Mythri Movie Makers: సినిమా ఇండస్ట్రీ కి కాసుల కనకవర్షం కురిపించే సీసన్ సంక్రాంతి సీసన్..ఈ సీసన్ లో విడుదలయ్యే సినిమాలు కనీసం యావరేజి గా ఉన్నా అద్భుతమైన వసూళ్లను రాబడుతూ ఉంటాయి..అందుకే ఈ సీసన్ లో తమ సినిమాలను విడుదల చేసుకునేందుకు దర్శక నిర్మాతలు మరియు హీరోలు పోటీ పడుతుంటారు..ప్రతి ఏడాది లాగానే వచ్చే ఏడాది సంక్రాంతికి కూడా పెద్ద సినిమాలు వరుసగా విడుదల అయ్యేందుకు క్యూ కడుతున్నాయి..ప్రభాస్ హీరో గా నటించిన భారీ బడ్జెట్ ప్రెస్టీజియస్ చిత్రం ఆది పురుష్ తో పాటుగా మెగాస్టార్ చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ మరియు తమిళ హీరో విజయ్ ‘వారసుడు’ సినిమాలు విడుదల అవ్వబోతున్నాయి.

అయితే ఈ సినిమాలతో పాటు నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మలినేని తో చేస్తున్న సినిమాని కూడా సంక్రాంతి కానుగ విడుదల చేయించాలని చూస్తున్నాడట..ఆ సంక్రాంతికి అప్పటికే మూడు సినిమాలు కర్చీఫ్ వేసుకొని ఉన్నాయి..ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ మరియు బాలయ్య- గోపీచంద్ మలినేని కాంబినేషన్ మూవీ, ఈ రెండు సినిమాలను మైత్రి మూవీ మేకర్స్ వారే నిర్మిస్తున్నారు.
ఒకే నిర్మాత నిర్మిస్తున్న ఈ రెండు సినిమాలు సంక్రాంతి సీసన్ లోనే రాబోతున్నాయా అంటే అవుననే అంటున్నాయి ట్రేడ్ వర్గాలు..ఏ నిర్మాత కూడా తానూ నిర్మించిన రెండు సినిమాలు క్లాష్ అవ్వాలని కోరుకోడు..అలా క్లాష్ అయితే ఆ నిర్మాతకి చాలా నష్టమే..కానీ బాలకృష్ణ గారు సంక్రాంతికే తన సినిమాని దింపాలని పట్టుబడుతున్నాడట..నిర్మాతలు ఆయనకీ నచ్చచెప్పడానికి ఎంత ప్రయత్నం చేసిన వినట్లేదట..మరో వైపు మెగాస్టార్ ‘వాల్తేరు వీరయ్య’ సినిమాని సంక్రాంతికి విడుదల చేస్తున్నామని ఎప్పుడో ప్రకటించేసారు మైత్రి మూవీ మేకర్స్..ఇప్పుడు ఉన్నపళంగా డేట్ మారుస్తాము అంటే చిరంజీవి గారు ఒప్పుకుంటారా లేదో అనే టెన్షన్.

ఇలా అటు చిరంజీవి ఇటు బాలయ్య బాబు మధ్య ఇరుక్కొని నలిగిపోతున్నారు మైత్రి మూవీ మేకర్స్..చివరిసారిగా బాలయ్య బాబు తో మరోసారి మాట్లాడి ఒప్పించే ప్రయత్నం చేయబోతున్నారట మైత్రి మూవీ మేకర్స్ అధినేత నవీన్ గారు..బాలయ్య బాబు ఒప్పుకుంటే ఈ సినిమాని డిసెంబర్ 23 వ తారీఖున కానీ..లేదా వచ్చే ఏడాది ఫిబ్రవరి 17 వ తారీఖున కానీ విడుదల చేస్తారట..మరి బాలయ్య తన సినిమాని వాయిదా వేయించడానికి ఒప్పుకుంటాడా లేదా అనేది చూడాలి.


