Homeఎంటర్టైన్మెంట్TDP- Cinema Stars: టీడీపీలో ఇమడలేకపోతున్న సినీ తారలు.. పొమ్మనలేక పొగపెడుతున్న నేతలు

TDP- Cinema Stars: టీడీపీలో ఇమడలేకపోతున్న సినీ తారలు.. పొమ్మనలేక పొగపెడుతున్న నేతలు

TDP- Cinema Stars: తెలుగునాట తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తరువాత సినీ తారలు రాజకీయరంగపై తళుక్కున మెరిశారు. పార్టీలో కీ రోల్ ప్రదర్శించారు. పార్టీ బలోపేతానికి కూడా ఉపయోగపడ్డారు. ఎన్నికల ప్రచారంలో సైతం పార్టీకి ప్లస్ పాయింట్ గా నిలిచేవారు. అయితే గత కొద్దిరోజులుగా ఆ పార్టీకి సినీ తారలు దూరవుతుండడం చర్చనీయాంశమైంది. టీడీపీ ఆవిర్భావం తరువాత జయప్రద, జయసుధ, శారద, రోజా, కవిత, దివ్యవాణి తదితరులు క్రియాశీలక పాత్ర పోషించారు. పార్టీతో పొసగక కొందరు, వయోభారంతో కొందరు పార్టీకి దూరమయ్యారు. అయితే ఎక్కువ మంది మాత్రం తమను బలవంతంగా సాగనంపారని ఆవేదన వ్యక్తం చేస్తూ దూరమయ్యారు. తాజాగా దివ్యవాణి టీడీపీలో మ‌హిళ‌లు ఇమ‌డ‌లేకపోతున్నార‌ని ప్రకటించడం చర్చనీయాంశమైంది. ఆపాత సినీ తరల ప్రస్తావన మరోసారి వచ్చింది.

TDP- Cinema Stars
Divya Vani , Chandrababu

ఈ సంద‌ర్భంగా హీరోయిన్ల కంటే అంద‌మైన యామినీశ‌ర్మ ఉదంతాన్ని ఉదాహ‌ర‌ణ‌గా చెబుతున్నారు. టీడీపీ అధికార ప్ర‌తినిధిగా యామినీశ‌ర్మ పోషించిన పాత్ర గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. టీడీపీ కార్య‌క్ర‌మాల‌కు ఆమె ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచేవారు. ఢిల్లీ వేదిక‌గా మోదీ స‌ర్కార్‌పై స‌మ‌ర‌భేరి మోగిస్తే, ఆ కార్య‌క్ర‌మంలో తెలుగు త‌ల్లిగా యామినీ శ‌ర్మ వేషం ధ‌రించి, టీడీపీకి సేవ‌లందించారు.టీడీపీపై జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ వ్య‌తిరేక ప్ర‌చారాన్ని చేప‌డితే, ఆ పార్టీపై యామినీ అస్త్రాన్ని టీడీపీ ప్ర‌యోగించింది. మ‌ల్లెపూలు న‌ల‌ప‌డానికి త‌ప్ప, ప‌వ‌న్‌క‌ల్యాన్ ఎందుకూ ప‌నికిరార‌ని ఘాటు విమ‌ర్శ‌ల‌తో వార్త‌ల్లో వ్య‌క్తిగా నిలిచారు. ఆ త‌ర్వాత ఓ టీవీ డిబేట్లో జ‌న‌సేన అధికార ప్ర‌తినిధి దెబ్బ‌కు, ఏకంగా ఆ చ‌ర్చ‌ను యామినీ బ‌హిష్క‌రించ‌డం పెద్ద ఎత్తున చ‌ర్చ‌నీయాంశ‌మైంది. టీడీపీ అంటే ప్రాణంగా ప్రేమించే యామిని …చివ‌రికి ఆ పార్టీలోని కొంద‌రి దుశ్చ‌ర్య‌లు త‌న‌ను తీవ్ర ఆవేద‌న‌కు గురి చేశాయ‌ని వాపోయారు. లోకేశ్ పేరు చెబితే తీవ్ర‌స్థాయిలో మండిప‌డే స్థాయికి వెళ్ల‌డం ఆశ్చ‌ర్యం క‌లిగించింది. ప్ర‌స్తుతం ఆమె బీజేపీలో కొన‌సాగుతున్నారు.

Also Read: CM Jagan-BJP: ఏపీ సర్కారుకు భలే చాన్స్.. జగన్ కేంద్రంతో కలబడతారా? కలిసిపోతారా?

దివ్యవాణి ఎపిసోడ్ తో..
తాజాగా దివ్య‌వాణి ఎపిసోడ్ తెరపైకి వచ్చింది. పార్టీలో కొంద‌రు దుష్ట‌శ‌క్తులున్నార‌ని దివ్య‌వాణి ఆవేద‌న వ్య‌క్తం చేయ‌డం విశేషం. గ‌తంలో క‌విత‌, రోజా, జ‌య‌సుధ‌, జ‌య‌ప్ర‌ద త‌దిత‌రుల‌కు న్యాయం జ‌ర‌గలేద‌ని, ఇప్పుడు వారి ప‌రిస్థితే త‌న‌కు వ‌చ్చింద‌ని దివ్య‌వాణి సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. ఇలా టీడీపీలో బ‌య‌టికి చెప్పుకోలేని మ‌హిళా నేత‌లు ఉన్నార‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఇలా ఎందుకు జ‌రుగుతున్న‌దో పార్టీ పెద్ద‌లు దృష్టి సారించాల్సిన ఆవ‌శ్య‌క‌త‌ను పార్టీ నుంచి వెళ్లిపోయిన మ‌హిళ‌ల ఉదంతాలు హెచ్చ‌రిస్తున్నాయి. ప్ర‌తి ఒక్క‌రూ చంద్ర‌బాబు అంటే గౌర‌వంగా చెబుతారు.ఒక‌వైపు మ‌హిళ‌లంటే ఎంతో గౌర‌వంగా చెప్పుకునే పార్టీలోనే, కొంత మంది నేత‌ల చేష్ట‌లు టీడీపీకి అప్ర‌తిష్ట తెచ్చేలా వున్నాయి. ఇలాంటి ధోర‌ణుల‌పై పార్టీ పెద్ద‌లు దృష్టి సారించాల్సిన అవసముంది.

TDP- Cinema Stars
Chandrababu

కలిసిరాని మహానాడు..
మహానాడు సినీ తారలకు కలిసి రావడం లేదు. గతసారి మహానాడులో తనకు అవమానం జరిగిందని కవిత పార్టీకి దూరమయ్యారు. ఈ ఏడాది దివ్యవాణి వంతు వచ్చింది. అగ్రనేతలతో తమకు ఇబ్బందులు లేవని.. ఆ త‌ర్వాత స్థాయి నేత‌ల‌తోనే అస‌లు ఇబ్బంది అని ఆ పార్టీకి చెందిన కొంద‌రు నాయ‌కులు చెబుతుండ‌డం విశేషం. యామినీ శ‌ర్మ‌, దివ్య‌వాణి బ‌య‌టికి చెప్పుకున్నార‌ని, తాము చెప్పుకోలేక మ‌న‌సులోనే కుమిలిపోతున్నామ‌నే మ‌హిళా నేత‌లు లేక‌పోలేదు. రాజ‌కీయాల్లో మ‌హిళలు రాణించాలంటే అనేక అవ‌రోధాల‌ను దాటుకోవాల్సి వస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మహిళలకు అగ్రతాంబూలం ఇచ్చామని చెబుతున్న తెలుగుదేశం పార్టీలోనే మహిళలకు పొమ్మన లేక పొగ పెడుతుండడం విమర్శలకు గురిచేస్తోంది.

Also Read:Kothapalli Subbarayudu: వైసీపీ నుంచి కొత్తపల్లి సుబ్బారాయుడు సస్పెండ్..ఆ వ్యాఖ్యలు చేసిన 24 గంటల్లో..

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

2 COMMENTS

Comments are closed.

Exit mobile version