Mufasa Trailer: ‘ముఫాసా’ గా సూపర్ స్టార్ మహేష్ బాబు..అబ్బురపరుస్తున్న ‘ముఫాసా: లయన్ కింగ్’ ట్రైలర్!

హిందీ వెర్షన్ లోని 'ముఫాసా' క్యారక్టర్ కి షారుఖ్ ఖాన్ వాయిస్ ఓవర్ అందించగా, తెలుగు వెర్షన్ లో ముఫాసా క్యారక్టర్ కి సూపర్ స్టార్ మహేష్ బాబు వాయిస్ ఓవర్ అందించాడు.ఈ సినిమాకి సంబంధించిన తెలుగు వెర్షన్ ట్రైలర్ ని కాసేపటి క్రితమే మహేష్ బాబు తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా విడుదల చేసాడు.

Written By: Vicky, Updated On : August 26, 2024 2:51 pm

Mufasa Trailer

Follow us on

Mufasa Trailer: 2019 వ సంవత్సరంలో విడుదలైన ‘లయన్ కింగ్’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా సృష్టించిన ప్రభంజనం ఎలాంటిదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ చిత్రానికి ఆడియన్స్ బ్రహ్మరథం పట్టారు. సుమారుగా 1.6 బిలియన్ డాలర్ల వసూళ్లను రాబట్టిన ఈ సినిమాకి సీక్వెల్ గా ‘ముఫాసా : ది లయన్ కింగ్’ అనే చిత్రం తెరకెక్కింది. షూటింగ్ కార్యక్రమాలు మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమాని ఈ ఏడాది డిసెంబర్ 20 వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషల్లో గ్రాండ్ గా విడుదల చేయనున్నారు. హిందీ వెర్షన్ లోని ‘ముఫాసా’ క్యారక్టర్ కి షారుఖ్ ఖాన్ వాయిస్ ఓవర్ అందించగా, తెలుగు వెర్షన్ లో ముఫాసా క్యారక్టర్ కి సూపర్ స్టార్ మహేష్ బాబు వాయిస్ ఓవర్ అందించాడు.ఈ సినిమాకి సంబంధించిన తెలుగు వెర్షన్ ట్రైలర్ ని కాసేపటి క్రితమే మహేష్ బాబు తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా విడుదల చేసాడు.

ఈ ట్రైలర్ కి ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ముఫాసా మరియు టాకా అనే ఇద్దరి స్నేహితుల మధ్య సాగే కథ ఇది. ఈ ట్రైలర్ లో చూపించిన సింహాలు మరియు ఇతర జంతువులను చూస్తుంటే డైరెక్టర్ నిజమైన జంతువులతో షూటింగ్ చేశాడా అని అనిపిస్తుంది. అంత గొప్పగా టెక్నాలజీ తో మంత్రముగ్దులను చేసాడు డైరెక్టర్. ఇక మహేష్ బాబు గాత్రం ఈ ట్రైలర్ లో ప్రత్యేక ఆకర్షణ గా నిల్చింది. ఆయన వాయిస్ ఓవర్ ఇవ్వడంతో ఈ చిత్రం తెలుగు వెర్షన్ కి క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది. ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ కూడా భారీ గా ఉండే అవకాశాలు ఉన్నాయి. మహేష్ బాబు కి వాయిస్ ఓవర్లు ఇవ్వడం ఇదేమి కొత్త కాదు. గతంలో ఆయన ‘జల్సా’, ‘బాద్ షా’, ‘ఆచార్య’ వంటి చిత్రాలకు వాయిస్ ఓవర్లు ఇచ్చాడు. వీటిలో ఆచార్య ఒక్కటే ఫ్లాప్ గా నిల్చింది. ఇది ఇలా ఉండగా ‘ముఫాసా : ది లయన్ కింగ్’ విడుదలయ్యే రోజే రామ్ చరణ్ – శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన ‘గేమ్ చేంజర్’ చిత్రం కూడా విడుదల కాబోతుంది. ఇలా ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ రెండు చిత్రాలు ఒకే రోజు విడుదల అవ్వబోతుండడంతో ఏ సినిమా విజయం సాధిస్తుంది అనే దానిపై ఉత్కంఠ మొదలైంది.

గతంలో మహేష్ బాబు, రామ్ చరణ్ మధ్య అనేకసార్లు బాక్స్ ఆఫీస్ పోటీ జరగగా, ఎక్కువ శాతం రామ్ చరణ్ సినిమాలే గెలిచాయి. ఈసారి కూడా మహేష్ బాబు, రామ్ చరణ్ మధ్య పోటీ జరుగుతున్నట్టే లెక్క. ఎందుకంటే ‘ముఫాసా’ చిత్రంలో మహేష్ టైటిల్ క్యారక్టర్ కి వాయిస్ అందించాడు కాబట్టి. మరి ఈసారి కూడా రామ్ చరణ్ మహేష్ పై విజయం సాధిస్తాడా, లేదా మహేష్ రామ్ చరణ్ పై బాక్స్ ఆఫీస్ ప్రతీకారం తీర్చుకుంటాడా అనేది తెలియాల్సి ఉంది.