Rangabali Movie Review : ‘రంగబలి’ మూవీ ఫుల్ రివ్యూ

ఈసారి ప్రయోగాల జోలికి వెళ్లకుండా ఒక పూర్తి స్థాయి కమర్షియల్ ఎంటర్టైనర్ చెయ్యాలనే ఉద్దేశ్యం తో 'రంగబలి' అనే చిత్రం చేసాడు. నేడు గ్రాండ్ గా విడుదలైన ఈ సినిమాతో నాగ శౌర్య హిట్ కొట్టాడా లేదా అనేది ఇప్పుడు ఈ రివ్యూ లో చూడబోతున్నాము.

Written By: NARESH, Updated On : July 7, 2023 9:14 am
Follow us on

Rangabali Movie Review : నటీనటులు: నాగశౌర్య, యుర్తి తరేజ, గోపరాజు రమణ, షైన్ టామ్ చాకో, సత్య, శరత్ కుమార్, మురళీ శర్మ, శుభలేఖ సుధాకర్.

దర్శకుడు: పవన్ బాసంశెట్టి.
సంగీతం : పవన్ సీహెచ్.
నిర్మాత : సుధాకర్ చెరుకూరి

యూత్ మరియు ఫ్యామిలీ ఆడియన్స్ లో మంచి ఇమేజి ఉన్న నాగ శౌర్య కి గత కొంతకాలం గా హిట్స్ లేక బ్యాడ్ ఫేస్ ని ఎదురుకుంటున్న సంగతి తెలిసిందే. కష్టపడే తత్త్వం ఉంది, మంచి అందం , కటౌట్ మరియు నటన ఇలా స్టార్ హీరో అవ్వడానికి కావాల్సిన అన్నీ లక్షణాలు ఉన్నప్పటికీ కూడా కాలం కలిసి రాక ఇంకా మీడియం రేంజ్ హీరోల క్యాటగిరీలోనే కొనసాగుతున్నాడు నాగ శౌర్య. ఇది ఆయన అభిమానులకు కూడా ఎంతో బాధకి గురి చేసే విషయం. ఆయన హీరో గా నటించిన సినిమాలలో కమర్షియల్ గా పెద్ద హిట్ అయినా చిత్రం ‘చలో’. ఈ సినిమా తర్వాత ఆయన ఎన్నో ప్రయోగాలు చేసాడు కానీ, ఒక్కటి కూడా వర్కౌట్ అవ్వలేదు. ఈసారి ప్రయోగాల జోలికి వెళ్లకుండా ఒక పూర్తి స్థాయి కమర్షియల్ ఎంటర్టైనర్ చెయ్యాలనే ఉద్దేశ్యం తో ‘రంగబలి’ అనే చిత్రం చేసాడు. నేడు గ్రాండ్ గా విడుదలైన ఈ సినిమాతో నాగ శౌర్య హిట్ కొట్టాడా లేదా అనేది ఇప్పుడు ఈ రివ్యూ లో చూడబోతున్నాము.

కథ :

సొంత ఊరు రాజవరం లో కింగ్ లాగ బ్రతకాలని ఆశపడుతుంటాడు శౌర్య అలియాస్ షో (నాగ శౌర్య). అందుకే ఆయన చేసిన ప్రతీ పని బిల్డప్ తో కూడుకొని ఉంటుంది, ప్రతీ ఒకరు ఆయన చేసే పని వైపు చూసేలాగా ఎదో ఒక కార్యక్రమం చేస్తూనే ఉంటాడు. ఇంత బిల్డప్ లు ఇచ్చే శౌర్య రాజానగరం లోని ‘రంగబలి’ సెంటర్ కి వచ్చేలోపు పడిపోతూ ఉంటాడు. ఇక ఆ ఊరి MLA పరశురామ్ (షైన్ టామ్ చాకో) తో శౌర్య కి మంచి సాన్నిహిత్య సంబంధం ఉంటుంది. మరోపక్క తండ్రి మెడికల్ షాప్ బిజినెస్ తో ఊర్లో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదిస్తాడు, ఇక బాధ్యతలు మొత్తం శౌర్య కి అప్పగించాలనే ఉద్దేశ్యం తో వైజాగ్ కి వెళ్లి మెడిసిన్ పూర్తి చేయాల్సిందిగా ఆదేశిస్తాడు. అలా మెడికల్ చదవడానికి వెళ్లిన శౌర్య కి సహజ(యుక్తి ) అనే అమ్మాయితో పరిచయం ఏర్పడి, ఆ పరిచయం కాస్త ప్రేమగా మారుతుంది. అక్కడి నుండే శౌర్య కి సమస్యలు ఎదురు అవుతాయి. అసలు ఆ అమ్మాయికి రంగబలి కి సంబంధం ఏమిటి?, అసలు సెంటర్ కి రంగబలి అనే పేరు ఎందుకు పెట్టారు?, రంగబలి తో శౌర్య కి ముడిపడిన ఫ్లాష్ బ్యాక్ ఏమిటి ?, ఇలాంటి ప్రశ్నలకు సమాధానం దొరకాలి అంటే రంగబలి చిత్రం చూడాల్సిందే.

విశ్లేషణ :

సినిమా టీజర్ , ట్రైలర్ చూసినప్పుడే ఇది పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్, ఈసారి నాగశౌర్య పెద్ద హిట్ కొట్టబోతున్నాడు అనే విషయం ప్రేక్షకులకు అర్థం అయ్యింది. వాళ్ళ అంచనాలకు తగ్గట్టుగానే ఫస్ట్ హాఫ్ మొత్తం అదిరిపోయింది. ఇలాంటి కథలు ఇది వరకు ఎన్నో చూసాము, కానీ ఎక్కడా కూడా బోర్ కొట్టలేదు అనే ఫీలింగ్ రప్పిస్తుంది. ఈ సినిమాకి ఆయువుపట్టులాగా నిల్చింది కమెడియన్ సత్య కామెడీ. అతని కామెడీ డైలాగ్స్ కి థియేటర్స్ లో ప్రేక్షకులకు పొట్ట చెక్కలు అవ్వాల్సిందే. ఆ రేంజ్ లో వర్కౌట్ అయ్యింది సత్య కామెడీ. విడుదలకు ముందు ప్రొమోషన్స్ నుండే సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ గా నిలుస్తూ వచ్చాడు సత్య, ఒక విధంగా చెప్పాలంటే ఈ సినిమాకి హైప్ రావడానికి కారణం సత్యానే. సినిమా విడుదలైన తర్వాత కూడా ఆయన గురించే మాట్లాడుకుంటున్నారు ఇప్పుడు. ఇంటర్వెల్ కూడా సరదా ట్విస్టు తో చాలా ఫన్నీ గా లాగించేసాడు డైరెక్టర్.

ఇలాంటి రొటీన్ కథలకు ఫస్ట్ హాఫ్ ఎలా ఉన్నా సెకండ్ హాఫ్ మాత్రం కచ్చితంగా అదిరిపోవాలి. స్క్రీన్ ప్లే ప్రేక్షకులకు ఏమాత్రం బోర్ కొట్టని విధంగా ఉండాలి. అప్పుడే ఆడియన్స్ సంతృప్తి చెందుతారు. కానీ ఈ చిత్రం విషయం లో అదే లోపించింది. సెకండ్ హాఫ్ ప్రతీ సన్నివేశానికి గ్రాఫ్ తగ్గిపోతూ వెళ్తుంది. ఫస్ట్ హాఫ్ లో ఉన్నంత ఎంటర్టైన్మెంట్ సెకండ్ హాఫ్ లో ఉండదు. ఇక క్లైమాక్స్ అయితే చాలా సోదిగా అనిపిస్తుంది. అంత పగలు పంతాలు ఉన్నవారు, కేవలం హీరో ఇచ్చే 5 నిమిషాల ప్రసంగం తో మారిపోతారా అని చూసే ప్రేక్షకులకు అనిపించక తప్పదు. ఇక హీరో నాగ శౌర్య ఎప్పటి లాగానే ఈ సినిమాలో కూడా మంచిగా నటించాడు. అతని కామెడీ టైమింగ్ కూడా సినిమాకి బాగా ప్లస్ అయ్యింది. హీరోయిన్ యుక్తి కూడా వెండితెర మీద చూసేందుకు ఎంతో అందంగా అనిపించింది. నటన కూడా పరవాలేదు, ఫస్ట్ రేంజ్ సెకండ్ హాఫ్ ఉంది ఉంటే నాగ శౌర్య కి కావాల్సిన రేంజ్ భారీ బ్లాక్ బస్టర్ ఈ చిత్రం రూపం లో దక్కేది, పాపం బ్యాడ్ లక్.

చివరి మాట :

కమర్షియల్ సినిమాలను నచ్చే వారికి ఈ చిత్రం నచ్చుతుంది, కాసేపు సత్య కామెడీ ని చూసి ఎంజాయ్ చేద్దాం అనుకునేవాళ్లు ఈ వీకెండ్ కి మంచి టైం పాస్ అయ్యే సినిమా.

రేటింగ్ : 2.5/5