MLA Roja: వైసీపీ ఎమ్మెల్యేగా రోజాకి ఇప్పుడు మంచి గుర్తింపు వచ్చి ఉండొచ్చు. కానీ, రోజాకి ఓ స్థాయిని ఇచ్చింది మాత్రం కచ్చితంగా సినిమా ఇండస్ట్రీనే. కానీ ఆమె మాత్రం సినిమా వాళ్ళ పైనే సెటైర్లు వేస్తోంది. కిరాణా కొట్టు పెట్టుకోవచ్చుగా, ఎందుకు సినిమాలు చేయడం అంటూ నాని పై కామెంట్స్ చేసిన రోజా ఎవర్నీ వదలను అంటుంది.

వైసీపీ ప్రభుత్వానికి ఏ సినిమా వ్యక్తి అయినా వ్యతిరేకంగా మాట్లాడితే.. ఆ వ్యక్తిపై ఇష్టం వచ్చినట్టు నోరు వేసుకుని పడి పోవడానికి రోజా సిద్ధంగా ఉందట. జగన్ వద్ద ఓకే టీమ్ ఉంటుంది. ఆ టీమ్ ఎవరు ఏ విధంగా మాట్లాడాలో చెబుతూ ఉంటుంది. అవసరం అయితే, స్క్రిప్ట్ కూడా పంపుతూ ఉంటుంది. రోజా ఒకప్పటి బోల్డ్ హీరోయిన్ కదా, కాబట్టి ఇక నుంచి సినిమా వాళ్ళు ఎలాంటి నెగిటివ్ కామెంట్లు చేసినా, వారి పై విరుచుకు పడాల్సిన బాధ్యతను జగన్ రోజాకి అప్పగించారు.
అసలుకే జగన్ మెప్పు కోసం ఎప్పటి నుంచో మంచి అవకాశం కోసం ఎదురుచూస్తున్న రోజా ఇది మంచి ఛాన్స్ అనుకుంది, ఇక ఇష్టం వచ్చిన విధంగా రెచ్చిపోవడానికి సర్వదా సహస్రా సిద్ధంగా ఉందట. ఓన్లీ బూతులు తిడితే బాగోదు కాబట్టి.. తమ ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుందని.. సాధారణ మనుషుల కోసం ఉపయోగపడే విధంగా జగన్ పని చేస్తున్నారని రోజా చెబుతుంది.
Also Read: నేచురల్ స్టార్ నాని గాలి తీసిన ఎమ్మెల్యే రోజా..
అయినా పెద్ద సినిమాల కష్టం రోజాకి తెలియదా ? ఇండస్ట్రీ మొత్తం ఐక్యతగా ఈ సమస్య గురించి పోరాటం చేస్తుంటే.. ఇండస్ట్రీ మీద బతికి, ఇంకా బతుకుతూ కూడా రోజా ఇలా బిహేవ్ చేయడం, ఇష్టం వచ్చినట్లు కామెంట్లు చేయడం మంచి పద్ధతి కాదు. పొలిటికల్ గా తన ఉనికిని చాటుకోవడానికి రోజా ఇలా మాట్లాడుతుంది అని వేరే చెప్పక్కర్లేదు.
కానీ ఉన్న పదవి శాశ్వతం కాదు కదా. వచ్చే ఎన్నికల్లో ఓడిపోతే మళ్ళీ రోజా సినిమాలే చేసుకోవాలి. ఆమె ఇప్పటికీ కొన్ని షోలు చేసుకుంటుంది. భవిష్యత్తులో సినిమాల్లో కూడా నటించాల్సి రావొచ్చు. కాబట్టి.. రోజా తన నోటిని అదుపులో పెట్టుకుంటే మంచిది.
Also Read: ఎమ్మెల్యే రోజాకు కాలం కలిసిరావడం లేదా?