Allu Aravind about Pawan Kalyan: రీసెంట్ గానే అల్లు అరవింద్(Allu Aravind) తల్లి అల్లు కనకరత్నమ్మ స్వర్గస్తులైన సంగతి మన అందరికీ తెలిసిందే. అల్లు మరియు మెగా కుటుంబాలు దగ్గరుండి మరీ ఆమె అంత్యక్రియ కార్యక్రమాలను నిర్వహించారు. అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియా లో ఏ రేంజ్ లో వైరల్ అయ్యాయో మనమంతా చూస్తూనే ఉన్నాం. మెగా ఫ్యామిలీ హీరోలందరినీ ఒక చోట చూసేలోపు అభిమానుల కళ్ళలో సంతోషం కనిపించింది. అంత్యక్రియ కార్యక్రమం లో మెగా ఫ్యామిలీ హీరోలందరూ పాల్గొన్నారు కానీ, పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) మాత్రం రాజకీయ కార్యక్రమాలు ఉండడం వల్ల రాలేకపోయాడు. అయితే జనసేన పార్టీ సభ ముగిసిన తర్వాత ఆయన నేరుగా అల్లు అర్జున్ ఇంటికి వెళ్లి కుటుంబం మొత్తాన్ని పరామర్శించి వచ్చాడు. అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు కూడా బాగా వైరల్ అయ్యాయి. ఇకపోతే నిన్న అల్లు కనకరత్నమ్మ పెద్ద కర్మ పవన్ కళ్యాణ్ తో సహా మెగా ఫ్యామిలీ హీరోలందరూ హాజరు అయ్యారు.
ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కుమారుడు అకిరా నందన్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాడు. ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత అల్లు అరవింద్ మీడియా తో మాట్లాడిన కొన్ని మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. ఆయన మాట్లాడుతూ ‘ మీకు చిరంజీవి గారికి, పవన్ కళ్యాణ్ గారికి మా అమ్మతో ఉన్న ప్రత్యేకమైన అనుబంధం గురించి చెప్పాలి. కళ్యాణ్ బాబు సినిమా నటుడు కాకముందు, ఖాళీగా ఉంటున్న రోజుల్లో మా అమ్మ కళ్యాణ్ బాబు ని కళ్యాణి అని పిలిచేది. బాబు కళ్యాణి చక్కగా ఉన్నావ్, నువ్వు సినిమాల్లో చేయొచ్చు కదా అని అడిగేది. నాకు చాలా ఇబ్బంది అండీ, సిగ్గు అండీ అని చెప్పేవాడు. కాదు నాయనా నువ్వు సినిమాల్లో చెయ్యాలి అని ఆమె ఎక్కువగా ప్రోత్సహిస్తూ ఉండేది. ఈ విషయాన్నీ కళ్యాణ్ బాబు నే స్వయంగా కొన్ని సందర్భాల్లో చెప్పాడు’.
Also Read: ‘బిగ్ బాస్ 9’ లో సెకండ్ డే మంచి మార్కులు కొట్టేసిన కంటెస్టెంట్స్ వీళ్ళేనా..?
‘నన్ను కూడా ఎరా ఆ అబ్బాయి అంత చక్కగా ఉన్నాడు, కళ్యాణ్ ని పెట్టి ఒక సినిమా చెయ్యాలి కదరా అని అంటూ ఉండేది. ఇలా మా కళ్యాణ్ ని ప్రోత్సహించిన మొట్టమొదటి మనిషి ఆమె’ అంటూ చెప్పుకొచ్చాడు. చిరంజీవి గురించి చెప్తూ ‘చిరంజీవి గారు ఎంత పెద్ద మెగాస్టార్ అయినప్పటికీ కుటుంబ సభ్యుల దగ్గర ఆయన ఎలా ఉంటాడో మీ అందరికీ తెలియనిది కాదు. కొన్ని నెలల క్రితం ఆమెకు స్పందించే అలవాటు బాగా తగ్గినప్పుడు, నేను ఆమె వద్దకు వెళ్లి, అమ్మా నేను నీ కొడుకుని , గుర్తు పడితే నా చెయ్యి పట్టుకో అనే వాడిని. ఆమె గుర్తు పట్టి నా చేతులను పట్టుకునేది. ఆ తర్వాత కొన్ని రోజులకు ఆమె ఆరోగ్యం మరింత క్షీణించాక చిరంజీవి గారు వచ్చారు. ఆమెని పలకరిస్తూ అమ్మా నేను చిరంజీవి ని వచ్చాను అని అనగానే కళ్ళు తెరిచి ఆయనకు ఎదో చెప్పే ప్రయత్నం చేసింది. అంత గొప్ప బాండింగ్ వాళ్ళ మధ్య ఉండేది’ అంటూ చెప్పుకొచ్చాడు అల్లు అరవింద్.
కళ్యాణ్ బాబు ని మా అమ్మగారు కల్యాణి అని పిలిచేవారు#AlluAravind #PawanKalyan pic.twitter.com/SI5Mep9xve
— Telugu360 (@Telugu360) September 8, 2025