Homeఎంటర్టైన్మెంట్Oscar Awards 2022: ఆస్కార్‌ బరిలో నిలిచిన భారతీయ చిత్రాల లిస్ట్ !

Oscar Awards 2022: ఆస్కార్‌ బరిలో నిలిచిన భారతీయ చిత్రాల లిస్ట్ !

Oscar Awards 2022:  ‘వెండితెర’కు ఆస్కార్ అవార్డ్ ఓ కలల స్వప్నం. ప్రపంచ సినీ లోకంలో ఆస్కార్ ఓ తిరుగులేని రారాజు. అందుకే సినిమా గాలి పీల్చుకున్న ప్రతి ఒక్కరూ ఒక్కసారైనా ఆస్కార్ అవార్డ్ ను అందుకోవాలని, కనీసం ఆస్కార్ కోసం పోటీపడాలని.. ఒకవేళ ఆ పోటీలో ఆస్కార్ గెలిస్తే, ఇక జీవితం ధన్యమై పోయిందని భావిస్తుంటారు. మొత్తమ్మీద అందమైన అబద్దపు సామ్రాజ్యంలో ఆస్కార్ అందమైన యువరాణిలా అందర్నీ ఊరిస్తూ ఉంటుంది.

Oscar Awards 2022
Oscar Awards 2022

ఆస్కార్ అంత అత్యంత ప్రతిష్ఠాత్మకమైనది కాబట్టే… మన ఇండియన్ సినిమాలు కూడా పోటీపడుతూ ఉంటాయి. నిజానికి ప్రతి సంవత్సరం జస్ట్ నామినేషన్‌ లలోకి మన ఇండియన్ సినిమా వెళ్ళింది అంటేనే.. ఆ సినిమా కచ్చితంగా గొప్పది అయి ఉంటుందని ఫీల్ అయ్యేంతగా ఆస్కార్ ను పరిగణలోకి తీసుకుంటారు మన వాళ్ళు. అందుకే ఇండియాలో కూడా ప్రతి ఆస్కార్ అవార్డు పై చర్చ జరుగుతూనే ఉంటుంది. ఈ క్రమంలో ఈ సారి కూడా ఆస్కార్‌ అవార్డుల ప్రదానోత్సవం అట్టహాసంగా ప్రారంభమైంది.

Also Read:  సావిత్రి జీవితంలో చేసిన తప్పులు ఇవే.. అందుకే ఆమె మోసపోయింది..

మరీ 2022: ఆస్కార్‌ బరిలో నిలిచాయి రెండు భారతీయ చిత్రాలు. తమిళం నుంచి ‘జై భీమ్‌’, మలయాళ ‘మరక్కర్‌: అరబికడలింటే సింహమ్‌’ చిత్రాలు చోటు దక్కించుకున్నాయి. 94వ ఆస్కార్‌ అవార్డుల పరిశీలనకు అర్హత సాధించిన ఈ చిత్రాలు ఫైనల్‌ నామినేషన్స్‌ జాబితాలో నిలుస్తాయా? లేదా అనేది ఫిబ్రవరి 8న తెలుస్తుంది. మరోవైపు ఉత్తమ విదేశీ విభాగంలో భారతదేశం నుంచి తమిళ చిత్రం ‘కూళాంగల్‌’ కూడా నామినేట్‌ అయింది. అయితే, అ సినిమాకు నిరాశ ఎదురైంది.

 

Oscar Awards 2022
Oscar Awards 2022

“జై భీమ్” సినిమా… ఈ మధ్య కాలంలో ప్రేక్షకుల హృదయాలకు బాగా దగ్గరైన సినిమా. దైవం మానుష రూపేణ అన్నారు. ఇది సమాజం మరువకూడదు, ఇదే అంశాన్ని చెప్పిన సినిమా ఇది. మద్రాసు హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ కె. చంద్రు జీవితం ఆధారంగా అల్లుకున్న కోర్టు డ్రామా ఇది.

మరక్కర్‌: 16వ శతాబ్దానికి చెందిన నావికుడు కుంజాలి మరక్కర్‌ జీవితం ఆధారంగా వచ్చిన సినిమా. ఈ చిత్రం 67వ నేషనల్‌ అవార్డ్స్‌లో మూడు విభాగాల్లో (బెస్ట్‌ ఫీచర్‌ ఫిల్మ్, బెస్ట్‌ స్పెషల్‌ ఎఫెక్ట్స్, బెస్ట్‌ కాస్ట్యూమ్‌ డిజైన్‌) అవార్డులను అందుకుంది.

Also Read: ఏపీ సర్కార్‌కు దిమ్మదిరిగే కౌంటర్ ఇచ్చిన ఏపీ టీచర్స్.. సమ్మెలో సై

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

2 COMMENTS

  1. […] Tamannah  marriage: మిల్కీ బ్యూటీ తమన్నా ఇండస్ట్రీకి వచ్చి దశాబ్దం దాటి పోయింది. ఇప్పటికీ స్టార్స్ పక్కన ఆఫర్స్ పట్టేస్తూ ఫార్మ్ కొనసాగిస్తుంది. యంగ్ బ్యూటీస్ రష్మిక, పూజా హెగ్డే, సమంత, కీర్తి సురేష్ ఇండస్ట్రీని ఊపేస్తున్నా… తమన్నా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ తో బిజీగా గడుపుతున్నారు. అయితే స్టార్ హీరోయిన్ గా తమన్నా ఫేడవుట్ అయినట్లే. చిరంజీవి, వెంకటేష్ వంటి సీనియర్ స్టార్ హీరోలు మాత్రమే ఆమెను కన్సిడర్ చేస్తున్నారు. […]

  2. […] Virat Kohli- Anushka Sharma: సినీ రంగుల ప్రపంచంలోకి అడుగు పెట్టిన తర్వాత జీవితం తెరిచిన పుస్తకం అవుతుంది. మీడియా, ప్రజల కళ్లన్నీ సెలెబ్రెటీస్ మీదనే ఉంటాయి. కాగా టీమిండియా కెప్టెన్ విరాట్‌ కోహ్లీ – బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ దంపతుల కూతురు వామిక ఫొటోలు వైరల్ కావడంపై తాజాగా అనుష్క స్పందించింది. ‘మా కుమార్తె ఫొటోలు క్యాప్చర్ కావడంతో పాటు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయని తెలిసింది. ఆ సమయంలో కెమెరా మాపై ఉందని నాకు తెలియదు. […]

Comments are closed.

RELATED ARTICLES

Most Popular