Movie Trends : మూవీ ట్రెండ్స్ నుంచి ప్రజెంట్ క్రేజీ అప్ డేట్స్ విషయానికి వస్తే.. ‘గెహ్రాహియా’లో బోల్డ్ సీన్స్‌లో నటించడానికి మీ భర్త రణ్‌వీర్ సింగ్ అనుమతి తీసుకున్నారా? అని ఓ మీడియా ఛానెల్ ఇంటర్వ్యూలో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణెను ప్రశ్నించారు. దీనిపై ఆమె ‘బోల్డ్ సీన్స్‌లో నటించేందుకు నా భర్త అనుమతి తీసుకున్నానా అందుకు ఆయన ఏమన్నారు అని అడగటం స్టుపిడ్‌గా ఉంది. సోషల్ మీడియాలో వచ్చే కామెంట్స్ నేను, రణ్‌వీర్ అస్సలు చదవం’ అని రిప్లై ఇచ్చింది. 11న ‘గెహ్రాహియా’ రిలీజ్ కానుంది.

మరో అప్ డేట్ విషయానికి వస్తే.. ‘మహానటి’ కీర్తి సురేశ్ ప్రధాన పాత్రలో నటించిన ‘గుడ్‌లక్ సఖి’ చిత్రం గతనెల 28న థియేటర్లలో విడుదలై అంతగా ఆకట్టుకోలేపోయింది. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ సినిమాలో ట్విస్టులు, ప్రేక్షకులను కట్టిపడేసే సన్నివేశాలు లేవనే టాక్ ప్రేక్షకుల నుంచి వినిపించింది. అయితే ‘గుడ్‌లక్ సఖి’ ఈనెల 12న అమెజాన్ ప్రైమ్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. మరి ఓటీటీలోనైనా విజయం సాధిస్తుందో, లేదో చూడాలి.
Also Read: జగన్ తో స్టార్లు భేటీ.. కానీ, ఎన్టీఆర్ కలవట్లేదు !

ఇక ఇంకో అప్ డేట్ ఏమిటంటే.. సంక్రాంతి సందర్భంగా జనవరి 14న థియేటర్లలో విడుదలైన బంగార్రాజు సినిమా ఓటీటీలో సందడి చేసేందుకు రెడీ అయింది. ఫిబ్రవరి 14 లేదా 18 నుంచి ఓటీటీ ప్లాట్ ఫామ్ జీ 5లో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. మూవీ రిలీజైన నెల రోజుల్లో ఓటీటీలో విడుదల చేస్తామని ఇప్పటికే చిత్రబృందం ప్రకటించింది.

ఇక ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సినిమాలో నాగార్జున, రమ్యకృష్ణ, నాగచైతన్య, కృతి శెట్టి ప్రధాన పాత్రల్లో నటించారు. థియేటర్ లో ఎవరేజ్ హిట్ అందుకున్న ఈ సినిమా
ఓటీటీలో ఏ రేంజ్ హిట్ అందుకుంటుందో చూడాలి.
Also Read: రోహిత్ పట్టిందల్లా బంగారమే.. వరుసగా రెండో సిరీస్ కైవసం..!