https://oktelugu.com/

Music Director Thaman: ఇన్ డైరెక్ట్ గా నానికి గట్టిగా కౌంటర్ ఇచ్చిన తమన్… రీజన్ అదే ?

Music Director Thaman: మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తనదైన శైలిలో వరుస సినిమాలు చేస్తూ బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంటున్నాడు ఈ మ్యూజిక్ సెన్సేషన్. ఇటీవల బాలకృష్ణ అఖండ సినిమా ఘనా విజయం సాధించడంలో బ్యాగ్రౌండ్ మ్యూజిక్ పాత్ర కూడా ప్రధానం అని చెప్పాలి. ప్రస్తుతం ఇండస్ట్రీలో తెరకెక్కుతోన్న భారీ బడ్జెట్ సినిమాలన్నింటికీ తమనే మ్యూజిక్ అందిస్తున్నారు. తాజాగా ‘రాధేశ్యామ్’ సినిమాకి కూడా బీజియమ్ కోసం ప్రత్యేకంగా తమన్ […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 31, 2021 / 05:22 PM IST
    Follow us on

    Music Director Thaman: మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తనదైన శైలిలో వరుస సినిమాలు చేస్తూ బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంటున్నాడు ఈ మ్యూజిక్ సెన్సేషన్. ఇటీవల బాలకృష్ణ అఖండ సినిమా ఘనా విజయం సాధించడంలో బ్యాగ్రౌండ్ మ్యూజిక్ పాత్ర కూడా ప్రధానం అని చెప్పాలి. ప్రస్తుతం ఇండస్ట్రీలో తెరకెక్కుతోన్న భారీ బడ్జెట్ సినిమాలన్నింటికీ తమనే మ్యూజిక్ అందిస్తున్నారు. తాజాగా ‘రాధేశ్యామ్’ సినిమాకి కూడా బీజియమ్ కోసం ప్రత్యేకంగా తమన్ ను తీసుకున్నారు మూవీ మేకర్స్. సోయియాల్ మీడియా లోనూ యాక్టివ్ గా ఉండే తమన్… తాజాగా చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

    ఆ ట్వీట్ నేచురల్ స్టార్ నానిని ఉద్దేశించే పెట్టారంటూ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. రీసెంట్‌గా నాని శ్యామ్ సింగ‌రాయ్ చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర మంచి విజ‌యం సాధించింది. ఈ చిత్రం ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా నాని చేసిన కొన్ని కామెంట్స్ చ‌ర్చ‌నీయాంశంగా మారాయి. ఏపీ టిక్కెట్ల వ్య‌వహారంపై ఆయ‌న చేసిన కామెంట్స్ ఇప్ప‌టికీ హాట్ టాపిక్‌గానే ఉన్నాయి. ఇక ఓ ఇంటర్వ్యూలో నటులు, టెక్నీషియన్స్ ఎవరూ సినిమాను డామినేట్ చేయకూడదని అన్నారు.

    https://twitter.com/MusicThaman/status/1476212734765248515?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1476212734765248515%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Findiadailylive.com%2Fentertainment%2Fss-thaman-tweet-is-it-about-nani-what-is-quarrel-between-them.html

    ఇక తమన్ చేసిన ట్వీట్ ఏంటంటే… సినిమాలో అన్ని డిపార్ట్మెంట్స్ వర్క్ పెర్ఫెక్ట్ గా చేస్తేనే దాన్ని కంప్లీట్ సినిమా అని అంటాం. అంతేకానీ.. ఒకరు డామినేట్ చేశారని అనరు.. అంటూ నవ్వారు తమన్. సినిమాను అర్ధం చేసుకోవడానికి లోతైన అవగాహన అవసరమని.. డైలాగ్స్ లో డెప్త్, సీక్వెన్స్ లో స్మూత్ గా వెళ్లే నేరేషన్.. గొప్ప విజువల్స్, గొప్ప క్యారెక్టర్లు, ఎమోషన్స్ లో నిజాయితీ… మంచి స్క్రిప్ట్, సరైన డైరెక్షన్, నటీనటుల పెర్ఫార్మన్స్ అన్నీ బాగా వచ్చినప్పుడు, సినిమా వన్ మ్యాన్ షో కాదని అన్నారు. ‘వి లవ్ సినిమా… అండ్ వి డై ఫర్ ఇట్’ అంటూ రాసుకొచ్చారు తమన్. ఈ ట్వీట్స్ చూసిన ఫ్యాన్స్ అయితే ఇది నానికి కౌంటర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. నాని నటించిన ‘టక్ జగదీష్’ సినిమా నుంచి తమన్ ను తప్పించారు. అప్పటినుంచి ఇద్దరి మధ్య వీరిద్దరి మధ్య గ్యాప్ వచ్చినట్లు సోషల్ మీడియా లో టాక్ వినిపిస్తుంది.