KCR strategies: స్ట్రాటజీ మార్చిన కేసీఆర్.. వర్కౌట్ అయ్యేనా?

KCR strategies: టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన ఎనిమిదేళ్లలో ఎంతోమంది ఆపార్టీకి గుడ్ బై చెప్పి వెళ్లిపోయారు. ఉద్యమ సమయంలో కీలకంగా పని చేసిన నేతలు పార్టీని వీడినా ఏనాడూ గులాబీ బాస్ పెద్దగా పట్టించుకున్న దాఖలాలు లేవు. అయితే ఈటల రాజేందర్ ఎపిసోడ్ తర్వాత సీఎం కేసీఆర్ అలర్ట్ అయినట్లు తెలుస్తోంది. కొంతకాలంగా బీజేపీ పార్టీ టీఆర్ఎస్ కు దూరమైన నేతలను ఏకం చేయడంతోపాటు ఉద్యమకారులను ఆపార్టీలో చేర్చుకుంటూ క్రమంగా తెలంగాణలో బలపడుతోంది. ఈక్రమంలోనే గులాబీ బాస్ […]

Written By: NARESH, Updated On : January 3, 2022 12:07 pm
Follow us on

KCR strategies: టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన ఎనిమిదేళ్లలో ఎంతోమంది ఆపార్టీకి గుడ్ బై చెప్పి వెళ్లిపోయారు. ఉద్యమ సమయంలో కీలకంగా పని చేసిన నేతలు పార్టీని వీడినా ఏనాడూ గులాబీ బాస్ పెద్దగా పట్టించుకున్న దాఖలాలు లేవు. అయితే ఈటల రాజేందర్ ఎపిసోడ్ తర్వాత సీఎం కేసీఆర్ అలర్ట్ అయినట్లు తెలుస్తోంది. కొంతకాలంగా బీజేపీ పార్టీ టీఆర్ఎస్ కు దూరమైన నేతలను ఏకం చేయడంతోపాటు ఉద్యమకారులను ఆపార్టీలో చేర్చుకుంటూ క్రమంగా తెలంగాణలో బలపడుతోంది.

KCR

ఈక్రమంలోనే గులాబీ బాస్ బీజేపీకి చెక్ పెట్టేలా వ్యూహాలు రచిస్తున్నారు. దీనిలో భాగంగా టీఆర్ఎస్ కు దూరమైన నేతలను తిరిగి అక్కున చేర్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. సాధారణంగా సీఎం కేసీఆర్ పార్టీని ధిక్కరించే వారిపట్ల కఠినంగా వ్యవహరిస్తుంటారు. కానీ రాష్ట్రంలో మారుతున్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో సీఎం కేసీఆర్ అలాంటి నేతల పట్ల కొంత సానుకూల దుక్పథంతో ముందుకెళ్లేందుకు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది.

టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక బంగారు తెలంగాణ బ్యాచ్ కు కేసీఆర్ అధిక ప్రాధాన్యం ఇచ్చారు. దీంతో ఉద్యమ సమయంలో కీలకంగా పని చేసిన నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడి బయటికి వెళ్లారు. ఉద్యమ నేపథ్యంలో ఉన్న దిలీప్ కుమార్, మాజీ ఎంపీ జీతేందర్ రెడ్డి, స్వామి గౌడ్, ఈటల రాజేందర్, వెంకట స్వామి, విజయ రామరావు, ఏ. చంద్రశేఖర్, కొండ విశ్వశ్వరరెడ్డి, చెరుకు సుధాకర్, జిట్టా బాలకృష్ణా తదితరులు పార్టీని వీడివెళ్లారు.

వీరిలో ఎక్కువ మంది బీజేపీలో చేరి ఆపార్టీ కోసం పని చేస్తున్నారు. బీజేపీ పక్కా స్కెచ్ తో ముందుకెళుతుండటంతో కేసీఆర్ విరుగుడు చర్యలను ప్రారంభిస్తున్నారు. రాబోయే ఎన్నికలను దృష్టిలో సీఎం కేసీఆర్ పార్టీని వీడివెళ్లిన ఉద్యమకారులను తిరిగి చేర్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా సీఎం కేసీఆర్ కరీంనగర్ మాజీ మేయర్ రవీందర్ సింగ్ ను ప్రగతి భవన్ కు పిలిచి మాట్లాడటంతో ఆయన మెత్తబడ్డారు. కేసీఆర్ వెంటే నడుస్తానని స్పష్టం చేశాడు.

సాధారణంగా సీఎం కేసీఆర్ అపాయింమ్మెంట్ మంత్రులు, ఎమ్మెల్యేలకు సైతం దొరకదు. దీనిపై పలువురు ఎమ్మెల్యే, మంత్రులు పలుమార్లు బహిర్గతంగానే పలుమార్లు కామెంట్లు చేసిన దాఖలున్నాయి. అలాంటిది రవీందర్ సింగ్ కు కేసీఆర్ అపాయిమ్మెంట్ ఇవ్వడం రాజకీయ వ్యూహంలో భాగమేనని తెలుస్తోంది. టీఆర్ఎస్ నేతలు బీజేపీ వైపు చూస్తుండటంతో సీఎం కేసీఆర్ ఇటీవలీ కాలంలో పార్టీలో ఉన్న ఉద్యమ కారులను గుర్తించి వారికి వారికి పదవులు కట్టబెడుతున్నారు. మరోసారి అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతున్న కేసీఆర్ ప్రయత్నాలు ఏమేరకు కలిసి వస్తాయో వేచిచూడాల్సిందే..!