https://oktelugu.com/

Pushpa 2 : ‘పుష్ప 2’ 16 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు..షారుఖ్ ఖాన్ ‘జవాన్’ అవుట్..ఇక మిగిలిన టార్గెట్స్ ఆ రెండు సినిమాలే!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన 'పుష్ప 2 ' చిత్రం విజయవంతంగా రెండు వారాలు పూర్తి చేసుకొని, మూడవ వారంలోకి అడుగుపెట్టింది.

Written By:
  • Vicky
  • , Updated On : December 21, 2024 / 10:04 AM IST

    Pushpa 2

    Follow us on

    Pushpa 2 : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2 ‘ చిత్రం విజయవంతంగా రెండు వారాలు పూర్తి చేసుకొని, మూడవ వారంలోకి అడుగుపెట్టింది. కేవలం అల్లు అర్జున్ అభిమానులు మాత్రమే కాదు, ఈ రెండు వారాల్లో ప్రతీ తెలుగోడు గర్వించ దగ్గ ఎన్నో అబ్దుతమైన రికార్డ్స్ ని ఈ చిత్రం నెలకొల్పింది. ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్ లో కమర్షియల్ సినిమాలను జనాలు చూసే అవకాశం లేదు అనే వాదన ఉంది. ఆ వాదనని కొట్టి పారేస్తూ ఈ చిత్రానికి కనివిని ఎరుగని రేంజ్ వసూళ్లు వచ్చాయి. మొదటి వారం లో వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ ని కొల్లగొట్టడం అనేది ఇప్పటికే అందరికీ షాకే. వంద కోట్ల రూపాయిలు ఖర్చు చేసి తీసిన ‘కల్కి’, ‘బాహుబలి 2’ వంటి సినిమాలకే ఈ రేంజ్ వసూళ్లు రాలేదు, అలాంటిది ఒక మామూలు కమర్షియల్ సినిమా ఈ స్థాయి సునామి సృస్టించిందంటే, అది కేవలం అల్లు అర్జున్ మ్యాజిక్ అని అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు.

    ఇది ఇలా ఉండగా ఈ చిత్రం 16 వ రోజు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద డీసెంట్ స్థాయి వసూళ్లను నమోదు చేసుకుంది. తెలుగు రాష్ట్రాల్లో నిన్నటితో ఈ చిత్రం 200 కోట్ల రూపాయిల మార్కుని అందుకుంది. ట్రేడ్ విశ్లేషకులు అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి నిన్న తెలుగు రాష్ట్రాల్లో కోటి 50 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. హిందీ లో కూడా ఈ చిత్రాన్ని నిన్న 15 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లు వచ్చాయని అంటున్నారు. అంతే కాదు మొన్నటి తో ఈ సినిమా బాలీవుడ్ లో 632 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లతో ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ గా నిల్చింది. కేవలం బాలీవుడ్ హీరోలకు మాత్రమే ఇండస్ట్రీ హిట్ కొట్టేవాళ్ళు దశాబ్దాల నుండి.

    కానీ మొట్టమొదటిసారి ఒక తెలుగు డబ్బింగ్ హీరో చిత్రం బాలీవుడ్ లో నెంబర్ 1 స్థానంలో కూర్చుంది. నిన్నటితో ఈ చిత్రం వసూళ్లు బాలీవుడ్ లో 647 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లకు చేరింది. షారుఖ్ ఖాన్ జవాన్ చిత్రం రికార్డ్స్ ని భారీ మార్జిన్ తో దాటేసిన ఈ చిత్రం ముందు ఇక కేవలం రెండు టార్గెట్స్ మాత్రమే ఉన్నాయి. వరల్డ్ వైడ్ గా 1800 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ ని రాబట్టిన ‘బాహుబలి 2 ‘, అదే విధంగా 2000 కోట్ల రూపాయిల గ్రాస్ ని రాబట్టిన ‘దంగల్’. వీటిలో బాహుబలి 2 మూవీ వసూళ్లను క్రిస్మస్ రోజు దాటే అవకాశం ఉంది . ‘దంగల్’ ని ఫుల్ రన్ లో కొట్టొచ్చు. ఓవరాల్ గా 16 వ రోజు 24 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా 16 రోజులకు కలిపి వరల్డ్ వైడ్ గా 1523 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది అంటున్నారు.