Homeఎంటర్టైన్మెంట్Sirivennela Sitaramasastri: కవీశ్వరుడు సీతారాముడికి వాణేశ్వరుడు ఇళయరాజా కవితాత్మక

Sirivennela Sitaramasastri: కవీశ్వరుడు సీతారాముడికి వాణేశ్వరుడు ఇళయరాజా కవితాత్మక

Sirivennela Sitaramasastri: మాస్ట్రో ఇళయరాజాకి స్నేహం విలువ తెలియదు అని ఓ విమర్శ ఎప్పుడు ఆయన పై దాడి చేస్తూ ఉండేది. కానీ, ఎవరికీ తెలుసు ? ఆయన స్నేహశీలి అని. ఎవరికీ అర్ధం అవుతుంది, స్నేహితుడి మరణానికి ఆయన మనసు కన్నీళ్లతో కుమిలిపోతుందని. ఇళయరాజా తెలుగు వ్యక్తి కాదు, కానీ ఆయనకు తెలుగు అంటే ఇష్టం. తెలుగు సాహిత్యం అంటే మక్కువ.. కాదు, గొప్ప గౌరవం. అన్నిటికీ మించి ఆయన గొప్ప స్నేహితుడు.

Ilayaraja Sirivennela
Ilayaraja Sirivennela

తన ప్రియ నేస్తం సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి మరణ వార్త విని, ఇళయరాజా కన్నీళ్లు పెట్టుకున్నారు. సిరివెన్నెల సీతారామశాస్త్రి గారితో ఇళయరాజా పాటల ప్రయాణం ‘లేడీస్ టైలర్’ సినిమా నుంచి మొదలైంది. వీరి కలయికలో వచ్చిన ప్రతి పాటా ఓ ఆణిముత్యమే. ఇళయరాజా సీతారామశాస్త్రి గారికి తన మాటలతో, భావాలతో ఘన నివాళులు అర్పించారు.

సీతారామశాస్త్రి తనకు సాహిత్యంపై గౌరవం పెంచారు అంటూనే.. సీతారామశాస్త్రి గారి గురించి అద్భుతమైన సాహిత్యం రాశారు. అసలు ఇళయరాజా ఇంత గొప్పగా రాస్తాడా ? అని ఆయన రాసిన ఈ కింద వ్యాసాన్ని చూస్తే నిజంగానే ఆశ్చర్యం కలుగుతుంది. సీతారామశాస్త్రి సినీ ప్రయాణం పై, ఆయన సాహిత్యంపై ఇళయరాజా మాటల్లోనే..

వ్యాపారాత్మక సినిమా పాటల్లో సైతం.. కళాత్మకతని, కవితాత్మని అందించి..తనదైన ముద్రతో అందమైన, అర్థవంతమైన, సమర్థవంతమైన పాటలని
మన మెదళ్లలోకి జ్ఞానగంగలా ప్రవహింపచేసిన కవీశ్వరుడు సీతారాముడు.

ఎన్నో వత్సరాల ప్రయాణం మాది, శ్రీ వేటూరి గారికి సహాయకుడిగా వచ్చి…అతి తక్కువ కాలంలో శిఖర స్థాయికి చేరుకున్న సరస్వతీ పుత్రుడు…
మా ఇద్దరి కలయికలో ఎన్నో పాటలు ప్రాణం పోసుకున్నాయి. తన పాటల “పదముద్రలు ” నా హార్మోనియం మెట్లపై నాట్యం చేశాయి. రుద్రవీణ, స్వర్ణకమలం, బొబ్బిలిరాజా… ఎన్ని సినిమాలు, ఎన్ని పాటలు…రేపు రాబోయే “రంగమార్తాండ” కూడా.

Also Read: Sirivennela Seetharama Sastry: అక్షర శిల్పికి అశ్రునివాళి.. ‘సిరివెన్నెల’ చివరి మజిలీ గుర్తులు !

సీతారాముడు రాసిన పాటలకు నువ్వా నేనా అంటూ పోటీపడుతూ సంగీతాన్ని అందించిన సందర్భాలెన్నో…..!!
సీతారాముడు
పాటతో ప్రయాణం చేస్తాడు
పాటతో అంతర్యుద్ధం చేస్తాడు..
పాటలో అంతర్మథనం చెందుతాడు…
పాటని ప్రేమిస్తాడు..
పాటతో రమిస్తాడు..
పాటని శాసిస్తాడు..
పాటని పాలిస్తాడు.. పాట నిస్తాడు….
మన భావుకతకి భాషను అద్ది. మనకు తెల్సిన పాటలా చెవుల్లోకి ఒంపుతాడు… అందుకే
సీతారాముడి పాటలు ఎప్పటికీ గుర్తుంటాయి!
తన సాహిత్యం
నాతో ఆనంద తాండవం చేయించాయి
నాతో శివ తాండవం చేయించాయి..
“వేటూరి”
నాకు తెలుగు సాహిత్యం మీద ప్రేమను పెంచితే…
“సీతారాముడు”
నాకు తెలుగు సాహిత్యం మీద గౌరవాన్ని పెంచాడు..
ధన్యోస్మి మిత్రమా..!!
ఇంత త్వరగా సెలవంటూ శివైక్యం చెందడం మనస్సుకు బాధగా ఉంది..
పాటకోసమే బ్రతికావు, బ్రతికినంత కాలం పాటలే రాసావు….ఆ ఈశ్వరుడు నీకు సద్గతిని ప్రసాదించాలని కోరుకుంటున్నా…

– ఇళయరాజా

Also Read: Sirivenenla Seetharama Sastry: సిరివెన్నెల గారు మనల్ని వదిలివెళ్ళడం ఎంతో బాధాకరం: రాజమౌళి

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
Exit mobile version