Nagarjuna Prabhas Combination: తెలుగు సినిమా ఇండస్ట్రీ కొత్త పుంతలు తొక్కుతూ ముందుకు సాగుతుంది. ఇక ఇప్పటివరకు ఎవరికి సాధ్యం కానీ రీతిలో సినిమాలను చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న స్టార్ హీరోలందరు తెలుగు సినిమా ఇండస్ట్రిలో నెంబర్ వన్ పొజిషన్లో ఉండటమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నారు…ఇక బాహుబలి లాంటి సినిమాతో పాన్ ఇండియాలో టాప్ హీరోగా మారిన ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న సినిమాల విషయంలో స్పెషల్ కేర్ తీసుకుంటూ ముందుకు సాగుతూ ఉండడం విశేషం… ఇప్పటివరకు ఆయన సాధించిన విజయాలు అతన్ని నెంబర్ వన్ పొజిషన్ కి చాలా దగ్గరగా తీసుకెళ్లాయి. ఇక మీదట ఆయన చెబుతున్న సినిమాలతో నెంబర్ వన్ హీరోగా మారుతాడా? లేదా అనే విషయం మీద ఒక క్లారిటీ అయితే రాబోతుంది.
ప్రస్తుతం ప్రభాస్ తో సినిమాలు చేయడానికి చాలా మంది దర్శకులు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే కెరియర్ మొదట్లో రొమాంటిక్ హీరోగా పేరు సంపాదించుకున్న నాగార్జున ఆ తర్వాత డిఫరెంట్ సినిమాలు చేశాడు. ఇక ఈ క్రమంలోనే నాగార్జున – ప్రభాస్ కాంబినేషన్లో ఒక సినిమా చేయడానికి సన్నాహాలైతే చేశారు.
కానీ అప్పుడున్న పరిస్థితుల్లో ప్రభాస్ వేరే సినిమాల్లో బిజీగా ఉండటం వల్ల ఆ సినిమా చేయలేకపోయాడు. ఇంతకీ ఆ సినిమా ఏంటి అంటే ‘కృష్ణార్జున’ సినిమా కావడం విశేషం…తమిళ్ డైరెక్టర్ పి వాసు డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా డిజాస్టర్ అయింది. ఈ సినిమాలో కృష్ణుడి పాత్రలో నాగార్జున నటించాడు. ఇక మంచు విష్ణు ఈ సినిమాలో హీరోగా నటించాడు.
మంచు విష్ణు పోషించిన పాత్ర కోసం మొదట ప్రభాస్ ని తీసుకోవాలని అనుకున్నప్పటికి ప్రభాస్ మాత్రం ఆ సినిమాని రిజెక్ట్ చేయడంతో మంచు విష్ణు ఆ సినిమాలో హీరోగా చేశాడు. మొత్తానికైతే నాగార్జున – ప్రభాస్ కాంబినేషన్లో రావాల్సిన సినిమా ఇలా మిస్ అయిందనే చెప్పాలి. ఇక మీదట వీళ్ళిద్దరి కాంబినేషన్ లో ఏదైనా సినిమా వచ్చే అవకాశాలు ఉన్నాయా లేదా అనేది తెలియాల్సి ఉంది…