Dhanush Legal Battle: తమిళ హీరో ధనుష్(Dhanush K Raja) మరోసారి వార్తల్లో నిలిచాడు. ఇప్పటికే నయనతార(Nayanthara) తో జరిగిన వివాదం కారణంగా తరుచూ వీళ్లిద్దరి మధ్య ఎదో ఒక క్లాష్ నడుస్తుంది అంటూ సోషల్ మీడియా లో కొన్ని కథనాలు ప్రచారం అవుతున్నాయి. ఇప్పుడు 13 ఏళ్ళ క్రితం హిందీ లో ఆయన హీరో గా నటించిన ‘రంజానా'(Ranjanna Movie) గురించి ధనుష్ వేసిన ఒక ట్వీట్ సంచలనంగా మారింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే ‘రంజానా’ చిత్రం విడుదలై 13 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రీసెంట్ గానే ఈ చిత్రాన్ని థియేటర్స్ లో మరోసారి రీ రిలీజ్ చేశారు. అయితే ఈ రీ రిలీజ్ ప్రింట్ లో క్లైమాక్స్ ని ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ని ఉపయోగించి మార్చేశారు. దీనిపై ధనుష్ ట్విట్టర్ ద్వారా తీవ్రమైన అసహనాన్ని వ్యక్తం చేశాడు. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ హిస్టరీ లో కల్ట్ క్లాసిక్ స్టేటస్ ని సొంతం చేసుకున్న ఈ చిత్రం క్లైమాక్స్ ని మార్చడం తనకు ఏ మాత్రం నచ్చలేదని ఒక ప్రెస్ నోట్ ని వదిలాడు.
Also Read: ఎన్టీఆర్ వర్సెస్ నాగార్జున..ఈసారైనా ఎన్టీఆర్ పై చెయ్యి సాధిస్తాడా?
ధనుష్ స్పందించిన వెంటనే నేడు ఆ చిత్ర డైరెక్టర్ ఆనంద్ కూడా స్పందించాడు. ఆయన మాట్లాడుతూ ‘రీసెంట్ రీ రిలీజ్ అయిన రంజానా చిత్రం లో క్లైమాక్స్ ని మార్చడం నన్ను ఎంతగానో బాధించింది. ఈ పరిణామాలు సినీ ఇండస్ట్రీ కి అత్యంత ప్రమాదకరమైనవి. ఇప్పుడు నేను నా ఇతర సినిమాల గురించి కూడా భయపడుతున్నాను. ఈ విషయం లో ధనుష్ గారు అలా రియాక్ట్ అవ్వడాన్ని నేను సంపూర్ణంగా ఏకీభవిస్తున్నాను. ఇలాంటి మార్పులు చేర్పులు చేయడం మా సృజనాత్మకతని దెబ్బ తీసినట్టే అవుతుంది. ఈ విషయం పై న్యాయపరమైన పోరాటం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను’ అంటూ చెప్పుకొచ్చాడు ఆనంద్. ప్రస్తుతం ఈ వివాదం సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.
Also Read: రవితేజ కి ఈ వయస్సులో ఇవేమి పనులు..దిగజారిపోతున్నాడుగా!
ఇక ‘రంజనా’ విషయానికి వస్తే ఇది 2013 వ సంవత్సరం లో విడుదలైన ఒక గొప్ప ప్రేమ కథ. ఇందులో హీరోయిన్ గా సోనమ్ కపూర్(Sonam Kapoor) నటించింది. ఆరోజుల్లోనే ఈ చిత్రం హిందీ లో వంద కోట్ల రూపాయలకు పైగా నెట్ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించింది. ఈ చిత్రం లోని సన్నివేశాలు, పాటలు ఇప్పుడు చూసినా చాలా ఫ్రెష్ గా అనిపిస్తాయి. క్లైమాక్స్ లో ధనుష్ చనిపోతాడు. కానీ రీ రిలీజ్ వెర్షన్ లో క్లైమాక్స్ ని మార్చరట. ఈ సినిమా వరకు అంత పెద్ద హిట్ అవ్వడానికి కారణం, క్లైమాక్స్ ఆడియన్స్ ని కంటతడి పెట్టించడం వల్లే. కానీ ఆ చిత్ర నిర్మాత ఆ ఫీల్ గుడ్ థియేట్రికల్ అనుభూతిని చెడగొట్టాడని లేటెస్ట్ గా వినిపిస్తున్న వాదన. మరి దీనిపై నిర్మాత స్పందిస్తాడో లేదో చూడాలి.