https://oktelugu.com/

Mugguru Monagallu Movie: అమెజాన్ లో టాప్ 2 గా ట్రెండ్ అవుతున్న … ముగ్గురు మొనగాళ్ళు చిత్రం …

Mugguru Monagallu Movie: ప్రముఖ కమెడియన్ శ్రీ‌నివాస్‌రెడ్డి, కన్నడ లో సూపర్ హిట్ గా నిలిచిన ‘ దియా ’ చిత్రా నటుడు దీక్షిత్‌ శెట్టి, ‘ వెన్నెల ’ రామారావు ప్ర‌ధాన పాత్ర‌ల్లో తెరకెక్కిన చిత్రం ” ముగ్గురు మొనగాళ్లు ” . సినిమా ప్రారంభం నుంచే ఈ సినిమాపై మంచి బజ్ ఏర్పడడంతో… ఫస్ట్ లుక్, ట్రైల‌ర్‌ లకు మంచి స్పందన లభించింది. కాగా ఆగస్ట్ 6వ తేదీన థియేటర్లలో ఈ సినిమా విడుదల […]

Written By: , Updated On : October 12, 2021 / 08:25 PM IST
Follow us on

Mugguru Monagallu Movie: ప్రముఖ కమెడియన్ శ్రీ‌నివాస్‌రెడ్డి, కన్నడ లో సూపర్ హిట్ గా నిలిచిన ‘ దియా ’ చిత్రా నటుడు దీక్షిత్‌ శెట్టి, ‘ వెన్నెల ’ రామారావు ప్ర‌ధాన పాత్ర‌ల్లో తెరకెక్కిన చిత్రం ” ముగ్గురు మొనగాళ్లు ” . సినిమా ప్రారంభం నుంచే ఈ సినిమాపై మంచి బజ్ ఏర్పడడంతో… ఫస్ట్ లుక్, ట్రైల‌ర్‌ లకు మంచి స్పందన లభించింది. కాగా ఆగస్ట్ 6వ తేదీన థియేటర్లలో ఈ సినిమా విడుదల అయ్యింది. సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తున్నప్పటికి కరోన కారణంగా వసూళ్లు సాధించడంలో వెనుక పడిందని చెప్పాలి.

mugguru-monagallu-movie-got-trending-in-amazon-prime-video

దివ్యాంగులైన ముగ్గురు యువకులు ఓ మర్డర్ కేసులో ఇరుక్కుని ఎలాంటి పరిణామాలు ఎదుర్కొన్నారు అనేది ఈ మూవీ కధాంశంగా చెప్పొచ్చు. ఆ కేసు నుంచి వారు ఎలా తప్పించుకున్నారు. వారు బయటపడేందుకు ఎన్ని ఇబ్బందులు పడ్డారో అనే విషయాన్ని మంచి కామెడీ యాంగిల్ లో తెరకెక్కించారు. నటీనటుల విషయానికి వస్తే
శ్రీనివాసరెడ్డి చెవిటి వాడిగా అదరగొట్టడానే చెప్పాలి. దీక్షిత్‌ శెట్టి మూగవాడిగా… ‘వెన్నెల’ రామారావు గుడ్డివాడిగా తమదైన శైలిలో నటించి… కథను రక్తి కట్టించారు. అయితే ఇప్పుడు ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.

కరోన కేసుల నేపధ్యంలో ధియేటర్లకు వెళ్ళేందుకు సంకోచిస్తున్న వారికి ఇది మంచి అవకాశం అబే అర్దం అవుతుంది. ఇప్పుడు ఈ సినిమా అమెజాన్ లో… రెండో స్థానంలో ‘ముగ్గురు మొనగాళ్ళు’ సినిమా ట్రెండ్ కావడం ఆనందంగా ఉందని నిర్మాత ‘వెన్నెల’ రామారావు తెలిపారు. ‘గ‌రుడ‌ వేగ’ అంజి అందించిన విజువ‌ల్స్‌… సురేష్ బొబ్బిలి బాణీలు, చిన్న నేపథ్య సంగీతం ఈ చిత్రానికి అదనపు ఆకర్షణలుగా నిలిచాయని ఆయన చెప్పారు. ఈ మూవీ ద్వారా అభిలాష్‌ రెడ్డి దర్శకుడిగా తన టాలెంట్ ను నిరూపించుకున్నారు. ఈ నేపధ్యంలో ‘వెన్నెల’ రామారావు నిర్మించిన ‘రోజ్ విల్లా’ అనే మూవీ కూడా అక్టోబర్ 1 న రిలీజ్ అయిన విషయం తెలిసిందే.