంచాలక్ గా ఆయన తీసుకున్న నిర్ణయాలు, చీఫ్ గా కొన్ని సందర్భాలలో ఫెయిల్ అవ్వడం, ప్రేరణని ప్రత్యేకంగా టార్గెట్ చేసి ఆమె గురించి తప్పుగా ఇతర హౌస్ మేట్స్ దగ్గర మాట్లాడడం వంటివి ఆడియన్స్ కి మాత్రమే కాదు, నభీల్ అభిమానులకు కూడా నచ్చలేదు. ఇతన్ని చాలా నిజాయితీ గల మనిషి అనుకున్నామే, ఇలా చేస్తున్నదేంటి, చాలా తప్పు కదా అని అందరూ ఫీల్ అయ్యారు. నభీల్ గ్రాఫ్ కూడా దారుణంగా పడిపోయింది. అయితే హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరిలో 5 వారాల ఆటలను బట్టీ ఎవరు బెస్ట్ కంటెస్టెంట్ అనేది చెప్పమని నాగార్జున అడుగుతాడు.

    గౌతమ్, హరితేజ విష్ణు ప్రియ పేరు చెప్పగాకే అవినాష్ నిఖిల్ పేరు చెప్తాడు. మిగిలిన కంటెస్టెంట్స్ అందరూ నభీల్ పేరు చెప్తారు.. అందరికంటే నభీల్ కి ఎక్కువ ఓట్లు రావడంతో నాగార్జున నభీల్ ని ఇన్ఫినిటీ రూమ్ కి రమ్మని చెప్తాడు. ఇన్ఫినిటీ రూమ్ కి వెళ్ళగానే నాగార్జున నభీల్ కి ఒక పవర్ ఇస్తాడు. బిగ్ బాస్ యూనివర్స్ లో నువ్వు ఏదైనా కోరుకోవచ్చు, అది జరిగిపోతుంది, అది హౌస్ కోసం కోరుకోవచ్చు, లేదా నీ సొంత ప్రయోజనం కోసం కూడా కోరుకోవచ్చు అని అడుగుతాడు. అప్పుడు నభీల్ హౌస్ మేట్స్ అందరి గురించి అలోచించి ఆహరం గురించి ఇంట్లో పెద్ద గొడవలు జరుగుతున్నాయి, అందరికీ అన్ లిమిటెడ్ ఆహారాన్ని అందించండి అని కోరుకుంటాడు. నాగార్జున అందుకు ఓకే చెప్తాడు, కానీ దానికి బిగ్ బాస్ ఏమి చేయాలో తర్వాత చెప్తాడు అని ఒక చిన్న మెలిక కూడా పెడుతాడు నాగార్జున. ప్రైజ్ మనీ లో నుండి చాలా వరకు డబ్బులు కట్ అవ్వొచ్చు. ప్రస్తుతం ప్రైజ్ మనీ 38 లక్షల రూపాయలకు చేరింది. ఇందులో నుండి సగం ప్రైజ్ మనీ కట్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే నభీల్ ఈ పవర్ ని తన కోసం కాకుండా హౌస్ మేట్స్ అందరికోసం ఉపయోగించడం ప్రేక్షకుల్లో అతని గ్రాఫ్ ని అమాంతం పెంచేసింది.

    ఈ పవర్ ని ఆయన తన కోసం ఉపయోగించుకొని ఈ సీజన్ మొత్తం నామినేషన్స్ లోకి రాకుండా ఉండొచ్చు, కానీ ఆయన ఆ అవకాశం తీసుకోకపోవడం నిజంగా గ్రేట్ అనే చెప్పాలి. ఈ ఒక్క దెబ్బతో ఆయన గత వారం సంపాదించుకున్న నెగటివిటీ మొత్తాన్ని పోగొట్టుకున్నాడు. ఇక నేటి నామినేషన్స్ ఎపిసోడ్ లో ఒకవేళ ప్రేరణ నభీల్ ని నామినేట్ చేస్తే ఆమెకు నెగటివ్ అయ్యే అవకాశం ఉంది. ఆ స్థాయిలో నభీల్ తన మైండ్ గేమ్ తో మలుపు తిప్పేసాడు. ఇది నిజంగా నభీల్ మనస్తత్వమా ?, లేదా చాలా తెలివిగా లాక్ చేశాడా అనేది ఈ వారం అతని ఆట తీరుని చూసి నిర్ణయించుకోవచ్చు.