Pelli Kani Prasad Movie Review : తెలుగు సినిమా ఇండస్ట్రీలో కమెడియన్స్ అందరూ హీరోలుగా మారుతూ వాళ్ళ లక్కును పరీక్షించుకుంటున్న విషయం మనకు తెలిసిందే. ఇక ఇప్పటివరకు చాలామంది కమెడియన్స్ హీరోలుగా మారారు. అందులో కొంత మంది సక్సెస్ లను దక్కించుకుంటే మరి కొంతమంది మాత్రం ఫెయిల్యూర్స్ ను మూట గట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇక సప్తగిరి లాంటి నటుడు కమెడియన్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్నప్పటికి హీరోగా పలు సినిమాల్లో నటిస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవాలని చూస్తున్నాడు. ఇక ఇప్పటికే సప్తగిరి ఎక్స్ ప్రెస్ లాంటి సినిమాలతో మంచి విజయాన్ని అందుకున్నాడు. అయితే ఆయన చేసిన ‘పెళ్ళి కాని ప్రసాద్’ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది ప్రేక్షకులను మెప్పించిందా? లేదా అనే విషయాలను మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…
కథ
ఈ సినిమా కథ విషయానికి వస్తే ప్రసాద్ అనే వ్యక్తి మలేషియాలో ఒక హోటల్ పెట్టుకొని నెలకు నాలుగు లక్షల రూపాయలను సంపాదిస్తూ ఉంటాడు. 36 సంవత్సరాలు ఉన్న ఈ వ్యక్తికి పెళ్లి కాకపోవడంతో సంబంధాలను చూస్తూ ఉంటాడు. ఇక బిళ్ళ నాన్న కట్నం మూడ ఆశతో ఏదో ఒకటి చెబుతూ తన పెళ్లిని పోస్టు పోన్ చేస్తూ ఉంటాడు. మరి ఇలాంటి సందర్భంలోనే ఏజ్ ఉన్నప్పుడే పెళ్లి చేసుకోవాలి. ఏజ్ దాటిపోతే పెళ్లి చేసుకున్న వేస్టే అని భావించే ప్రసాద్ పెళ్లి కోసం ఈగర్ గా వెయిట్ చేస్తూ ఉంటాడు. ఒకరోజు అతనికి ఒక అమ్మాయి(ప్రియాంక శర్మ) తో పరిచయం ఏర్పడుతుంది. ఇక ఆ అమ్మాయి ఫార్నర్ ని పెళ్లి చేసుకోవాలని అనుకుంటుంది. మరి ఆ మధ్యలో వీళ్ళిద్దరి మధ్య ఎలాంటి కనెక్టివిటీ కుదిరింది. వీళ్ళిద్దరి మధ్య ప్రేమ ఎలా చిగురించింది. మొత్తానికైతే పెళ్లి కాని ప్రసాద్ పెళ్లి చేసుకున్నాడా లేదా అనే విషయాలు తెలియాలంటే మీరు ఈ సినిమా చూడాల్సిందే…
విశ్లేషణ
ఇక ఈ సినిమా విశ్లేషణ విషయానికి వస్తే ఈ సినిమా కథ అవుట్ డేటెడ్ కథ అనే చెప్పాలి. ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం రావలసిన కథతో ఇప్పుడు సినిమా చేశారు. అయినప్పటికి ట్రీట్మెంట్ లో ఏమైనా కొత్తదనాన్ని చూపించారా అంటే అది లేదు. రోటీన్ రొట్ట ఫార్ములా లో సినిమా సాగుతూ ఉంటుంది. మొదటి నుంచి సినిమా ప్రేక్షకుడిని ఎంగేజ్ చేయడంలో ఏమాత్రం సక్సెస్ ని సాధించలేక పోయింది. సీన్ కి సీన్ కి మధ్య ఒక ఫ్లో అయితే లేకుండా పోయింది. ఇక ప్రతి ఒక్కరూ ఈ సినిమా చూస్తున్నంత సేపు చాలా వరకు బోరింగ్ గా ఫీల్ అవుతూ ఉంటారు.
ఇందులో ఒక్కటంటే ఒక్కటి కూడా ప్లస్ పాయింట్ లేదని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. అక్కడక్కడ చిన్న చిన్న జోకులు ఉన్నప్పటికి అది అవుట్ డేటెడ్ కామెడీ అనిపిస్తూ ఉంటాయి. ఎక్కడ కూడా ప్రేక్షకుడు పూర్తిగా అయితే నవ్వడు. మరి ఇలాంటి ఒక ఔట్ డేటెడ్ కథతో సప్తగిరి ఎందుకు సినిమాలు చేశాడు అనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలిపోయింది. ఇక దర్శకుడు సినిమాని డ్రైవ్ చేసిన విధానం అస్సలు బాలేదు. సినిమాకి మ్యూజిక్ కూడా అస్సలు సెట్ అవ్వలేదు. కీలకమైన కొన్ని ఎమోషనల్ సీన్స్ ని కూడా దర్శకుడు క్యూరియాసిటి తో తెరకెక్కించలేకపోయాడు. మొత్తానికైతే ఈ సినిమాని చూసిన ప్రతి ప్రేక్షకుడు కొంతవరకు నిరాశను వ్యక్తం చేస్తున్నాడనే చెప్పాలి…
ఆర్టిస్టుల పర్ఫామెన్స్
ఇక ఆర్టిస్టుల పర్ఫామెన్స్ విషయానికి వస్తే సప్తగిరి మెయిన్ లీడ్ లో నటించాడు. అతను అంతో ఇంతో కామెడీ చేయాలనే ప్రయత్నం చేసినప్పటికి సినిమా రైటింగ్ లో దమ్ము లేకపోవడం వల్ల అతని కామెడీ కూడా పెద్దగా వర్కౌట్ అయితే కాలేదు. ఇక చాలా రోజుల తర్వాత ఆయన సినిమా హీరోగా చేశాడు. కాబట్టి ఈ సినిమా అయిన సక్సెస్ ని సాధిస్తుందని అందరు అనుకున్నారు. కానీ సప్తగిరి యాక్టింగ్ బాగున్నప్పటికి సినిమాలో పెద్దగా మ్యాటర్ లేకపోవడంతో సినిమా ఆశించిన మేరకు ప్రేక్షకుడిని మెప్పించలేకపోయింది.
ఇక సప్తగిరి సినిమా హీరోగా చేసే కంటే కమెడియన్ గా చేసుకుంటే బెటర్ అని ఈ సినిమా చూస్తే అనిపిస్తుంది. నటుడిగా మాత్రం సప్తగిరి చాలా మంచి పర్ఫామెన్స్ అయితే ఇచ్చాడు…ఇక హీరోయిన్ ప్రియాంక శర్మ సైతం తన పాత్ర పరిధి మేరకు ఓకే అనిపించేలా నటించారు. సత్యసాయి శ్రీనివాస్, ప్రమోదిని, రోహిణి లాంటి నటులు కొంతవరకు సినిమాని కాపాడే ప్రయత్నం చేసినప్పటికి వాళ్ళ కామెడీలో పెద్దగా కొత్తదనం లేకపోవడం వల్ల వాళ్లు చేసిన యాక్టింగ్ సినిమాకి ప్లస్ అయింది గానీ సినిమాని సక్సెస్ తీరాలకు చేర్చలేకపోయింది…
టెక్నికల్ అంశాలు
ఇక టెక్నికల్ అంశాల విషయానికి వస్తే ఈ సినిమాకి మ్యూజిక్ అంత బాగా సెట్ అవ్వలేదు. బ్యా గ్రౌండ్ స్కోర్ విషయంలో కూడా అసలు ఏ మాత్రం జాగ్రత్త వహించకుండా సినిమాను ముందుకు నడిపించారు… సినిమాటోగ్రఫీ విషయానికి వస్తే అక్కడక్కడ కొన్ని షాట్స్ ఓకే అనిపించినప్పటికి ఓవరాల్ గా మాత్రం సినిమాటోగ్రఫీ కూడా ఈ సినిమాకు భారీగా మైనస్ అయిందనే చెప్పాలి… ప్రొడక్షన్ వాల్యూస్ ఓకే అనిపించాయి…
ప్లస్ పాయింట్స్
సప్తగిరి యాక్టింగ్
మైనస్ పాయింట్స్
ఔట్ డేటెడ్ కథ
మ్యూజిక్
డైరెక్షన్
రేటింగ్
ఈ సినిమాకి మేమిచ్చే రేటింగ్ 1.5/5