Mrunal Thakur on Dating Rumours: సోషల్ మీడియా లో నిత్యం ట్రెండింగ్ లో ఉండే హీరోయిన్స్ లో ఒకరు మృణాల్ ఠాకూర్(Mrunal Thakur). ఈమె మన టాలీవుడ్ కి ‘సీతారామం’ చిత్రం ద్వారా పరిచయం అయ్యింది. తొలిసినిమానే కమర్షియల్ గా సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అవ్వడం తో మృణాల్ ఠాకూర్ కి టాలీవుడ్ లో ఓవర్ నైట్ స్టార్ ఇమేజ్ వచ్చేసింది. ఈ చిత్రం తర్వాత ఆమె చేసిన ‘హాయ్ నాన్న’ కూడా పెద్ద హిట్ అయ్యింది. కానీ ఆ తర్వాత వచ్చిన ‘ది ఫ్యామిలీ స్టార్’ చిత్రం మాత్రం కమర్షియల్ గా పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ అయ్యింది. ఈమె కేవలం టాలీవుడ్ లో మాత్రమే కాదు, బాలీవుడ్ లో కూడా వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీ గా ఉంది. వచ్చే ఏడాది ఈమె హీరోయిన్ గా నటించిన బాలీవుడ్ చిత్రాలు మూడు విడుదల కాబోతున్నాయి.
ఇవన్నీ పక్కన పెడితే సోషల్ మీడియా లో మృణాల్ ఠాకూర్ పై ఎన్నో రూమర్స్ రావడం ఈమధ్య కాలం లో చాలానే చూసాము. ప్రముఖ యంగ్ హీరో ధనుష్ తో ఈమె ప్రేమాయణం నడుపుతుందని నిన్న మొన్నటి వరకు ఒక రూమర్ ఏ రేంజ్ లో వైరల్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. దీనిపై ఆమె క్లారిటీ ఇస్తూ, మా మధ్య అలాంటివేమీ లేదని, మేము మంచి స్నేహితులం అంటూ చెప్పుకొచ్చింది. అదే విధంగా రీసెంట్ గా ఆమె ఒక బాలీవుడ్ మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో, క్రికెటర్ శ్రేయాస్ అయ్యర్ అంటే తనకు క్రష్ అని, అతనంటే చాలా ఇష్టం అంటూ చెప్పుకొచ్చింది. దీంతో సోషల్ మీడియా లో మృణాల్ ఠాకూర్, శ్రేయాస్ అయ్యర్ రిలేషన్ లో ఉన్నారని, డేటింగ్ చేస్తున్నారని వార్తలు పుట్టించారు. ఈ వార్తలు నేషనల్ లెవెల్ లో వైరల్ అవ్వడం, మృణాల్ ఠాకూర్ వరకు ఈ వార్త చేరడం జరిగింది.
దీనిపై ఆమె స్పందిస్తూ ‘ఇలాంటి రూమర్స్ ఇదివరకే నాపై చాలా వచ్చాయి. ఇవి వినడానికి చాలా హాస్యాస్పదంగా ఉంటాయి. వాళ్ళు వార్తలు సృష్టిస్తుంటారు, వాటిని చూసి నేను నవ్వుకుంటూ ఉంటాను. మాకు వీళ్లంతా ఫ్రీ పీఆర్ స్తంట్స్ చేస్తున్నారు’ అంటూ చెప్పుకొచ్చింది. దీంతో శ్రేయాస్ అయ్యర్ తో రిలేషన్ లో ఉన్న వార్తలకు ఎట్టకేలకు చెక్ పడింది. ఇకపోతే మృణాల్ ఠాకూర్ ప్రస్తుతం అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాలో ఒక హీరోయిన్ గా నటిస్తోంది. శరవేగంగా షూటింగ్ కార్యక్రమాలను జరుపుకుంటున్న ఈ చిత్రం 2027 వ సంవత్సరం లో విడుదల కాబోతుంది.