https://oktelugu.com/

OTT: సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న తెలుగు థ్రిల్లర్ ఓటీటీలో… ఎక్కడ చూడొచ్చు?

OTT: ముఖ్యంగా మీర్జాపూర్ సీజన్ 3 కోసం ఆడియన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. జుల్ 5 నుండి అమెజాన్ ప్రైమ్ లో మీర్జాపూర్ సీజన్ 3 స్ట్రీమ్ అవుతుంది.

Written By:
  • S Reddy
  • , Updated On : July 5, 2024 / 02:14 PM IST

    aarambham 2024 streaming on OTT

    Follow us on

    OTT: వీకెండ్ వస్తుందంటే మూవీ లవర్స్ కి పండగే. ఓటీటీ లో అన్ లిమిటెడ్ కంటెంట్ థ్రిల్ చేసేందుకు సిద్ధంగా ఉంటుంది. ఈ వారం పలు సినిమాలు, వెబ్ సిరీస్లు వివిధ ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్స్ లో విడుదలయ్యాయి. ముఖ్యంగా మీర్జాపూర్ సీజన్ 3 కోసం ఆడియన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. జుల్ 5 నుండి అమెజాన్ ప్రైమ్ లో మీర్జాపూర్ సీజన్ 3 స్ట్రీమ్ అవుతుంది.

    అలాగే థియేటర్స్ లో సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న తెలుగు థ్రిల్లర్ సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేసింది. అదే ఆరంభం మూవీ. సైంటిఫిక్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఆరంభం మూవీ కి పాజిటివ్ టాక్ దక్కింది. విమర్శకుల ప్రశంసలు అందుకుంది ఈ చిత్రం. అయితే స్టార్ క్యాస్ట్ లేకపోవడం మైనస్ అయ్యింది. లో బడ్జెట్ మూవీ కావడంతో పెద్దగా ప్రచారం నిర్వహించలేదు. దాంతో ఈ అద్భుతమైన చిత్రం ప్రేక్షకుల్లోకి వెళ్ళలేదు.

    సమ్మర్ కానుకగా మే 24న విడుదలైన ఆరంభం మూవీ డిజిటల్ రైట్స్ అమెజాన్ ప్రైమ్ కొనుగోలు చేసింది. జులై 5 శుక్రవారం నుంచి ప్రైమ్ లో ఆరంభం మూవీ స్ట్రీమ్ అవుతుంది. థియేటర్స్ లో మిస్ అయిన మూవీ లవర్స్ ఆరంభం చిత్రాన్ని ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి. ఆరంభం చిత్రానికి అజయ్ నాగ్ వి దర్శకుడు. కంచరపాలెం ఫేమ్ మోహన్ భగత్ ప్రధాన పాత్ర చేశాడు. సుప్రీత సత్యనారాయణ్, భూషణ్ కళ్యాణ్, మీసాల లక్ష్మణ్, రవీంద్ర విజయ్ కీలక రోల్స్ చేశారు.

    ఆరంభం మూవీ కథ విషయానికి వస్తే… ఓ మారుమూల గ్రామానికి చెందిన మిగిల్(మోహన్ భగత్) హత్య కేసులో శిక్ష అనుభవిస్తూ ఉంటాడు. అతడికి ఉరి శిక్ష పడుతుంది. శిక్ష అమలు చేయడానికి సమయం దగ్గర పడుతుంది. మిగిల్ అనూహ్యంగా జైలు నుండి తప్పించుకుంటాడు. సెల్ కి వేసిన తాళం వేసినట్లే ఉంటుంది. గోడలు బద్దలు కొట్టిన దాఖలాలు ఉండవు. 20 అడుగుల గోడ, కరెంట్ ఫెన్స్ దాటి ఎలా తప్పించుకున్నాడనేది మిస్టరీగా మారుతుంది. అసలు మిగిల్ ఎలా తప్పించుకున్నాడో తెలుసుకోవాలని అధికారులు ఒక డిటెక్టివ్ దగ్గరకు వెళతాడు. ఈ క్రమంలో వాళ్లకు విస్తుపోయే వాస్తవాలు తెలుస్తాయి.