
టాలీవుడ్ లోకి ఎన్ని వందల కోట్లతో ఎంట్రీ ఇచ్చినా.. లీడింగ్ నిర్మాతగా, తన నిర్మాణ సంస్థను లీడింగ్ సంస్థగా టాప్ లోకి తీసుకువెళ్లాలంటే అది సాధ్యమయ్యే పని కాదు. ఎందుకంటే, ఇండస్ట్రీలో డబ్బు కంటే జడ్జ్ మెంట్ ముఖ్యం. పలుకుబడి కంటే సక్సెస్ ముఖ్యం. అందుకే, ఎందరో కుబేరులు ఇండస్ట్రీకి వచ్చి.. హిట్ అందుకోలేక మళ్ళీ వెనక్కి వెళ్లిపోయారు. అలాంటి పరిస్థితులు ఉన్న తెలుగు సినీ లోకంలో ‘మైత్రి మూవీ మేకర్స్’ అనే సంస్థ ఒక్కసారిగా టాలీవుడ్ లో లీడింగ్ నిర్మాణ సంస్థగా ఎదిగింది.
Also Read: బన్నీ-స్నేహా.. టెన్త్ మ్యారేజ్ డే సెలబ్రేషన్స్.. తాజ్ మహల్ ఎదుట చుంబన సంబరాలు!
ప్రస్తుతం అల్లు అర్జున్ తో ‘పుష్ప’ సినిమా చేస్తూనే.. మరోపక్క మహేష్ బాబుతో ‘సర్కారు వారి పాట’ సినిమాను కూడా నిర్మిస్తోంది. ప్రస్తుతం ఈ రెండు సినిమాలు సెట్స్ పై ఉన్నాయి. త్వరలో పవన్ కళ్యాణ్ తో హరీష్ శంకర్ డైరెక్షన్ లో మరో సినిమాని తీయనుంది. అలాగే చిరంజీవితో బాబీ డైరెక్షన్ లో ఒక సినిమాని, బాలకృష్ణతో గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో మరో సినిమాని కూడా ఈ సంస్థ ప్లాన్ చేస్తోంది. ఇప్పుడు చెప్పుకున్న చిత్రాలన్నీ త్వరలోనే మొదలవుతాయి. పైగా ఎన్టీఆర్, విజయ్ దేవరకొండతో కూడా ఈ సంస్థకి కమిట్ మెంట్స్ ఉన్నాయి.
Also Read: RRR మూవీ బిగ్ బ్రేకింగ్.. ఎన్టీఆర్ కళ్లు పీకేస్తాడట.. రామ్ చరణ్ కాళ్లు తీసేస్తాడట!
మొత్తానికి ‘మైత్రి మూవీ మేకర్స్’ సంస్థ సినిమాల లిస్ట్ చూస్తే.. ఒక్క ప్రభాస్ తప్ప మిగతా స్టార్ హీరోలంతా ఆ సంస్థతో సినిమాకి కమిట్ అయ్యారు. కాగా ప్రభాస్ తో సినిమా సెట్ చేయడానికి ఈ సంస్థ ప్రయత్నాలు మొదలుపెట్టింది. నిజానికి ప్రభాస్ తో ఎలాగైనా సినిమా చెయ్యాలని గత రెండేళ్లుగా మైత్రీ మేకర్స్ విచ్చలవిడిగా ప్రయత్నిస్తూ వచ్చారు. ఈ క్రమంలోనే “కెజిఎఫ్” దర్శకుడితో సినిమాని ఫిక్స్ చెయ్యాలని చూశారు. అంతలో ప్రశాంత్ నీల్, ప్రభాస్ కాంబినేషన్ లో ‘సలార్’ అనే సినిమా సెట్ అవ్వడంతో ఆ ప్రపోజల్ ను మానుకుని, ప్రభాస్ ను కథతో ఒప్పించే దర్శకుడి కోసం ఈ సంస్థ వెతుకుతుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్