Vivaha Bhojanambu Telugu Movie Review : ‘వివాహ భోజ‌నంబు’ మూవీ రివ్యూ

Vivaha Bhojanambu Telugu Movie Review మూవీ రివ్యూః వివాహ భోజనంబు నటీనటులుః సత్య, సందీప్ కిషన్, ఆర్జవి, సుదర్శన్, శ్రీకాకంత్ అయ్యంగార్, సుబ్బరాయశర్మ, టీఎన్ఆర్(దివంగత) హర్ష, శివన్నారాయణ, తదితరులు నిర్మాతః కె.ఎస్‌.శినిష్‌, సందీప్ కిష‌న్‌ సంగీతంః ఏఆర్ రెహ‌మాన్‌ ర‌చ‌నః భాను భోగ‌వ‌ర‌పు దర్శకత్వంః రామ్ అబ్బ‌రాజు రిలీజ్ః సోనీ లివ్‌ సినిమాల్లో ట్రెండ్ త‌ర‌చూ మారుతూ ఉంటుంది. ఒక‌ప్పుడు ట్రాజెడీ సినిమాల‌దే రాజ్యం. ఏడుపు క‌థ‌ను స‌రిగ్గా ప్ర‌జెంట్ చేస్తే.. బాక్సాఫీస్ వ‌ద్ద క‌న‌క‌వ‌ర్ష‌మే. […]

Written By: Raghava Rao Gara, Updated On : August 27, 2021 12:53 pm
Follow us on

Vivaha Bhojanambu Telugu Movie Review

మూవీ రివ్యూః వివాహ భోజనంబు
నటీనటులుః సత్య, సందీప్ కిషన్, ఆర్జవి, సుదర్శన్, శ్రీకాకంత్ అయ్యంగార్, సుబ్బరాయశర్మ, టీఎన్ఆర్(దివంగత) హర్ష, శివన్నారాయణ, తదితరులు
నిర్మాతః కె.ఎస్‌.శినిష్‌, సందీప్ కిష‌న్‌
సంగీతంః ఏఆర్ రెహ‌మాన్‌
ర‌చ‌నః భాను భోగ‌వ‌ర‌పు
దర్శకత్వంః రామ్ అబ్బ‌రాజు
రిలీజ్ః సోనీ లివ్‌

సినిమాల్లో ట్రెండ్ త‌ర‌చూ మారుతూ ఉంటుంది. ఒక‌ప్పుడు ట్రాజెడీ సినిమాల‌దే రాజ్యం. ఏడుపు క‌థ‌ను స‌రిగ్గా ప్ర‌జెంట్ చేస్తే.. బాక్సాఫీస్ వ‌ద్ద క‌న‌క‌వ‌ర్ష‌మే. కాల క్ర‌మంలో అది మారింది. ఇప్పుడు న‌డుస్తున్న ట్రెండ్ కామెడీ. బ‌హుశా ఈ ఉరుకుల ప‌రుగుల జీవితం కూడా దీనికి కార‌ణం కావొచ్చు. ఏమాత్రం టైం దొరికినా కాస్త న‌వ్వుకొని రిలాక్స్ అయిపోవ‌డానికి జ‌నాలు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. దీంతో.. కామెడీ సినిమాలు పుట్టుకొస్తున్నాయి. న‌వ‌ర‌సాల్లో ఎవ‌ర్ గ్రీన్ అయిన హాస్యాన్ని అతి చేయ‌క‌పోతే.. అద్భుత‌మైన స‌క్సెస్ ను టేస్ట్ చేయొచ్చు. మ‌రి, ఈ కోవ‌లోనే వ‌చ్చిన ‘వివాహ భోజ‌నంబు’ చిత్రం ప్రేక్షకులను ఎంత మేర ఆక‌ట్టుకుంది అన్న‌ది చూద్దాం.

క‌థః స‌త్య ఒక ఎల్ ఐసీ ఏజెంట్‌. పిసినారికి అబ్బ‌లాంటోడు. ప‌ది రూపాయ‌ల‌ను వంద‌సార్లు లెక్క‌పెట్టుకునే ర‌కం. అలాంటి పిసినారి హీరోయిన్ ఆర్జ‌వి ప్రేమ‌లో ప‌డ‌తాడు. ఇద్ద‌రూ పెళ్లి చేసుకోవాల‌ని డిసైడ్ అవుతారు. స‌త్య తీరు చూసిన అమ్మాయి కుటుంబం అయిష్టంగానే పెళ్లికి అంగీక‌రిస్తుంది. పెళ్లి స‌త్య ఇంట్లోనే. అప్ప‌టికి క‌రోనా విజృంభించ‌డంతో.. ప్ర‌భుత్వం లాక్ డౌన్ ప్ర‌క‌టిస్తుంది. దాంతో.. పెళ్లికి వ‌చ్చిన ఆర్జ‌వి కుటుంబం మొత్తం స‌త్య ఇంట్లోనే ఉండిపోతుంది. రూపాయి ఖ‌ర్చు చేయ‌డానికి ప‌దిసార్లు ఆలోచించే స‌త్య‌.. వారంద‌రూ ఇంట్లో ప‌డి తింటుంటే ఎలా ఫీల‌య్యాడు? వారికి తిండి పెట్ట‌డానికి ఎంత ఇబ్బందులు ప‌డ్డాడు? చివరకు వాళ్లను పంపించాడా? లేదా? అన్నది అసలు కథ.

కథనంః క‌రోనా తొలి ద‌శ లాక్ డౌన్ లో చాలా మందికి ఈ ప‌రిస్థితి ఎదురైంది. ప్ర‌భుత్వం స‌డెన్ గా లాక్ డౌన్ ప్ర‌క‌టించ‌డంతో.. శుభ‌కార్యాల‌కు వెళ్లిన‌వారు, ఇత‌ర ప‌నుల‌మీద వెళ్లిన‌వారు బంధువుల ఇళ్ల‌లోనే చిక్కుకుపోయారు. ఈ పాయింట్ ను ప‌ట్టుకొని క‌థ‌ను అల్లాడు ర‌చ‌యిత భాను. దీనికి సాధ్య‌మైనంత వ‌ర‌కు కామెడీని జోడించి న‌వ్వించే ప్ర‌య‌త్నం చేశాడు. దీపాలు వెలిగించ‌డం.. చ‌ప్ప‌ట్లు కొట్ట‌డం.. వంటి అంశాల‌ను కూడా వాడేశాడు. ఫ‌స్టాఫ్ లో వాళ్ల‌ను పోషించ‌డానికి డ‌బ్బులు ఖ‌ర్చు చేసేందుకు స‌త్య ప‌డిన ఇబ్బందులు స‌హా.. ఇత‌ర స‌న్నివేశాలు మంచి వినోదం పంచాయి. ఇక‌, సెకండ్ హాఫ్ లో ఈ బాధ‌లు భ‌రించ‌లేక వారిని పంపించ‌డానికి సిద్ధ‌మ‌వుతాడు స‌త్య‌. హెల్త్ ఎమ‌ర్జెన్సీ పేరుతో అంబులెన్స్ ద్వారా వారిని త‌ర‌లించాల‌ని చూస్తాడు. ఈ అంబులెన్స్ డ్రైవ‌ర్ గా సందీప్ కిష‌న్ న‌టించాడు. అత‌న్ని తాగుబోతుగా చూపించాడు ద‌ర్శ‌కుడు. క్లైమాక్స్ మాత్రం రెగ్యుల‌ర్ గానే ముగించాడు.

విశ్లేష‌ణః న‌వ‌త‌రం క‌మెడియ‌న్ల‌లో అద్భుత‌మైన టైమింగ్ తో కామెడీ పండించే హాస్య‌న‌టుడు స‌త్య‌. అత‌న్ని ప్ర‌ధాన పాత్ర‌కు ఎంచుకోవ‌డ‌మే తొలి స‌క్సెస్‌. పీనాసిగా అద‌ర‌గొట్టాడు. అత‌ని టైమింగ్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. సినిమా మొత్తాన్ని ప్రధానంగా తనే మోశాడు. సత్య స్నేహితుడిగా సుదర్శన్, మామగా శ్రీకాంత్ అయ్యంగార్ మంచి సపోర్ట్ ఇచ్చారు. మిగిలిన నటులు హర్ష, శివన్నారాయణ, సుబ్బరాయ శర్మ పరిధిమేరకు నటించారు. అయితే.. సందీప్ కిషన్ పాత్ర మాత్రం కథలో లీనం చేసినట్టుగా లేదు. దాన్ని అతికించినట్టుగా ఉంది. బ‌హుశా హీరో కాబ‌ట్టి.. ప్ల‌స్ అవుతుంద‌ని తీసుకుని ఉంటారు.. కానీ, ఈ పాత్ర‌కు స‌ప్త‌గిరి అయితే బాగుండేది. మొత్తంగా సినిమా ఫ‌స్ట్ హాఫ్ లో అద్దిరిపోయిన‌ప్ప‌టికీ.. సెకండాఫ్ కు వ‌చ్చేస‌రికి కాస్త ట్రాక్ త‌ప్పిన‌ట్టుగా అనిపిస్తుంది. ప‌లు స‌న్నివేశాలు ఎక్క‌డో చూసిన‌ట్టుగానే అనిపిస్తాయి. క్లైమాక్స్ కూడా ఊహించిన‌ట్టుగానే సాగుతుంది. అయితే.. ఇలాంటి సినిమాకు ఇంత‌కు మించిన ముగింపు ఇవ్వ‌లేమ‌ని ప్రేక్ష‌కుడు స‌ర్దిచెప్పుకోవ‌చ్చు. ఇక‌, అన్వీ మ్యూజిక్ చ‌క్క‌గా కుదిరింది. ఓవ‌రాల్ గా ఒక మంచి కామెడీ సినిమా చూశామ‌ని భావించొచ్చు.

బ‌లాలుః స‌త్య న‌ట‌న‌, క‌థ‌, ఫ‌స్ట్ హాఫ్‌

బ‌ల‌హీన‌త‌లుః సందీప్ కిష‌న్ ఎపిసోడ్‌

లాస్ట్ లైన్ః ‘వివాహ భోజ‌నంబు’ పసందైన విందు

రేటింగ్ః 2.75 / 5