https://oktelugu.com/

వైరల్ అవుతోన్న ‘గ్యాంగ్’తో గ్యాంగ్ లీడ‌ర్ !

తెలుగు సినిమా పరిశ్రమకు చిరు గ్యాంగ్ లీడ‌ర్ గా మారుతున్న రోజులు అవి. అనగా 1990 నాటి కాలం.. అందుకేనేమో విజయ బాపినీడు మెగాస్టార్ చిరంజీవిను పెట్టి ‘గ్యాంగ్ లీడర్’ అనే సినిమా చేసినట్టు ఉన్నారు. ఏది ఏమైనా చిరు కెరీర్ లోనే బెస్ట్ సినిమాల్లో ఒకటిగా ‘గ్యాంగ్ లీడర్’కి ప్రతికేమైన స్థానం ఉంది. ఈ చిత్రంలో విజయశాంతి హీరోయిన్ గా నటించింది. మురళి మోహన్, శరత్ కుమార్ లు కూడా చిరంజీవికి సోద‌రులుగా ప్రముఖ పాత్రలు […]

Written By:
  • Neelambaram
  • , Updated On : January 25, 2021 / 10:26 AM IST
    Follow us on


    తెలుగు సినిమా పరిశ్రమకు చిరు గ్యాంగ్ లీడ‌ర్ గా మారుతున్న రోజులు అవి. అనగా 1990 నాటి కాలం.. అందుకేనేమో విజయ బాపినీడు మెగాస్టార్ చిరంజీవిను పెట్టి ‘గ్యాంగ్ లీడర్’ అనే సినిమా చేసినట్టు ఉన్నారు. ఏది ఏమైనా చిరు కెరీర్ లోనే బెస్ట్ సినిమాల్లో ఒకటిగా ‘గ్యాంగ్ లీడర్’కి ప్రతికేమైన స్థానం ఉంది. ఈ చిత్రంలో విజయశాంతి హీరోయిన్ గా నటించింది. మురళి మోహన్, శరత్ కుమార్ లు కూడా చిరంజీవికి సోద‌రులుగా ప్రముఖ పాత్రలు పోషించారు. అయితే ఆ త‌ర‌వాత‌.. చిరు, ముర‌ళీ మోహ‌న్‌, శ‌ర‌త్ కుమార్ క‌లిసి న‌టించలేదు. కానీ ముప్పై ఏళ్ల తరువాత ఈ ముగ్గురూ అనుకోకుండా ఓ చోట క‌లిశారు.

    Also Read: ‘మహా సముద్రం’లో బోల్డ్ బ్యూటీ !

    అప్పటి గ్యాంగ్ లీడ‌ర్‌ సంగ‌తుల్ని మ‌రోసారి నెమ‌రేసుకుంటూ జ్ఞాపకాల్లోకి వెళ్లిపోయారు. ఇంతకీ ఈ ముగ్గురు ఎలా కలుసుకున్నారు అంటే.. ఆచార్య షూటింగ్ ప్ర‌స్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో జ‌రుగుతోంది, మ‌ణిర‌త్నం ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా రూపుదిద్దుకుంటోంది. అందులో.. శ‌ర‌త్ కుమార్ కీల‌క‌పాత్ర‌ధారిగా నటిస్తున్నాడు. ఇక ముర‌ళీమోహ‌న్ న‌టిస్తున్న ఓ సినిమా షూటింగ్ కూడా ఫిల్మ్ సిటీలోనే జ‌రుగుతోంది. ముగ్గురు సినిమాలు రామోజీ ఫిల్మ్‌సిటీలోనే షూట్ జరగడంతో ఒకచోట కలిసే అవకాశం దొరికింది.

    Also Read: అంతకుమించి బిగ్ బాస్ షోతో సాధించేది ఏం లేదా ?

    ఇక శ‌ర‌త్ కుమార్‌, ముర‌ళీమోహ‌న్ క‌లిసి.. ఆచార్య సెట్‌కి వెళ్లి… చిరంజీవిని మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లుసుకుని ఆయనతో కలిసి ఒక ఫోటో కూడా దిగారు. ప్రస్తుతం ఆ ఫోటో సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తోంది. ఇక గ్యాంగ్ లీడ‌ర్‌… చిరంజీవి కెరీర్‌లోనే కాదు, తెలుగు చ‌ల‌న చిత్ర చ‌రిత్ర‌లోనే చెప్పుకోద‌గ్గ సినిమా. చిరంజీవిని మాస్‌కి మ‌రింత ద‌గ్గ‌ర చేసిన సినిమా. మాస్ సినిమానే అయినా, ఫ్యామిలీ ఎమోష‌న్స్ ని అద్భుతంగా ఆవిష్క‌రించారు.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్