https://oktelugu.com/

IPL 2022: ఐపీఎల్ లో ఏ టీంలో ఎవరు ఇన్.. ఎవరు ఔట్

IPL 2022: త్వరలోనే మరోసారి ఐపీఎల్ సంగ్రామం జరగనుంది. ఐపీఎల్ 2021లో మొత్తం ఎనిమిది జట్లు పాల్గొనగా ఐపీఎల్ 2022లో మాత్రం పది జట్లు పాల్గొనబోతున్నాయి. కొత్తగా లక్నో, అహ్మదాబాద్ ప్రాంచైజీ జట్లు బరిలోకి రావడంతో ఆటగాళ్ల వేలం పాటలు జనవరిలో షూరు కానున్నాయి. ఇప్పటికే ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను నిర్వాహాకులు చకాచకా చేసినట్లు తెలుస్తోంది.   మెగా వేలంపాటలకు ముందే ఆయా ప్రాంచైజీ జట్టు తమ జట్టులోని కీలక ఆటగాళ్లను అంటిపెట్టుకునే అవకాశం ఉంటుంది. గరిష్టంగా […]

Written By:
  • NARESH
  • , Updated On : December 1, 2021 / 01:38 PM IST
    Follow us on

    IPL 2022: త్వరలోనే మరోసారి ఐపీఎల్ సంగ్రామం జరగనుంది. ఐపీఎల్ 2021లో మొత్తం ఎనిమిది జట్లు పాల్గొనగా ఐపీఎల్ 2022లో మాత్రం పది జట్లు పాల్గొనబోతున్నాయి. కొత్తగా లక్నో, అహ్మదాబాద్ ప్రాంచైజీ జట్లు బరిలోకి రావడంతో ఆటగాళ్ల వేలం పాటలు జనవరిలో షూరు కానున్నాయి. ఇప్పటికే ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను నిర్వాహాకులు చకాచకా చేసినట్లు తెలుస్తోంది.

     

    IPL 2022

    మెగా వేలంపాటలకు ముందే ఆయా ప్రాంచైజీ జట్టు తమ జట్టులోని కీలక ఆటగాళ్లను అంటిపెట్టుకునే అవకాశం ఉంటుంది. గరిష్టంగా నలుగురు ఆటగాళ్లను ఆయా జట్లు తమతో ఉంచుకునే అవకాశం ఉంది. ఈ లెక్కన ఎనిమిది జట్లకు గానే మొత్తంగా 32మంది ఆటగాళ్లను ఆయా జట్లు అంటిపెట్టుకోవచ్చు. అయితే అనుహ్యంగా ప్రాంచైజీలు 27మందిని మాత్రం ఆయా ప్రాంచైజీలు అంటిపెట్టుకున్నాయి.

    ముంబాయి, చైన్నె, ఢిల్లీ, కొలకత్తా జట్లు తమకున్న అవకాశాన్ని వినియోగించుకుంటూ నలుగురు ఆటగాళ్లను రిటైన్ చేసుకున్నాయి. బెంగళూరు, రాయల్ ఛాలెంజర్స్, రాజస్థాన్ జట్లు ముగ్గురిని అంటిపెట్టుకోగా పంజాబ్ మాత్రం ఇద్దరినే తమతో ఉంచుకుంది. ఆయా జట్టు కీలక ప్లేయర్స్ మాత్రం తమతో ఉంచుకున్నాయి. అయితే సన్ రైజర్స్ మాత్రం కీలక ప్లేయర్స్ ను వదులుకోవడంతో ఆ జట్టు కళ తప్పినట్లు కన్పిస్తోంది.

    ప్రస్తుతానికి ఆయా జట్లను పరిశీలిస్తే.. ముంబైలో రోహిత్ శర్మ, బుమ్రా, సూర్యకుమార్, పోలార్డ్ ఉన్నారు. చెన్నైలో జడేజా, ధోని, మొయిన్ అలీ, రుతురాజ్, ఢిల్లీలో పంత్, అక్షర్ పటేల్, పృథ్వీ షా, నార్జ్, కోలకతాలో రసెల్, వరుణ్ చక్రవర్తి, వెంకటేష్ అయ్యర్, నరైన్ లను ఆయా ప్రాంచైజీలు తమతో అంటిపెట్టుకున్నాయి.

    Also Read: కీలక ప్లేయర్ ను ఎందుకు తప్పించినట్లు?

    అదేవిధంగా బెంగళూరు జట్టులో విరాట్ కోహ్లీ, మాక్స్ వెల్, సిరాజ్.. సన్ రైజర్స్ లో విలియమ్స్, అబ్దుల్ సమద్, ఉమ్రాన్ మాలిక్.. రాజస్థాన్లో సంజు శాంసన్, బట్లర్, యశస్వి, పంజాబ్ జట్టులో మయాంక్, అర్ష్ దీప్ మాత్రమే మిగిలారు. మిగిలిన ప్లేయర్స్ ఆయా జట్లు వేలంపాటలో పాల్గొని కొనుగోలు చేయాల్సి ఉంటుంది.

    ఐపీఎల్ నిబంధనల ప్రకారంగా ఫ్రాంచైజీలు గరిష్టంగా 90కోట్లతో ఆటగాళ్ల వేలంపాటలు పాడుతాయి. అయితే నలుగురు ప్లేయర్స్ అంటిపెట్టుకున్న ప్రాంచైజీలకు రూ.42కోట్ల కోత పడుతుంది. మిగిలిన డబ్బులతోనే ఆయా జట్లు మంచి ప్లేయర్స్ ను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. దీంతో ఆయా జట్ల కూర్పు ఎలా ఉంటుందనేది మాత్రం ఆసక్తిని రేపుతోంది.

    Also Read: ఆటగాళ్లందరినీ వదలుకున్న సన్ రైజర్స్ హైదరాబాద్.. సంచలన నిర్ణయానికి కారణమిదే!