Trisha unexpected moment: తమిళనాడు సీఎం విజయ్ , హీరోయిన్ త్రిష కి మధ్య ఉన్న రిలేషన్ ఇక సీక్రెట్ కాదు , ఎన్నికల ముందే ఈ జంట మేమిద్దరం కలిసే ఉన్నాం అని జనాలకు చెప్పకనే చెప్పారు. ఇక విజయ్ సీఎం గా గెలిచిన వెంటనే త్రిష ఆయన ఇంటికి వెళ్లి అభినందించడం , ఇక సీఎం గా ప్రమాణస్వీకారం చేసే రోజున త్రిష కూడా కుటుంబ సభ్యులతో కలిసి హాజరవ్వడం వంటివి మనమంతా చూసాము. వీళ్లిద్దరు జనాలకు మేము కలిసే ఉన్నాము , త్వరలో పెళ్లి చేసుకుంటాము అని జనాలకు చెప్పకనే చెప్పేశారు. మరి పెళ్లి బహిరంగంగా చేసుకుంటారా?, లేదా ఇలాగే లివింగ్ రిలేషన్ షిప్ లో ఉంటారా అనేది తెలియాల్సి ఉంది. ఇదంతా పక్కన పెడితే నేడు త్రిష హీరోయిన్ గా నటించిన ‘కరుప్పు’ అనే చిత్రం తెలుగు , తమిళ భాషల్లో గ్రాండ్ గా విడుదలైంది.
తెలుగు లో ఈ చిత్రం ‘వీరభద్రుడు’ అనే టైటిల్ తో విడుదలైంది. రెండు భాషల్లోనూ ఈ చిత్రానికి మంచి పాజిటివ్ టాక్ వచ్చింది. అయితే తమిళనాడు లోని ఒక థియేటర్ లో హీరోయిన్ త్రిష , డైరెక్టర్ ఆర్జే బాలాజీ మరియు కార్తీ కలిసి ఈ చిత్రాన్ని వీక్షించారు. త్రిష సినిమాని చూసి బయటకు వచ్చి కారు ఎక్కిన సమయం లో ఒక అభిమాని త్రిష తో మాట్లాడుతూ ‘తలపతి విజయ్ ని అడిగాము అని చెప్పండి’ అంటాడు. అందుకు త్రిష తల దించుకొని ముసిముసి నవ్వులు నవ్వుతుంది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో తెగ వైరల్ గా మారింది. కొంతమంది ఈ వీడియో పై ట్రోల్స్ కూడా చేస్తున్నారు. ఇద్దరు భార్య భర్తల మధ్యలో దూరి , వాళ్ళ కాపురాన్ని కూల్చేసి విజయ్ జీవితం లోకి వచ్చిందే కాకుండా, ఇప్పుడు మూసి మూసి నవ్వులు నవ్వుతోంది చూడండి అంటూ కొంతమంది నెగెటివ్ కామెంట్స్ చేస్తున్నారు.
అయితే ఎలాంటి సందర్భంలో వీళ్లిద్దరి మధ్య బంధం ఏర్పడింది అనేది ఎవరికీ తెలియదు కాబట్టి, వీళ్ళ రిలేషన్ పై నెగెటివ్ కామెంట్స్ చేయడం సరికాదు అంటూ సోషల్ మీడియా లో విశ్లేషకులు కామెంట్స్ చేస్తున్నారు. ఇక ‘కరుప్పు’ విషయానికి వస్తే, ఈ సినిమాకు హిట్ టాక్ రావడానికి త్రిష కూడా ఒక కారణం అని , ఆమె గోల్డెన్ లక్ రాజకీయాల్లో విజయ్ కి ఎలా కలిసొచ్చిందో , సినిమాల్లో సూర్య కి కూడా అలాగే కలిసొచ్చింది అంటున్నారు ఫ్యాన్స్. ఇక సోషల్ మీడియా లో బాగా వైరల్ అయినటువంటి నేటి త్రిష థియేటర్ వీడియో ని మీకోసం క్రింద అందిస్తున్నాము చూడండి.
నటి త్రిషకు ఊహించని పరిణామం
కురుప్పు మూవీ అనంతరం ఇంటికి వెళ్తున్న త్రిషకు వింత ఘటన
‘దళపతిని అడిగానని చెప్పండి’ అన్న అభిమాని.. ముసి ముసి నవ్వుతో త్రిష pic.twitter.com/YninSmAlSq
— Telugu Feed (@Telugufeedsite) May 15, 2026
