Homeఎంటర్టైన్మెంట్Akhanda: అఘోరా పాత్రలో బాలయ్య.. థియేటర్లో పూనకాలే అంటున్న థమన్​

Akhanda: అఘోరా పాత్రలో బాలయ్య.. థియేటర్లో పూనకాలే అంటున్న థమన్​

Akhanda: నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా అఖండ. ఇటీవలే షూటింగ్​ పూర్తి చేసుకున్న ఈ సినిమా.. సెన్సార్​ కూడా కంప్లీ చేసుకుని విడుదలకు సిద్ధమైంది. డిసెంబరు 2న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్​ రిలీజ్​కు రెడీ అవుతోంది. ఈ సినిమాకు సెన్సార్​ బోర్డు యూఏ సర్టిఫికేట్​ను ఇచ్చింది. కాగా, ప్రస్తుతం మిగిలున్న పోస్ట్ ప్రొడక్షన్​ పనులను శరవేగంగా పూర్తి చేసుకుంటూ ముందుకు దూసుకెళ్లిపోతోంది చిత్రబృందం. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్​, పాటలు నెట్టింట్లో వైరల్​గా మారాయి.

Akhanda Trailer Roar | Nandamuri Balakrishna | Boyapati Srinu | Thaman S | Dwaraka Creations

Also Read: అఖండ ప్రీ రిలీజ్​ వేడుకలో మార్పులు.. వాతావరణ మార్పులే కారణమా?
ఈ సినిమా విడుదల నేపథ్యంలో థమన్ మీడియాతో మాట్లాడుతూ.. పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. అఖండలో బాలయ్య ఇరగదీశారని.. ముఖ్యంగా నేపథ్య సంగీతం కోసం అఘోరాలపై రీసెర్ట్ చేశానని అన్నారు. ఆ పాత్రలకు తగ్గట్లుగానే సంగీతం అందించినట్లు తెలిపారు. ఆ పాత్ర సినిమాలో పవర్​ఫుల్​గా ఉంటుందని అన్నారు.

కాగా, కరోనా కారణంగా సినిమా వాయిదా పడుతూ రావడంతో.. ఇప్పటి ట్రెండ్​కు తగ్గట్లు పాటలను రీ రికార్డింగ్​ చేసినట్లు తమన్​ తెలిపారు. టైటిల్​ సాంగ్​తో బాలయ్య నుంచి అభినందనలు వచ్చాయని పేర్కొన్నారు. కాగా, ఈ సినిమా తర్వాత బాలయ్య గోపిచంద్​ మలినేనితో కలిసి సినిమా తీయనున్నారు. ఇందులో కూడా థమన్ సంగీతం అందించనున్నారు. బాలయ్య సరసన శ్రుతి హాసన్​ హీరోయిన్​గా కనిపించనుంది. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ఉంటుంది. ఆలాగే ఆ తర్వాత యంగ్ దర్శకుడు అనిల్ రావిపూడితో కూడా బాలయ్య ఓ సినిమా చేయబోతున్నాడు. అదేవిధంగా కొరటాల శివతో కూడా సినిమా ఉంటుందని కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది.

Also Read: ‘అఖండ’ సినిమా రన్ టైం ఎంతో తెలుసా?

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Exit mobile version