Died Stars Movies: జనాన్ని అమితంగా ప్రభావితం చేసే మాధ్యమాల్లో సినిమా అగ్రభాగంలో ఉంటుంది. అందుకే.. సినీ తారలను ఎంతగానో ప్రేమిస్తారు.. ఆరాధిస్తారు.. తాము ఎంతగానో అభిమానించే హీరోల సినిమా ఫెయిల్ అయితేనే.. తట్టుకోలేరు. అలాంటిది వాళ్లే లేకుండా పోతే..? ఈ భూమ్మీదనుంచి శాశ్వతంగా వీడ్కోలు తీసుకుంటే? గుండెలు ఆగినంత పనైపోతుంది. కన్నడపవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మరణం యావత్ భారత సినీ పరిశ్రమను శోక సంద్రంలో ముంచెత్తింది. ఇక, పునీత్ ను తెరపై చూసుకునే అవకాశమే లేదని అభిమానులు విషాదంలో మునిగిన వేళ ఆయన ఆఖరి సినిమాను విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. ఇదే కోవలో.. సినీ తారలు మరణించిన తర్వాత విడుదలైన చిత్రాలు ఏవీ? ఈ లోకాన్ని వీడిన స్టార్లు ఎవరు అన్నది చూద్దాం.

కన్నడ పవర్స్టార్ పునీత్ రాజ్కుమార్ చివరి సినిమా ‘జేమ్స్’. ఈ సినిమా రిలీజ్ కాకుండానే ఆయన కన్నుమూశారు. ఈ సినిమాలో ఓ ఫైట్ సీక్వెన్స్ మినహా పునీత్ టాకీపార్ట్ మొత్తం పూర్తి చేశారు. ఈ చిత్రాన్ని పునీత్ జయంతి సందర్భంగా మార్చి 17న విడుదల చేసే ఆలోచనలో ఉంది యూనిట్.
కన్నడ సీనియర్ హీరో విష్ణు వర్దన్ 2009లో మరణించారు. ఆయన కూడా ఒక సినిమా సెట్స్ మీద ఉండగానే చనిపోయారు. ఆ మూవీ పేరు ఆప్తరక్షక. విష్ణు వర్దన్ మరణం తర్వాత విడుదలైన ఈ సినిమా సంచలన విజయం సాధించింది.
సుశాంత్ సింగ్ : బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ గతేడాది ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. జూన్ 14 2020న చనిపోయాడు. సుశాంత్ మరణించిన 40 రోజుల తర్వాత అంటే.. జులై 24న ఈ చిత్రం విడుదలైంది. ఓటీటీలో వచ్చిన ఈ మూవీ కూడా ఘన విజయం సాధించింది.
అక్కినేని: టాలీవుడ్ నట దిగ్గజం అక్కినేని నాగేశ్వరరావు ఆఖరి చిత్రం మనం. అక్కినేని కుటుంబం మొత్తం కలిసి నటించిన ఈ చిత్రం అందరినీ అకట్టుకుంది. ఈ చిత్రం కూడా ఏఎన్నార్ చనిపోయిన తర్వాతే విడుదలైంది. జనవరి 22, 2014న ఏఎన్నార్ చనిపోతే.. మేలో మనం సినిమా విడుదలైంది.
శ్రీహరి: రియల్ స్టార్ శ్రీహరి మరణం కూడా అందరినీ కలచి వేసింది. తిరుగులేని క్యారెక్టర్ ఆర్టిస్టుగా దూసుకెల్తున్న వేళ హఠాత్తుగా చనిపోయారు. హిందీ సినిమా రాంబో రాజ్‌కుమార్ షూటింగ్ కోసం ముంబై వెళ్లిన ఈయన.. అక్కడే లీలావతి హాస్పిటల్‌లో చనిపోయాడు. 2013 అక్టోబర్ 9న శ్రీహరి చనిపోతే.. ఆయన మరణానంతరం రాంబో రాజ్‌కుమార్ విడుదలైంది.
సౌందర్య: అభినవ సావిత్రిగా పేరు తెచ్చుకున్న సౌందర్య మరణం ఎంతటి విషాదం నింపిందో తెలిసిందే. 2004, ఎప్రిల్ 17న హెలికాప్టర్ క్రాష్‌లో దుర్మరణం పాలయ్యారు. కానీ.. అప్పటికే ఆమె ఒప్పుకున్న సినిమాలు ఉన్నాయి. సౌందర్య చనిపోయిన తర్వాత కన్నడలో ఆప్తమిత్ర, తెలుగులో మోహన్ బాబు శివశంకర్ సినిమాలు విడుదలయ్యాయి.
దివ్య భారతి: కేవలం 19 ఏళ్ల వయసులోనే భారత సినిమాలో అగ్ర హీరోయిన్ అనిపించుకుంది దివ్య భారతి. ఈమె 1993లో చనిపోయింది. అప్పటికే ఈమె కొన్ని సినిమాల్లో నటిస్తూ ఉంది. ఆ సినిమాలన్నీ దివ్య భారతి మరణానంతరం విడుదలయ్యాయి. వాటిలో హిందీలో రంగ్, శత్రంజ్.. తెలుగులో తొలి ముద్దు సినిమాలు ఉన్నాయి.
ధర్మవరపు సుబ్రమణ్యం: తనదైన కామెడీతో తెలుగు ఇండస్ట్రీలో ప్రత్యేక ముద్ర వేసుకున్నాడు ధర్మవరపు సుబ్రమణ్యం. ఈయన 2013, డిసెంబర్ 7న చనిపోయాడు. మరణించిన తర్వాత రుద్రమదేవి, అమృతంలో చందమామ సినిమాలు విడుదలయ్యాయి.
ఎమ్మెస్ నారాయణ: లేటుగా కెరీర్ మొదలు పెట్టి.. అతి తక్కువ సమయంలో 700 సినిమాలు పూర్తి చేసిన కమెడియన్ ఎమ్మెస్ నారాయణ. ఈయన 2015, జనవరి 23న చనిపోయారు. ఎమ్మెస్ చనిపోయిన నాలుగు నెలల తర్వాత సన్నాఫ్ సత్యమూర్తి, లయన్ సినిమాలు విడుదలయ్యాయి.
Also Read: పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ అంత్యక్రియలు ఎవరు చేయబోతున్నారంటే