Krishnam Raju- Mullampudi Venkataramana: నటుడిగా సుదీర్ఘ ప్రస్థానం కలిగిన కృష్ణంరాజు ఓ అపవాదు ఎదుర్కొన్నారు. ఆయన కారణంగా రచయిత ముళ్ళపూడి వెంకట రమణ ఇంటిని కోల్పోయారట. ఆ విషయంలో ఇండస్ట్రీ పెద్దలు కూడా ఏమీ చేయలేకపోయారట. మిత్రులు బాపు-వెంకటరమణ తెరకెక్కించిన భక్త కన్నప్ప, మనవూరి పాండవులు చిత్రాల్లో కృష్ణంరాజు నటించారు. కృష్ణంరాజు కెరీర్ లో అతి పెద్ద హిట్ గా భక్త కన్నప్ప ఉంది. అనంతరం మనవూరి పాండవులు మూవీ చేశారు. తనకి లైఫ్ ఇచ్చిన ముళ్ళపూడికి మాత్రం కృష్ణంరాజు హ్యాండ్ ఇచ్చారట. విషయంలోకి వెళితే కృష్ణంరాజు నిర్మాతగా ఓ హిందీ చిత్రం చేశారు. ఆ మూవీ అట్టర్ ప్లాప్ కావడంతో నష్టాలు వచ్చాయి.

ఆ సినిమాకు ముళ్ళపూడి వెంకటరమణ ఫైనాన్స్ ఇప్పించారట. కృష్ణంరాజు తీసుకున్న అప్పుకు వెంకటరమణ గ్యారంటీ ఉండి, సంతకం చేశాడట. ఫైనాన్సర్ ఎంత అడుగుతున్నా కృష్ణంరాజు డబ్బులు తిరిగి చెల్లించలేదట. దాంతో మధ్యలో ఉన్న ముళ్ళపూడి వెంకట రమణని ఒత్తిడి చేయడం మొదలుపెట్టాడట. వాడి టార్చర్ తట్టుకోలేక వెంకటరమణ కృష్ణంరాజును డబ్బులు తిరిగి చెల్లించాలని సూచించాడట. దానికి కృష్ణంరాజు కొన్నాళ్ళు ఆగమనండని సమాధానం చెప్పాడట.
గ్యారంటీ సైన్ చేసినందుకు ఫైనాన్సర్ ఒత్తిడి చేస్తుంటే చేసేది లేక సీనియర్ నిర్మాత డివిఎస్ రాజుకు ఈ మేటర్ ముళ్ళపూడి చెప్పారట. దాంతో కృష్ణంరాజును డబ్బులు ఫైనాన్సర్ కి ఇచ్చేయమని డివిఎస్ రాజు సూచించారట. మన మధ్యలో ఉన్న ఈ మేటర్ మీరు డివిఎస్ రాజుకు చెప్పి నా పరువు తీశావు. ఇక నేను ఆ డబ్బులు ఇచ్చేది లేదు. ఏం చేసుకుంటావో, ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకోండి… అన్నాడట. ఇక చేసేది లేక వెంకటరమణ తన ఇంటిని ఫైనాన్సర్ కి అప్పగించి, అప్పు తీర్చాడట.

వెంకట రమణకు జరిగిన అన్యాయం గురించి ఇండస్ట్రీలో అందరికీ తెలిసినా ఎవరూ నోరు మెదపలేదట. కృష్ణంరాజు చేత రమణకు డబ్బులు తిరిగి ఇప్పించే ప్రయత్నం చేయలేదట. ఆ విధంగా రచయిత ముళ్ళపూడికి కృష్ణంరాజు తీరని అన్యాయం చేశారట. మరి ఈ వివాదంలో ఎవరిది తప్పో తెలియదు కానీ, పుకారైతే ఉంది. మనవూరి పాండవులు తర్వాత కృష్ణంరాజుతో బాపు, ముళ్ళపూడి వెంకట రమణ సినిమాలు చేయలేదు.