OTT Movies: ప్రతీ వారం వీకెండ్ లో విడుదలయ్యే ఓటీటీ సినిమాల కోసం ఆడియన్స్ ఎంత ఆతృతగా ఎదురు చూస్తుంటారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. మార్చి 1న విక్టరీ వెంకటేష్(Victory Venkatesh) నటించిన ‘సంక్రాంతికి వస్తున్నాం'(Sankranthiki Vastunnam) చిత్రం జీ5 యాప్ లో విడుదలై సంచలనం సృష్టించింది. కేవలం 12 గంటల్లోనే 100 మిలియన్ వాచ్ మినిట్స్ ని సంపాదించి ఆల్ టైం రికార్డు నెలకొల్పింది. అంతకు ముందు వారం లో కూడా నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) హీరో గా నటించిన ‘డాకు మహారాజ్'(Daaku Maharaj) చిత్రం నెట్ ఫ్లిక్స్ లో విడుదలై అద్భుతమైన రెస్పాన్స్ ని దక్కించుకుంది. ఇక ఈ వారం ఏకంగా 11 సినిమాలు ఓటీటీ లో రాబోతున్నాయి. అందులో ముఖ్యమైన మూడు సినిమాలు ఎందులో స్ట్రీమింగ్ అవ్వబోతున్నాయి?, ఎప్పటి నుండి చూడబోతున్నాము అనేది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం.
విడాముయార్చి:
తమిళ సూపర్ స్టార్ అజిత్(Thala Ajith Kumar) నటించిన ఈ చిత్రం భారీ అంచనాల నడుమ విడుదలై డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చింది. స్టార్ హీరోలు ఇలాంటి ఆఫ్ బీట్ సినిమాలు తీస్తే ఆడవు అనే విషయం అందరికీ తెలిసిందే. కానీ ఒక సెక్షన్ ఆడియన్స్ ఈ సినిమాకి బాగా కనెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఓటీటీ ఆడియన్స్ కి ఈ చిత్రం నచ్చవచ్చు. నేడు నెట్ ఫ్లిక్స్ లో తెలుగు, తమిళం మరియు ఇతర ప్రాంతీయ భాషల్లో కూడా అందుబాటులోకి వచ్చింది, చూసి ఎంజాయ్ చేయండి.
తండేల్ :
వరుస ఫ్లాప్స్ లో ఉన్నటువంటి అక్కినేని ఫ్యామిలీ ని సక్సెస్ ట్రాక్ లోకి తీసుకొచ్చిన సినిమా ఇది. పాటల ద్వారా విడుదలకు ముందే మంచి క్రేజ్ ని సంపాదించుకున్న ఈ సినిమా, విడుదల తర్వాత వంద కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను కొల్లగొట్టి సంచలనం సృష్టించింది. అలాంటి ఈ చిత్రం ఈ నెల 7 నుండి నెట్ ఫ్లిక్స్ లో తెలుగు తో పాటు ఇతర ప్రాంతీయ భాషల్లో కూడా అందుబాటులోకి రాబోతుంది. థియేటర్స్ లో మిస్ అయిన ఆడియన్స్, ఓటీటీ లో చూసి ఎంజాయ్ చేయండి.
బాపు:
ఇటీవలే థియేటర్స్ లో విడుదలైన ఈ సినిమా కమర్షియల్ గా పెద్దగా వసూళ్లను రాబట్టలేకపోయింది కానీ, క్రిటిక్స్ నుండి మాత్రం మంచి రెస్పాన్స్ ని దక్కించుకుంది. IMDB లో ఏకంగా 8.5 రేటింగ్స్ ని సొంతం చేసుకుందంటే మంచి సినిమా అన్నట్టే లెక్క. బ్రహ్మాజీ, ఆమని, శ్రీనివాస్ అవసరాల తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈ సినిమా మార్చి 7 నుండి హాట్ స్టార్ లో అందుబాటులోకి రానుంది. థియేటర్స్ లో ఆడియన్స్ ని అలరించలేకపోయిన ఈ సినిమా, కనీసం ఓటీటీ ఆడియన్స్ ని అయినా అలరిస్తుందో లేదో చూడాలి.