Homeఎంటర్టైన్మెంట్Movie Time: మూవీ టైమ్ : 'నాని' నుంచి గుడ్ న్యూస్.. ...

Movie Time: మూవీ టైమ్ : ‘నాని’ నుంచి గుడ్ న్యూస్.. సంపూ నుంచి ‘ధగడ్ సాంబ’ !

Movie Time: మూవీ టైమ్ నుంచి ప్రజెంట్ అప్ డేట్స్ విషయానికి వస్తే.. హీరో నాని తన ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్ చెప్పారు. ప్రస్తుతం తాను నటిస్తున్న ‘అంటే సుందరానికి!’ షూటింగ్ పూర్తయిందని, త్వరలోనే రిలీజ్ డేట్ ను ప్రకటిస్తాం అని నాని చెప్పుకొచ్చాడు. ఇక ఈ సినిమాలో నాని సరసన మలయాళ బ్యూటీ నజ్రియా నజీమ్ హీరోయిన్‌ గా కనిపించనుంది. ఈ సినిమాకు వివేక్ ఆత్రేయ డైరెక్టర్. వేసవి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుందని టాక్ ఉంది.

ante sundaraniki
ante sundaraniki

మరో అప్ డేట్ విషయానికి వస్తే.. బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు లేటెస్ట్ మూవీ ‘ధగడ్ సాంబ’. తాజాగా ఈ సినిమాలోని భోళా శంకర్ అంటూ సాగే లిరికల్ వీడియోను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ధనుంజయ్, దాసరి ఐశ్వర్య పాడిన ఈ పాటకు డేవిడ్ మ్యూజిక్ అందించారు. ఎన్ ఆర్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను ప్రవీణ క్రియేషన్స్ బ్యానర్‌పై బిఎస్.రాజు నిర్మిస్తున్నారు.

Also Read: Oscar Awards 2022: ఆస్కార్‌ బరిలో నిలిచిన భారతీయ చిత్రాల లిస్ట్ !

ముఖ్యమంత్రి కేసీఆర్ పై సినీ నటుడు సుమన్ ప్రశంసలు కురిపించారు. యాదాద్రిని అత్యద్భుతంగా తీర్చిదిద్దారని, ఎంతో మంది సీఎంలు వచ్చినా ఎవరికీ ఇలాంటి ఆలోచన రాలేదన్నారు. కేసీఆర్ వ్యక్తి కాదు ఒక శక్తి అని వ్యాఖ్యానించారు. యాదాద్రిని దేశంలోనే ఓ గొప్ప స్థాయికి తీసుకొచ్చారని, రాబోయే రోజుల్లో ఆలయ పరిసర ప్రాంతాల్లో సినిమా చిత్రీకరణలు జరుగుతాయని తెలిపారు. తెలంగాణలో అభివృద్ధి అద్భుతంగా సాగుతోందన్నారు.

Also Read: ట్రెండింగ్: అంతుచిక్కని సమంత వ్యవహారం..

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.

2 COMMENTS

  1. […] AP Govt Employees: ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వానికి ఉద్యోగులకు మధ్య పొసగడం లేదు. దీంతో అటు సీఎం ఇటు ఉద్యోగులు అనే ధోరణిగా మారిపోయింది. ఏరు దాటేదాకా ఓడ మల్లయ్య ఏరు దాటాక బోడ మల్లయ్య అన్నట్లుగా ఉద్యోగులు పరిస్థితి మారిపోయింది. ఇన్నాళ్లు ప్రభుత్వమే తమను ఆదుకుంటుందని భావించిన ఉద్యోగులకు నిరాశే మిగులుతోంది. ఉద్యోగులు లంచగొండులని ప్రచారం చేస్తూ వారిపై బురద జల్లుతున్నారు దీంతో వారికి ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఈ నేపథ్యంలో వైసీపీ ఉద్దేశం ఏమిటనే ప్రశ్న అందరి ఉద్యోగుల్లో వస్తోంది. […]

  2. […] OTT: కరోనా మూడో వేవ్ వేగంగవంతం కావడంతో ప్రస్తుతం మళ్ళీ సినిమా రంగానికి కనిపిస్తున్న ఏకైక ఆశా కిరణం ఓటీటీ. ఎలాగూ ఈ కరోనా క్లిష్ట స‌మ‌యంలో ప్రేక్షకులను అలచేది కూడా ఒక్క ఓటీటీ మాత్రమే. నష్టాల్లో నలిగిపోతున్న నిర్మాతలకు లాభలను తెచ్చి పెట్టేది కూడా ఓటీటీ సంస్థలు మాత్రమే. గత రెండేళ్ల నుంచి కరోనా కోరల్లో పడి నలిగిపోతున్న సినిమా జీవితాల్లో వెలుగులు నింపిన ఏకైక మాధ్యమం కూడా ఒక్క ఓటీటీ మాత్రమే. ఆ ఘనత ఓటీటీలకే దక్కుతుంది. […]

Comments are closed.

RELATED ARTICLES

Most Popular